ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ
మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు. వ్యవహారిక భాష వాదులకు వ్యతిరేఖంగా జయంతి రామయ్య పంతులు "A Defence of literary telugu "అన్న గ్రంథం రచించారు.
ప్రారంభ చరిత్ర
[మార్చు]ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే 1911 మద్రాస్‌లో ఏర్పడింది. 8.4.1913 బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ధి, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి, శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. పిఠాపురం మహారాజా వారి ఆర్థిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో రచించారు.
కాకినాడకు తరలింపు
[మార్చు]సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. 1947లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది
ప్రభుత్వ ఆధీనంలోకి
[మార్చు]1973 నుండి సాహిత్య పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ భవనానికి మరిన్ని హంగులు కూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE) అని మార్పుచేసారు. ఆఫ్ఫటి నుండి ఇది ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఆధీనంలో పనిచేస్తున్నది.
సేకరణలు
[మార్చు]1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురాతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.
ఇతర విశేషాలు
[మార్చు]- సాహిత్య పరిషత్ కేవలం ప్రచురణే కాక సుమారు 10,000 పుస్తకాలను భద్రపరచింది.
- తాటిఆకుల తాళపత్ర గ్రంథాలను సుమారుగా 4,776 వరకూ సేకరించి భద్రపరచింది.
- పురాతన భౌద్ద స్తూపాల వద్ద లభ్యమైన విగ్రహాలను భద్రపరుస్తున్నది
చిరునామా
[మార్చు]ఫైర్ సర్వీస్ కార్యాలయం ప్రక్కన, పశువుల ఆసుపత్రి రోడ్, పైపుల చెరువు వద్ద, రామారావు పేట, కాకినాడ
సాహిత్య పరిషత్ భవన చిత్రాలు
[మార్చు]-
పరిషత్ భవన ముఖద్వారం
-
భవన ధాతలు-ప్రభల సుందరరామయ్య గారు, శ్రీమతి సుబ్బమ్మ గారు
-
పరిషత్ ఆవరణలో విగ్రహాలు
-
ప్రదర్శన హాలు ముఖద్వారం
-
ఆవరణలో శిలాఫలకం
-
కార్యక్రమాలు జరిగే హాలు, గ్రంథ శాల
మూలాలు,ఆధారాలు
[మార్చు]
- https://web.archive.org/web/20160306233531/http://godaavari.blogspot.in/2015/05/andhra-sahitya-parishad-government.html
- http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/manuscript-museum-in-dire-straits/article5942390.ece
- http://www.inkakinada.com/news/headline/andhra-sahitya-parishad-review-meet