అల్యూమినియం ఫ్లోరైడ్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
అల్యూమినియం(III)ఫ్లోరైడ్
అల్యూమినియం ట్రైఫ్లోరైడ్ | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7784-18-1] |
పబ్ కెమ్ | 2124 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:49464 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | BD0725000 |
SMILES | F[Al](F)F |
| |
ధర్మములు | |
AlF3 | |
మోలార్ ద్రవ్యరాశి | 83.9767 g/mol (anhydrous) 101.022 g/mol (monohydrate) 138.023 (trihydrate) |
స్వరూపం | white, crystalline solid odorless |
సాంద్రత | 3.1 g/cm3 (anhydrous) 2.1 g/cm3 (monohydrate) 1.914 g/cm3 (trihydrate) |
ద్రవీభవన స్థానం | 1,291 °C (2,356 °F; 1,564 K) (anhydrous) (sublimes) |
0.56 g/100 mL (0 °C) 0.67 g/100 mL (20 °C) 1.72 g/100 mL (100 °C) | |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Rhombohedral, hR24 |
R-3c, No. 167 | |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | - |
S-పదబంధాలు | - |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
none |
REL (Recommended)
|
2 mg/m3 |
IDLH (Immediate danger)
|
N.D. |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
అల్యూమినియం ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బన సంయోగపదార్ధం.ఈ సంయోగపదార్ధం రసాయన సంకేత పదం AlF3.అల్యూమినియం, ఫ్లోరిన్ మూలకపరమాణువు ల సంయోగం వలన అల్యూమినియం ఫ్లోరైడ్ ఏర్పడినది.అల్యూమినియం ఫ్లోరైడ్ ను సంశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేసినప్పటికీ, ప్రకృతిలో కూడా లభించును.అల్యూమినియం ఫ్లోరైడ్‌ను ఎక్కువగా అల్యూమినియం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగిస్తారు.
భౌతిక ధర్మాలు
[మార్చు]అల్యూమినియం ఫ్లోరైడ్ జలయోజిత/సార్ద్ర, అనార్ద్ర రూపాలలో లభ్యం.అల్యూమినియం ఫ్లోరైడ్ వాసనలేని తెల్లని స్పాటికాకార ఘనపదార్ధం. అనార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ అణుభారం 83.9767 గ్రాములు/మోల్. ఒక జలాణువు ఉన్న జలయోజిత/సార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ అణుభారం 101.022 గ్రాములు/మోల్. మూడు జలాణువులు trihydrate) ఉన్నసార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ అణుభారం138.023 గ్రాములు/మోల్.25 °C వద్ద అనార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ సాంద్రత 3.1 గ్రాములు/సెం.మీ3. ఒకజలాణువు (monohydrate) కలిగిన జలయోజిత/సార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ సాంద్రత 2.1 గ్రాములు/సెం.మీ3. అలాగేమూడు జలాణువులు కలిగిన జలయోజిత/సార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ సాంద్రత 1.914 గ్రాములు/సెం.మీ3. అనార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ ద్రవీభవన స్థానం 1,291 °C (2,356 °F;1,564K, ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ సంయోగపదార్ధం ఉత్పతనం (sublimes) చెందును.అల్యూమినియం ఫ్లోరైడ్ నీటిలో చాలా స్వల్పప్రమాణంలో కరుగును. 100 °C నీటి ఉష్ణోగ్రతలో,100 మి.లీ లలో కేవలం 1.72 గ్రాముల అల్యూమినియం ఫ్లోరైడ్ కరుగును.
ఉత్పత్తి , లభ్యత
[మార్చు]అల్యూమినియం ఫ్లోరైడ్ ను ఎక్కువగా, అధిక ప్రమాణంలో ఉత్పత్తికై అల్యూమిన (అల్యూమినియం ఆక్సైడ్) ను హెక్సాఫ్లోరోసిలిసిక్ ఆమ్లంతో చర్య జరపడంద్వారా ఉత్పత్తిచేసెదరు.
- H2SiF6 + Al2O3 → 2 AlF3 + SiO2 + H2O
మరో ప్రత్యామ్నాయపధ్ధతిలో అమ్మోనియం ఫ్లోరోఅల్యుమినేట్‌ను ఉష్ణవియోగం (thermal decomposition) కావించడం ద్వారా కూడా అల్యూమినియం ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చేసెదరు.[1] తక్కువ ప్రమాణంలో ప్రయోగశాలల్లో అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ను లేదా లోహ అల్యూమినియాన్ని హైడ్రోజన్ ఫ్లోరైడ్ (HF) తో రసాయనికచర్య వలన ఉత్పత్తి కావింతురు.
మూడు జలాణువులున్నసార్ద్రఅల్యూమినియం ఫ్లోరైడ్ ప్రకృతిలో రోసేన్బెర్గిటే (rosenbergite) ఖనిజరూపంలో లభ్యం.
నిర్మాణం
[మార్చు]అల్యూమినియం ఫ్లోరైడ్ అణుసౌష్టవం రేనియం ట్రైఆక్సైడ్ నిర్మాణముతో, రూప వికృతి పొందిన అల్యూమినియం హెక్సాఫ్లోరైడ్ అణువువలె షట్భుజాకృతి కలిగిఉండును. ప్రతి ఫ్లోరైడ్ రెండు అల్యూమినియం కేంద్రాలతో సంబంధం కలిగి ఉండును.దీనియొక్క త్రిమితీయ పాలిమెరిక్ నిర్మాణం వలన అల్యూమినియం ఫ్లోరైడ్ ఎక్కువ/అధిక ద్రవీభవన స్థానం కల్గిఉన్నది.అల్యూమినియం యొక్క మిగిలిన మూడు ఘనస్థితిలోని హలినాయిడ్ సమ్మేళనాలు అల్యూమినియం ఫ్లోరైడ్ తో విభేదించును. అల్యూమినియం క్లోరైడ్ (AlCl3) లేయర్/పొర నిర్మాణం కలిగి ఉండగా, అల్యూమినియం బ్రోమైడ్ (AlBr3), అల్యూమినియం అయోడైడ్ (AlI3) లు అణు ద్వణుకాలు (dimers).[2] అంతేకాకుండా తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత కలిగి, త్వరగా బాష్పీకరణచెంది ద్వణుకాలుగా ఏర్పడును[3].వాయు స్థితిలో అల్యూమినియం ఫ్లోరైడ్ త్రికోణ నిర్మాణంతో D3h అణునిర్మాణాన్ని కల్గిఉన్నది.వాయు స్థితిలోని అణువులోని అల్యూమినియం-ఫ్లోరిన్ పరమాణువుల బంధ పొడవు 163 pm.
ఉపయోగాలు
[మార్చు]- విద్యుద్విశ్లేషణ విధానంలో అల్యూమినియం ఉత్పత్తి చెయ్యుటకు క్రయోలైట్ తోపాటు అల్యూమినియం ఫ్లోరైడును క్రియాజనాకలలో చేర్చెదరు. ఇది ద్రవీభవన ఉష్ణోగ్రతను 1000 °C కన్న తక్కువ స్థాయికి తగ్గిస్తుంది., ద్రవ వాహకత్వాన్ని పెంచును.
- ఫ్లోరోఅల్యుమినేట్ గాజు తయారు చేయుటకు జిర్కోనియం ఫ్లోరైడ్‌తో పాటు అల్యూమినియం ఫ్లోరైడ్ ను వాడెదరు.
- పులియుటను (కిణ్వన ప్రక్రియ) నివారించుటకు, లేదా నిరోదినిగా అల్యూమినియం ఫ్లోరైడ్ ను ఉపయోగిస్తారు.
రక్షణ-అరోగ్యభద్రత
[మార్చు]అల్యూమినియం యొక్క కనిష్ఠ విషప్రభావ ప్రమాదకరమితి (Iethaldose) 600 మి.గ్రా/కిలో
ఇవికూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ J. Aigueperse, P. Mollard, D. Devilliers, M. Chemla, R. Faron, R. Romano, J. P. Cuer, "Fluorine Compounds, Inorganic" in Ullmann’s Encyclopedia of Industrial Chemistry, Wiley-VCH, Weinheim, 2005.doi:10.1002/14356007.a11_307
- ↑ Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
- ↑ Holleman, A. F.; Wiberg, E. "Inorganic Chemistry" Academic Press: San Diego, 2001. ISBN 0-12-352651-5.