అ ఆ ఇ ఈ (2009 సినిమా)
స్వరూపం
అ ఆ ఇ ఈ | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
నిర్మాత | బొద్దం అశోక్ యాదవ్ |
తారాగణం | శ్రీకాంత్ మీరా జాస్మిన్ సదా |
ఛాయాగ్రహణం | విజయ్ సి కుమార్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | శ్రీ కల్పన ఆర్ట్స్ |
విడుదల తేదీ | 6 నవంబర్ 2009 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అ ఆ ఇ ఈ (అతను ఆమె ఇంతలో ఈమెకు సంక్షిప్తం) శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా ప్రముఖ పాత్రలను పోషించగా అలీ, కోవై సరళ, కృష్ణ భగవాన్, కవిత, హేమ మొదలైన వారు ఇతర పాత్రలలో నటించారు. 2011లో ఈ సినిమా హిందీ భాషలో దిల్‌జలె ది బర్నింగ్ హార్ట్ పేరుతో పునర్మించబడింది.[1][2][3]
కథ
[మార్చు]చంద్రం, కళ్యాణి అన్యోన్యమైన దంపతులు. గర్భవతి ఐన కళ్యాణికి ఒక అరుదైన వ్యాధి ఉందని తెలిసి దాని చికిత్స కోసం 8 లక్షల రూపాయలు అవసరమౌతుంది. ఆ డబ్బులకోసం చనిపోయిన రమ్యకు భర్తగా నటిస్తాడు. కానీ చనిపోయిందని భావించిన రమ్య బ్రతికి వస్తుంది. చంద్రం కళ్యాణి, రమ్యల మధ్య చిక్కుకుపోతాడు. తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
నటీనటులు
[మార్చు]- శ్రీకాంత్ - చంద్రం, క్యాబ్ డ్రైవర్
- మీరా జాస్మిన్ - కళ్యాణి
- సదా - రమ్య
- తెలంగాణ శకుంతల - చంద్రం నాన్నమ్మ
- తనికెళ్ళ భరణి - రమ్య తండ్రి
- కవిత - రమ్య తల్లి
- కృష్ణ భగవాన్ - లాయర్
- హేమ
- ఎం.ఎస్.నారాయణ - డాక్టర్
- ఆలీ - పేషెంట్
- బ్రహ్మానందం
- కోవై సరళ
- గిరిబాబు - క్యాబ్ కంపెనీ యజమాని
- రఘుబాబు - రమ్య బావ
- సునీల్ - జేమ్స్ బాండ్ 000
- వెంకట్
- ఉత్తేజ్ - జేమ్స్ బాండ్ అసిస్టెంట్
- ఎ.వి.ఎస్.
- చిన్నా
- సూర్య
- వైజాగ్ ప్రసాద్
- తిరుపతి ప్రకాష్
- రామ్‌జగన్
- కళ్ళు చిదంబరం
- దువ్వాసి మోహన్
- పృథ్వీ
- ఒ.కళ్యాణ్
- గుండు సుదర్శన్
- మనోజ్ బాజ్‌పాయ్
- కౌషా
- కిన్నెర
- అపూర్వ
- సఖి
- శ్రీలలిత
- మాస్టర్ గోవింద్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
- కథ : నాగేశ్వరరావు
- సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
- ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్
- కూర్పు: గౌతంరాజు
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకుడు(లు) | నిడివి |
---|---|---|---|
1. | "కాశీకి పోయాను" | సునిధి చౌహాన్ | |
2. | "మిలమిల" | మనో, ఎస్.జానకి | |
3. | "పుప్పొడికన్నా" | ఉదిత్ నారాయణ్, ప్రణవి | |
4. | "ఎంత నరకం" | కార్తీక్, ఎం.ఎం.శ్రీలేఖ | |
5. | "అచ్చట ముచ్చట" | కార్తీక్, ఎం.ఎం.శ్రీలేఖ |
మూలాలు
[మార్చు]బయట లింకులు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2009 తెలుగు సినిమాలు
- శ్రీకాంత్ నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- కవిత నటించిన సినిమాలు
- ఉత్తేజ్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు