రాజస్థాన్
రాజస్థాన్ | |
![]() | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
జైపూర్ - 26°54′N 75°48′E / 26.90°N 75.80°E |
పెద్ద నగరం | జైపూర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
56,473,122 (8వ స్థానం) - 165/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
342,236 చ.కి.మీ (1వ స్థానం) - 33 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[రాజస్థాన్ |గవర్నరు - [[రాజస్థాన్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1956-11-01 - ప్రభారావ్ - అశోక్ గెహ్లాట్ - ఒకే సభ (200) |
అధికార బాష (లు) | హిందీ, రాజస్థానీ గుజరాతీకూడా మాట్లాడుతారు |
పొడిపదం (ISO) | IN-RJ |
వెబ్‌సైటు: www.rajasthan.gov.in |

రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారతదేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు) రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశం థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయం, భరత్ పూర్ పక్షి ఆశ్రయం ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.
చరిత్ర
[మార్చు]రాజపుత్రులచే పాలింపబడింది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.
కోటలు
[మార్చు]రాజస్థాన్ లో ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి, చరిత్రకి అద్దంపడుతుంటాయి.
అచల్గర్ కోట: మౌంట్ అబూకి 11 కి. మీ. దూరంలో ఈ కోటను పరమార వంశస్థులు కట్టారు. తరువాత 1452లో ఈ కోటకు రాణా కుంభ అనే రాజు అచల్గర్ అని పేరు పెట్టాడు. ఈ కొటలో 1513 లో కట్టబడిన జైన్ దేవాలయాలు కూడా ఉన్నాయి.
సంస్కృతి
[మార్చు]రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఆక్కడి స్త్రీలు ఆచారాలను, సంప్రదాయలను గౌరవిస్తారు, తూచా తప్పకుండా పాటిస్తారు. భారతదేశంలో విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉన్న 2, 3 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. దేశంలో ఇతర రాష్ట్రాలలో కాకుండా అక్కడి స్త్రీలు బయటకు ఒంటరిగా వెళ్ళుట, ఫ్యాషన్ గా ఉండుట కనిపించరు. సినిమా, మీడియా ప్రభావం అతి తక్కువగా ఉండటం, పురుషుల కట్టుబాట్ల పట్టింపు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు అతి తక్కువ. పోలీసులు సాధారణంగా రోడ్ల పై కనిపించరు.
జిల్లాలు
[మార్చు]రాజస్థాన్ లో 33 జిల్లాలు ఉన్నాయి.కొత్తగా మరో 19 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది.

ప్రసిద్ధులైన వారు
[మార్చు]
రాజస్థాన్ చరిత్ర, సాహిత్యం ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు
- బలదేవ్ రామ్ మీర్ధా
- చౌదరి కుంభారామ్ ఆర్యా
- మహారాణా ప్రతాప్
- మీరా బాయి
- జైమల్ రాథోడ్
- వీర దుర్గాదాసు
- పన్నాబాయి
- వీరతేజ
- శేఖాజీ
- మహారాణీ గాయత్రీ దేవి - భారతీయ జనతా పార్టీ నాయకురాలు
- మహారాజా సవాయ్ జైసింగ్
- మహారాజా సవాయ్ మాన్ సింగ్
- మహారాజా సవాయ్ మధో సింగ్
- మహారాజా సూరజ్ మల్
- స్వామికేశవానంద
రాజకీయ నాయకులు
[మార్చు]గణాంకాలు
[మార్చు]
- జనాభా: 5కోట్ల 65 లక్షలు (2001 లెక్కలు)
- జనాభాః 6 కోట్ల 85 లక్షలు (2011 లెక్కలు
- జిల్లాలు: 33
- ముఖ్య నగరాలు: జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్, కోట, ఆజ్మీర్, బికనీర్, భిల్వాడా, ఆల్వార్
- రోడ్లు: 61,520 కి.మీ. ( 2,846 కి,మీ. జాతీయ రహదారి)
- భాషలు: హిందీ, రాజస్థానీ
- అక్షరాస్యత: 61.03%
మందిరాలు
[మార్చు]భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి:
- బ్రహ్మ మందిరం: ఆజ్మీర్ వద్ద పుష్కర్‌లో ఉంది. సృష్టికర్త బ్రహ్మను పూజించే మందిరం ఇదొక్కటే.
- అచలేశ్వర్ మహాదేవ మందిరం: మౌంట్ అబూ వద్ద అచల్‌ఘర్‌లో ఉన్న శివాలయం. ఈ మందిరం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం బదులు శివుని మడమ శిల్పం, ఇత్తడి నంది విగ్రహం ఉన్నాయి.
- ఆదినాధ్ మందిరం: ఉదయపూర్ సమీపంలో రిఖాబ్‌దేవ్ వద్ద నున్న జైన మందిరం. 15వ శతాబ్దంలో నిర్మితం. బిజోలియా మందిరాలు: బుంది వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం. దాదాపు 100 మందిరాలలో మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి.
- నాథ్‌ద్వారా: ఉదయ్‌పూర్‌కు 48 కి.మీ. దూరాన ఉన్న రాజసమండ్ జిల్లాలో ఉన్న శ్రీనాధ్‌జీ మందిరం. పుష్టిమార్గం అనుసరించేవారికి పూజాస్థలం.
- అంబికామాత మందిరం: ఉదయపూర్‌కు 50 కి.మీ. దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్ గ్రామంలో ఉన్న దుర్గాదేవి మందిరం.
సమస్యలు
[మార్చు]- నీటి కొరత రాజస్థాన్ లో తీవ్రమైన సమస్య.
ఇవీ చూడండి
[మార్చు]- ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గా - అజ్మీరు
- జంతర్ మంతర్
- హవా మహల్
- రాజస్థాన్ పర్యాటకం
- జైసల్మేర్ కోట
- మెహరాన్ ఘర్ కోట
వనరులు
[మార్చు]- Gahlot, Sukhvirsingh. 1992. RAJASTHAN: Historical & Cultural. J. S. Gahlot Research Institute, Jodhpur.
- Somani, Ram Vallabh. 1993. History of Rajasthan. Jain Pustak Mandir, Jaipur.
- Tod, James & Crooke, William. 1829. Annals & Antiquities of Rajasthan or the Central and Western Rajput States of India. 3 Vols. Reprint: Low Price Publications, Delhi. 1990. ISBN 81-85395-68-3 (set of 3 vols.)
బయటి లంకెలు
[మార్చు]- రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం - అధికారిక వెబ్-సైట్
- Tourism Department of Rajasthan Archived 2015-06-08 at the Wayback Machine - Tourism Home Page
- రాజస్థాన్ ట్రావెల్