Jump to content

అసెంబ్లీ భాష

వికీపీడియా నుండి

కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అసెంబ్లీ భాష ఒక నిమ్నస్థాయి (Low level) కంప్యూటర్ భాష. సాధారణంగా అసెంబ్లీ భాషలో ఉండే ఆదేశాలు (Instructions) అది ఎక్జిక్యూట్ అయ్యే యంత్రంలో ఉండే ఆదేశాలకు సరిసమానంగా ఉంటాయి.

యంత్రం మీద పనిచేసే ప్రోగ్రామును కోడ్ రూపంలో రాసేందుకు రూపొందించిన ఈ అసెంబ్లీ భాషను గురించి మొదటగా 1947 లో కాథ్లీన్, ఆండ్రూ డొనాల్డ్ బూత్ రాసిన పుస్తకంలో వివరించబడ్డాయి. అసెంబ్లీ భాషను కంప్యూటర్ మీద పనిచేయించేందుకు వీలుగా యాంత్రిక భాషలోకి తర్జుమా చేసే సాధనాలను అసెంబ్లర్లు అంటారు.

అసెంబ్లీ భాషలో రాసిన ప్రోగ్రాములు నేరుగా కంప్యూటరు మీద పనిచేయాలి కాబట్టి ఒక్కో కంప్యూటర్ ఆర్కిటెక్చర్కు ఒక్కో అసెంబ్లీ భాష ఉంటుంది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Austerlitz, Howard (2003). "Computer Programming Languages". Data Acquisition Techniques Using PCs. Elsevier. pp. 326–360. doi:10.1016/b978-012068377-2/50013-9. ISBN 9780120683772. Assembly language (or Assembler) is a compiled, low-level computer language. It is processor-dependent since it basically translates the Assembler's mnemonics directly into the commands a particular CPU understands, on a one-to-one basis. These Assembler mnemonics are the instruction set for that processor.
  2. Carnes, Beau (2022-04-27). "Learn Assembly Language Programming with ARM". freeCodeCamp.org. Retrieved 2022-06-21. Assembly language is often specific to a particular computer architecture so there are multiple types of assembly languages. ARM is an increasingly popular assembly language.