అస్సీరియా
అస్సీరియా అనేది సా.శ.పూ 21వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు విలసిల్లిన ఒక ముఖ్యమైన మెసొపొటేమియా నాగరికత. సా.శ.పూ 14 నుంచి 7 వ శతాబ్దం మధ్యలో ఇది ఒక సామ్రాజ్యంగా విలసిల్లింది.[1]
ఇది ప్రారంభపు కాంస్యయుగం నుంచి మొదలై ఇనుపయుగం చివరిదాకా కొనసాగింది. ఆధునిక చరిత్రకారులు అస్సీరియన్ కాలాన్ని ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ సంఘటనలు, భాషా పరిణామాల ఆధారంగా పురాతన (సుమారు 2600–2025 సా.శ.పూ), పాత (సుమారు 2025–1364 BC), మధ్య (సుమారు 1363–912 BC), నూతన (911–609 BC), సామ్రాజ్యానంతర (సా.శ.పూ 609 - సా.శ 240) కాలాలుగా విభజిస్తారు.[2][3] అస్సీరియన్ కాలపు మొదటి రాజధానియైన అస్సూర్ సా.శ.పూ సుమారు 2600 లో స్థాపించబడింది. కానీ ఇది సా.శ.పూ 2100 సంవత్సరంలో ఉర్ రాజవంశం కూలిపోయేదాకా స్వతంత్రంగా ఉన్నట్లు ఆధారాలు లేవు.[4] ఆ తర్వాత వచ్చిన పుజూర్- అషూర్ రాజులు అస్సూర్ ను స్వతంత్ర్య రాజ్యంగా పరిపాలించారు. ఉత్తర మొసొపొటేమియాలోని ఈ ప్రాంతం లో అధికారం అస్థిరంగా సాగింది. సా.పూ 14వ శతాబ్దం ప్రారంభంలో అస్సిరియా మధ్య అస్సిరియన్ సామ్రాజ్యంగా మొదటి అషుర్-ఉబల్లిత్ కిందకు ఎదగడానికి ముందు నగరం అనేక సార్లు విదేశీ పాలన లేదా ఆధిపత్యానికి గురైంది.
మూలాలు
[మార్చు]- ↑ "Assyria | History, Map, & Facts". Britannica (in ఇంగ్లీష్). 2023-07-06. Retrieved 2023-08-13.
- ↑ Frahm 2017a, p. 5.
- ↑ Hauser 2017, p. 229.
- ↑ Roux 1992, p. 187.
ఆధార గ్రంథాలు
[మార్చు]- Frahm, Eckart (2023). Assyria: The Rise and Fall of the World's First Empire. London: Bloomsbury. ISBN 978-1-526-62381-2.
- Roux, Georges (1992). Ancient Iraq. Penguin Books. ISBN 978-0140125238.