Jump to content

ఆంధ్రభృత్యులు

వికీపీడియా నుండి

ఆంధ్రభృత్యులు, పురాణాలలో పేర్కొన్న ఒక రాజవంశం. ఆంధ్రభృత్యుల జాబితాలను వివిధ పురాణాలు పేర్కొన్నాయి. క్రీ.పూ. 230 లో దక్కనులో మౌర్యుల పాలనను ముగించి క్రీ.శ. 3వ శతాబ్దం చివరి వరకు పాలించిన శాతవాహనులతో వారు ఎక్కువగా గుర్తించబడ్డారు. ఉచ్ఛస్థితిలో ఉండగా వారి పాలన ఉత్తరాన, బహుశా మగధ వరకు విస్తరింపజేసారు.[1] ఆంధ్రభృత్యులు అనే పదాన్ని కొంతమంది చరిత్రకారులు చాలా సందిగ్ధంగా ఉపయోగించారు - కొన్నిసార్లు వీరే శాతవాహనులు అని అర్థం లోనూ, కొన్నిసార్లు వారి సామంతులు అని అర్థం లోనూ వాడారు.[2] ఇంపీరియల్ ఆంధ్రుల చిన్న శాఖ అయిన నాగులు అయిన చూతులను ఆంధ్రభృత్యులని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. [3]

ఆంధ్రజాతీయ లేదా ఆంధ్ర అనే పేరు పురాణాలలో కనిపిస్తుంది, ఇది దాని స్థాపకుడు చివరి కణ్వ రాజుకు భృత్యుడని సూచిస్తుంది. సర్ ఆర్. జి. భండార్కర్ విష్ణు పురాణ శైలులను అనుసరించి సిముకా (శ్రీముఖుడు) స్థాపించిన రాజవంశం ఆంధ్రభృత్యులని, అనగా ఒకప్పుడు సేవకులు అయిన ఆంధ్రులు అనీ అన్నాడు.[4] కానీ ఆ హోదా సిముక (శ్రీముఖ) వంశానికి వారసులని పేర్కొన్న ఏడుగురు ఆభీరులకు కూడా వర్తిస్తుంది.[5]

సూచనలు

[మార్చు]
  1. Shastry, Nilakanta K.A. (1955). The Illustrated History of South India: From Prehistoric Times to the Fall of Vijayanagar Oxford India Collection. Madras: Oxford University Press. p. 92. ISBN 9780198063568.
  2. Sukthankar, Vishnu Sitaram (1944). V.S. Sukthankar Memorial Edition, Volume 1. V. S. Sukthankar Memorial Committee, by Karnatak Publishing House. p. 257.
  3. Indian History Congress; Krishnarao, B.V. (1938). Proceedings. p. 71.
  4. Raychaudhuri, Hemchandra (2006). Political History Of Ancient India. Genesis Publishing Pvt Ltd. p. 336. ISBN 9788130702919.
  5. Pargiter, F. E. (2009). The Purana Text of the Dynasties of the Kali Age. BiblioBazaar. pp. IV, 24, 18. ISBN 9781115375603.

ఇవి కూడా చూడండి

[మార్చు]