Jump to content

అల్యూమినియం ఆర్సనైడ్

వికీపీడియా నుండి
అల్యూమినియం ఆర్సనైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [22831-42-1]
పబ్ కెమ్ 89859
యూరోపియన్ కమిషన్ సంఖ్య 245-555-0
SMILES [Al]#[As]
ధర్మములు
AlAs
మోలార్ ద్రవ్యరాశి 101.9031 g/mol
స్వరూపం orange crystals
సాంద్రత 3.72 g/cm3
reacts
ద్రావణీయత reacts in ethanol
Band gap 2.12 eV (indirect)[1]
Electron mobility 200 cm2/(V·s) (300 K)
Thermal conductivity 0.9 W/(cm·K) (300 K)
వక్రీభవన గుణకం (nD) 3 (infrared)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Zinc Blende
T2d-F-43m
కోఆర్డినేషన్ జ్యామితి
Tetrahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-116.3 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
60.3 J/mol K
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
[1910.1018] TWA 0.010 mg/m3
REL (Recommended)
Ca C 0.002 mg/m3 [15-minute]
IDLH (Immediate danger)
Ca [5 mg/m3 (as As)]
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం ఆర్సనైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. లోహ అల్యూమినియం, ఆర్సనిక్ /ఆర్సెనిక్ మూలకాల పరమాణు సంయోగము వలన ఏర్పడిన సంయోగపదార్థం.ఈ రసాయన సంయోగ పదార్థం రసాయనిక సంకేతపదం AlAs.అల్యూమినియం ఆర్సెనైడ్ ఒక సెమికండక్టర్ పదార్థం.[2] అణునిర్మాణ అల్లిక స్థిరాంకం ఇంచుమించు గాలియం ఆర్సెనైడ్,, అల్యూమినియం గాలియం ఆర్సెనైడ్ వలె ఉండును.బంధ ఖాళి మాత్రం గాలియం ఆర్సెనైడ్ కన్న వెడల్పుగా ఉండును. అల్యూమినియం ఆర్సెనైడ్ పదార్థం గాలియం ఆర్సెనైడ్ తో సూపర్ లాట్టిస్ ఏర్పరచును, తత్ఫలితంగా అల్యూమినియం ఆర్సెనైడ్ కు సెమికండక్టరు ధర్మాలు ఏర్పడుతున్నవి.

భౌతిక , ఇతర ధర్మాలు

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ ఆరెంజిరంగు స్పటికరూపంలో ఏర్పడి ఉండును.అల్యూమినియం ఆర్సెనైడ్ అణుభారం 101.9031 గ్రాములు/మోల్. 25 °C ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం ఆర్సెనైడ్ సాంద్రత 3.72 గ్రాములు /సెం.మీ3. నీటిలో కరుగదు

అల్యూమినియం ఆర్సెనైడ్ అదనంగా ఈ క్రింది లక్షణాలను కూడా కల్గిఉన్నది.[3]

  • ఉష్ణ వ్యాకోచక సహసామర్ధ్యం (Thermal expansion coefficient ) 5 µm/ (°C*m)
  • డిబే ఉష్ణోగ్రత (Debye temperature) 417 K
  • సూక్ష్మ కఠినత్వం (Microhardness) 5.0 GPa (50 g load)
  • ఘన సెం.మీలో పరమాణువుల సంఖ్య: (4.42-0.17x)•1022[4]
  • బల్క్ మోడులస్ (Bulk modulus) (7.55+0.26x)•1011 dyn cm−2[4]
  • మోహ్స్ స్కేలు (Mohs scale) మీద కఠినత్వం: ~ 5[6][4]

సశ్లేషణ

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ ను సంశ్లేషణ చెయ్యడం లోనున్న పలు ఇబ్బందుల కారణంగా, ఉత్పత్తి విధానం గురించి సమగ్రమైన సమాచారం అందుబాటులో ఎక్కువగా లేదు. ఎక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత వలన (1,700 °C పైగా) కరిగించిన పదార్థం నుండి ఉత్పత్తి చెయ్యడం కష్ట సాధ్యమైన పని. కొద్దిమంది మాత్రం కరిగిమ్చినపదార్థం నుండి చిన్న స్పటికాలను ఉత్పత్తి చేసారు.అలాగే పాలి క్రిస్టలైన్ కడ్డిలుకూడా ఉత్పత్తి చేసారు.

చర్యాశీలత

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ స్థిరమైన సంయోగ పదార్థం. అయినను ఆమ్లాల నుండి, ఆమ్లా పొగ/ఆవిరులకు అందుబాటులో ఉంచరాదు.అల్యూమినియం ఆర్సెనైడ్ వియోగం వలన ఆర్సైన్ వాయువు,, ఆర్సెనిక్ ఆవిరులు/పొగలు (fumes) విడుదల అగును.

విష స్వభావం

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ యొక్క విష స్వభావానికి సంబంధించిన రసాయన,, భౌతిక లక్షణాల గురించి సవిరమైన పరిశోధనలు అంతగా జరిపి, నమోదు చేసిన దఖాలాలులేవు. అల్యూమినియం ఆర్సెనైడ్ సంయోగ పదార్థాలు పరిశ్రమలలో వాణిజ్యపరంగా పలుప్రయోజనాలు కల్గిఉన్నవి. చాలా పదార్థాలు రసాయనికంగా చురుకైనవి,, ప్రమాదకరమైన విష లక్షణాలను,చర్యాశీల గుణాలను కల్గి ఉన్నాయి.

అల్యూమినియం ఆర్సెనైడ్ ప్రభావం వలన ఆరోగ్య ఇబ్బందులు

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ ను శ్వాసించడం వలన శ్వాస వవ్యస్థలో తీవ్రమైన ఇరిటేసన్ కల్గును. దీని వలన క్రానిక్ ఆర్సెనిక్ పాయిజనింగ్ అయ్యే అవకాశమున్నది.ముక్కు భాగాలలో పుళ్ళు ఏర్పడవచ్చును,కాలేయం పాడవ్వ వచ్చును, రక్తం, మూత్ర పిండాలు, నాడీవ్యవస్థకు చెందిన జబ్బులు/క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.జీర్ణాశయంలో చేరిన జీర్ణ వ్యవస్థకు,ప్రేగులకు సంబంధించి తీవ్రమైన ఆర్సెనిక్ పాయిజనింగ్ అయ్యే విలున్నది.

ఉపయోగాలు

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ ఆవర్తన పట్టిక లోని గ్రూప్ III-Vమూలకాల సంయోగ పదార్థం. అల్యూమినియం ఆర్సెనైడ్ ఒక అర్ధవాహక పదార్థం (semiconductor material).కాంతిని వెదజల్లు డైయోడ్ (light emitting diode)వంటి అప్టోఎలాక్ట్రానిక్ ఉపకరణాలలో తయారీలో ఉపయోగిస్తారు.

అల్యూమినియం ఆర్సెనైడ్ను ద్రవ, వాయుస్థితి ఎపిటాక్సి సంకేతికజ్ఞానాన్ని ఉపయోగించి లేదా కరిగించి పెంచు (melt-growth)టెక్నిక్ వలనకాని ఉత్పత్తి చెయ్యవచ్చును. అయితే పై రెండు ప్రక్రియల ద్వారా ఉత్పత్తికావించబడిన అల్యూమినియం ఆర్సెనైడ్ స్థిరమైనది కాదు. తేమ కల్గిన గాలి తగిలిన అర్సిన్ (AsH3) ను జనింప చేయును,

ప్రత్యేక ముందు జాగ్రత్తలు

[మార్చు]

అల్యూమినియం ఆర్సెనైడ్ ను నిల్వ ఉంచునపుడు, ఉపయోగించునపుడు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోన వలెను. చల్లని, పొడిగా ఉన్న ప్రదేశాలలో, గట్టిగా మూత బిగించిన డబ్బాలలో నిల్వ చెయ్యాలి. డబ్బాలను ఉంచిన ప్రదేశంలో గాలి బాగా ప్రసరించేలా ఉండాలి. అమ్లాలతో కలిపి నిల్వ ఉంచరాదు.

ఇవికూడా చూడండి

[మార్చు]

ఆధారాలు-మూలాలు

[మార్చు]
  1. "AlxGa1-xAs". Ioffe Database. Sankt-Peterburg: FTI im. A. F. Ioffe, RAN.
  2. Guo, L. Structural, Energetic, and Electronic Properties of Hydrogenated Aluminum Arsenide Clusters. Journal of Nanoparticle Research. Vol. 13 Issue 5 pg. 2029-2039. 2011.
  3. Berger, L. I. (1996). Semiconductor Materials. CRC Press. p. 125. ISBN 978-0-8493-8912-2.
  4. 4.0 4.1 4.2 Dierks, S.. "Aluminum Arsenide - MATERIAL SAFETY DATA." The Fitzgerald Group - MIT. MIT, 1994. Web. <http://sauvignon.mit.edu/fitz/safety/aluminumarsenide.pdf Archived 2013-10-29 at the Wayback Machine>.