Jump to content

అవని ​​చతుర్వేది

వికీపీడియా నుండి
అవని చతుర్వేది
అవని చతుర్వేది
వ్యక్తిగత వివరాలు
జననం (1993-10-27) 1993 అక్టోబరు 27 (వయసు 31)
సత్నా, మధ్యప్రదేశ్, భారతదేశం
జీవిత భాగస్వామివినీత్ చికారా
వృత్తిఫైటర్ పైలట్
పురస్కారాలునారీ శక్తి పురస్కారం
Military service
Allegiance భారతదేశం
Branch/serviceవైమానిక దళం, భారతదేశం
Rank ఫ్లైట్ లెఫ్టినెంట్

అవని చతుర్వేది (జననం: 27 అక్టోబర్ 1993) ఒక ఫ్లైట్ లెఫ్టినెంట్. ఈమెది మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా. ఈమె మోహనా సింగ్, భావనా ​​కాంత్ ‌లతో పాటు మొదటి ఫైటర్ పైలట్‌గా ప్రకటించబడింది.[1] అవని జూన్ 2016లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరింది. దేశానికి సేవ చేసేందుకు గాను 18 జూన్ 2016న అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేత అధికారికంగా నియమించబడింది[2].

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అవని మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జన్మించినది. ఈమె తండ్రి దినకర్ చతుర్వేది మధ్యప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్, తల్లి గృహిణి. అవని తన పాఠశాల విద్యను మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలోని డియోలండ్ అనే చిన్న పట్టణంలో పూర్తి చేసింది. 2014లో రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్శిటీ నుండి బీటెక్ ని పూర్తి చేసి అదే కళాశాల ఫ్లయింగ్ క్లబ్‌లో చేరింది. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా ఉన్న అవని అన్నయ్య ఆమెను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరేలా ప్రేరేపించాడు. ఈమె బనస్థలి విశ్వవిద్యాలయంలోని ఫ్లయింగ్ క్లబ్‌లో రోజు కొన్ని గంటలపాటు విమానాన్ని నడిపేది.[3] ఈమె వివాహం నవంబర్ 2019లో ఫ్లైట్ లెఫ్టినెంట్ వినీత్ చికారాతో జరిగింది.

కెరీర్

[మార్చు]

అవని చతుర్వేది హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణకు ఎంపికైంది, ఈమె ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసిన తర్వాత, జూన్ 2016లో ఫైటర్ స్క్వాడ్రన్‌ లో చేరింది. 2018లో, చతుర్వేది మిగ్ -21 లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా నిలిచింది.[4] ఈమె రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నం. 23 స్క్వాడ్రన్ పాంథర్స్‌లో చేరి ఫ్లైట్ లెఫ్టినెంట్ గా విధులు నిర్వర్తిసుంది.

పురస్కారాలు

[మార్చు]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. women fighter pilots. "Avani, Bhawana, Mohana become IAF's first women fighter pilots | India News - Times of India". The Times of India. Retrieved 2022-03-18.
  2. Gurung, Shaurya Karanbir. "IAF: IAF pilots with India's first female fighter pilot test F-21 simulator". The Economic Times. Retrieved 2022-03-18.
  3. "Women's Day 2020: Interesting Facts about Avani Chaturvedi, First Indian Woman Pilot To Fly Mig-21 [VIDEO]". SSBToSuccess. 2018-02-23. Retrieved 2022-03-18.
  4. "Avani Chaturvedi: First Indian woman to fly fighter jet". BBC News. 2018-02-22. Retrieved 2022-03-18.
  5. "Flying MiG-21 Bison matter of pride: Flt Lt avani chaturvedi". mint. 2020-03-09. Retrieved 2022-03-18.