అల్లరి సుభాషిణి
Jump to navigation
Jump to search
అల్లరి సుభాషిణి | |
---|---|
జననం | తిరుమల సుభాషిణి |
విద్య | 7వ తరగతి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2002 – ప్రస్తుతం |
అల్లరి సుభాషిణి (తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈవిడ స్వస్థలం భీమవరం.[2] చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో 7వ తరగతి వరకే చదువుకున్నారు. చిన్న వయస్సులో పెళ్ళి అయింది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.
వృత్తి జీవితం
[మార్చు]సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయంలో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి,, రజినీకాంత్ వంటి నటులతో నటించారు.[3]
నటించిన చిత్రాలు
[మార్చు]- అల్లరి
- శ్రీఆంజనేయం
- కితకితలు
- అమరావతి
- సుడిగాడు
- హీరో (2008)
- నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ (2009)
- సూర్య వర్సెస్ సూర్య (2015)
- లవ్ స్టేట్స్ (2015)
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్, సినిమాలు. "అపార్ట్‌మెంట్ పాటలు విడుదల". www.telugunris.com. Retrieved 16 September 2016.[permanent dead link]
- ↑ "Telugu Movie Actress Allari Subhashini". nettv4u.com. Retrieved 2021-06-21.
- ↑ "Allari Subhashini Telugu Movie Actress". 99doing.com. Retrieved 2021-06-21.