అలర్జిక్ రైనైటిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలర్జిక్ రైనైటిస్
ఇతర పేర్లుహే జ్వరం, పొలినోసిస్, అలెర్జీ రైనోసైనసిటిస్
పుప్పొడి (వివిధ రకాల మొక్కల నుండి సేకరించినవి, 500 సార్లు పెద్దగా చూపించబడ్డాయి
ప్రత్యేకతఇమ్యునాలజీ, అలెర్జీ
లక్షణాలుముక్కు కారడం లేదా నిండుగా ఉండటం, తుమ్ము, ఎరుపు, దురద, కళ్ళలో నీళ్ళు రావడం, కళ్ళ చుట్టూ వాపు
సాధారణ ప్రారంభంఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య
కారణాలుజన్యువులు, పర్యావరణ కారకాలు
ప్రమాద కారకములుఉబ్బసం, అలెర్జీ కండ్లకలక లేదా అటోపిక్ డెర్మటైటిస్
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలతో
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిజలుబు
నివారణఆరంభంనుంచి జంతువులకు అలవాటు కావడం
ఔషధంనాసికా స్టెరాయిడ్స్, యాంటిహిస్టామైన్‌లు, డైఫెన్‌హైడ్రామైన్, క్రోమోలిన్ సోడియం, మాంటెలుకాస్ట్ వంటి ల్యుకోట్రీన్ రిసెప్టర్ వ్యతిరేకులు
తరుచుదనము~20%

అలర్జిక్ రైనైటిస్ , దీనిని హే ఫీవర్ అని కూడా పిలుస్తారు, ఇది ముక్కులో ఒక రకమైన వాపు, ఇది రోగనిరోధక వ్యవస్థ గాలిలో అలెర్జీ కారకాలకు అతిగా ప్రతిస్పందించినప్పుడు సంభవిస్తుంది.[1]

లక్షణాలు

[మార్చు]

సంకేతాలు లేదా లక్షణాలలో ముక్కు కారడం లేదా నిండుగా ఉండటం, తుమ్ము, ఎరుపు, దురద, కళ్ళలో నీళ్ళు రావడం, కళ్ళ చుట్టూ వాపు వంటివి ఉంటాయి.[2] ముక్కు నుండి వచ్చే ద్రవం సాధారణంగా తేటగా ఉంటుంది.[3] అలెర్జీ బహిర్గతం అయిన తరువాత కొన్ని నిమిషాల్లోనే లక్షణాలు ప్రారంభమవుతాయి, నిద్రను, చేస్తున్న పనిని లేదా అధ్యయనం చేసే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. కొంతమందికి సంవత్సరంలో నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఈ లక్షణాలు కనపడుతాయి, అంటే పుప్పొడి బహిర్గతంగా వెదజల్లబడే కాలంలో ఈ పరిస్థితి ఏర్పడవచ్చు.[4] అలర్జిక్ రైనైటిస్ ఉన్న చాలా మందికి ఉబ్బసం, అలెర్జీ కండ్లకలక లేదా అటోపిక్ డెర్మటైటిస్ కూడా ఉంటాయి.[3]

కారణాలు

[మార్చు]

అలెర్జీ రినిటిస్ సాధారణంగా పుప్పొడి, పెంపుడు జంతువుల జుట్టు, దుమ్ము లేదా బూజు వంటి పర్యావరణ అలెర్జీ కారకాల ద్వారా ఏర్పడుతుంది. వారసత్వంగా వచ్చిన జన్యువులు, పర్యావరణ కారకాలు అలెర్జీల అభివృద్ధికి దోహదం చేస్తాయి.[4] పొలంలో పెరగడం, ఎక్కువమంది తోబుట్టువులను ఉండటం అనేది ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.[3] అంతర్లీన యంత్రాంగంలో అలెర్జీ కారకంతో జతచేయబడిన IgE (ఇమ్మ్యూనోగ్లోబులిన్) ప్రతిరోధకాలు ఉంటాయి, తదనంతరం మాస్ట్ కణాల (హిస్టామిన్, హెపారిన్ అధికంగా ఉండే బంధన కణజాలం లో ఉండే కణం) నుండి హిస్టామిన్ వంటి తాపజనక రసాయనాల విడుదలకు దారితీస్తుంది.[3] రోగనిర్ధారణ సాధారణంగా లక్షణాలు, అలెర్జీ-నిర్దిష్ట IgE ప్రతిరోధకాల కోసం చర్మం గుచ్చి చేసే పరీక్ష లేదా రక్త పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ పరీక్షలు సానుకూలంగా ఉండినా కూడా, ఫలితాలు తప్పు చూపించవచ్చు.[5] అలెర్జీల లక్షణాలు సాధారణ జలుబును పోలి ఉంటాయి, అయితే అవి రెండు వారాలకు పైగా కూడా ఉంటాయి, సాధారణంగా జ్వరం ఉండకపోవచ్చు.[4]

చికిత్స

[మార్చు]

ఆరంభంనుంచి జంతువులకు అలవాటు కావడం వలన ఈ నిర్దిష్ట అలెర్జీలు అభివృద్ధి చేసే ప్రమాదం తగ్గుతుంది.[4] అనేక రకాలైన మందులు ఈ లక్షణాలను తగ్గిస్తాయి, అవి: నాసికా స్టెరాయిడ్స్, యాంటిహిస్టామైన్‌లు, డైఫెన్‌హైడ్రామైన్, క్రోమోలిన్ సోడియం, మాంటెలుకాస్ట్ వంటి ల్యుకోట్రీన్ రిసెప్టర్ వ్యతిరేకులు (antagonists) [2] అయితే, మందులు పూర్తిగా ఈ వ్యాధి లక్షణాలను నియంత్రించలేవు ఇంకా అవి దుష్ప్రభావాలను కూడా కలిగించవచ్చు.[3] అలెర్జెన్ ఇమ్యునోథెరపీ (AIT) అని పిలువబడే పెద్ద మొత్తంలో అలెర్జీ కారకాలకు ప్రజలను బహిర్గతం చేయడం ప్రభావవంతంగా ఉండవచ్చు.[6] అలెర్జీ కారకాన్ని చర్మం కింద ఇంజెక్షన్‌గా లేదా నాలుక కింద టాబ్లెట్‌గా ఇవ్వవచ్చు. చికిత్స సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది, ఆ తర్వాత ప్రయోజనాలు దీర్ఘకాలం ఉండవచ్చు.[1]

వ్యాధి ప్రాబల్యం

[మార్చు]

అలెర్జీ రినిటిస్ అనేది అత్యధిక సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే అలెర్జీ రకం.[7] పాశ్చాత్య దేశాలలో, ఒక సంవత్సరంలో 10 నుండి 30% మంది గురవుతారు.[3][8] ఇది ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య చాలా సాధారణంగా వస్తూంటుంది.[3] 10వ శతాబ్దంలో మొదటిసారిగా ఈ వ్యాధిగురించిన ఖచ్చితమైన వివరణ వైద్యుడు రాజెస్ ఇచ్చారు.[9] 1859లో, చార్లెస్ బ్లాక్లీ పుప్పొడి దీనికి కారణం అని గుర్తించారు.[10] 1906లో ఈ యంత్రాంగాన్ని క్లెమెన్స్ వాన్ పిర్క్వెట్ వివరించారు.[7] ప్రారంభంలో దీనివలన కొత్త ఎండుడ్డి వాసన వంటి లక్షణాలు సంభవించాయనే (తప్పు) సిద్ధాంతం కారణంగా ఎండుగడ్డి తో పేరు ఏర్పడింది.[11][12]

మందులు

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Immunotherapy for Environmental Allergies". NIAID. May 12, 2015. Archived from the original on 17 June 2015. Retrieved 19 June 2015.
  2. 2.0 2.1 "Environmental Allergies: Symptoms". NIAID. April 22, 2015. Archived from the original on 18 June 2015. Retrieved 19 June 2015.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Wheatley, LM; Togias, A (29 January 2015). "Clinical practice. Allergic rhinitis". The New England Journal of Medicine. 372 (5): 456–63. doi:10.1056/NEJMcp1412282. PMC 4324099. PMID 25629743.
  4. 4.0 4.1 4.2 4.3 "Cause of Environmental Allergies". NIAID. April 22, 2015. Archived from the original on 17 June 2015. Retrieved 17 June 2015.
  5. "Environmental Allergies: Diagnosis". NIAID. May 12, 2015. Archived from the original on 17 June 2015. Retrieved 19 June 2015.
  6. Boldovjáková, D; Cordoni, S; Fraser, CJ; Love, AB; Patrick, L; Ramsay, GJ; Ferguson, ASJ; Gomati, A; Ram, B (January 2021). "Sublingual immunotherapy vs placebo in the management of grass pollen-induced allergic rhinitis in adults: A systematic review and meta-analysis". Clinical otolaryngology : official journal of ENT-UK ; official journal of Netherlands Society for Oto-Rhino-Laryngology & Cervico-Facial Surgery. 46 (1): 52–59. doi:10.1111/coa.13651. PMID 32979035.
  7. 7.0 7.1 Fireman, Philip (2002). Pediatric otolaryngology vol 2 (4th ed.). Philadelphia, Pa.: W. B. Saunders. p. 1065. ISBN 9789997619846. Archived from the original on 2020-07-25. Retrieved 2016-09-23.
  8. Dykewicz MS, Hamilos DL (February 2010). "Rhinitis and sinusitis". The Journal of Allergy and Clinical Immunology. 125 (2 Suppl 2): S103–15. doi:10.1016/j.jaci.2009.12.989. PMID 20176255.
  9. Colgan, Richard (2009). Advice to the young physician on the art of medicine. New York: Springer. p. 31. ISBN 9781441910349. Archived from the original on 2017-09-08.
  10. Justin Parkinson (1 July 2014). "John Bostock: The man who 'discovered' hay fever". BBC News Magazine. Archived from the original on 31 July 2015. Retrieved 19 June 2015.
  11. (May 19, 1838). "Dr. Marshall Hall on Diseases of the Respiratory System; III. Hay Asthma". Retrieved on September 23, 2016.
  12. History of Allergy. Karger Medical and Scientific Publishers. 2014. p. 62. ISBN 9783318021950. Archived from the original on 2016-06-10.