అర్నబ్ గోస్వామి
అర్నబ్ గోస్వామి | |
---|---|
జననం | అర్నబ్ గోస్వామి 1973 మార్చి 7 గువహతి, అస్సాం, భారత దేశం |
విద్య | హిందు కాలేజీ (బి.ఏ) సెయింట్ ఆంటోనీ కాలేజి, ఆక్స్ఫర్డ్ (ఎం.ఏ) Visiting Fellow, సిడ్నీ సస్సెక్స్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1995-ప్రస్తుతం |
రిపబ్లిక్ టీవీ | |
Notable credit(s) | ది న్యూస్ అవర్ ఫ్రాంక్ల్య్ స్పీకింగ్ విత్ అర్నబ్ ది డిబేట్ విత్ అర్నబ్ గోస్వామి నేషన్ వాంట్స్ టు నో |
జీవిత భాగస్వామి | సమయబ్రత రే గోస్వామి |
పిల్లలు | 1 |
అర్నబ్ రంజన్ గోస్వామి (జననం 1973 మార్చి 7) ఒక సుప్రసిద్ధ భారతీయ పాత్రికేయుడు. అతను రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టరుగా, దాని ముఖ్య సంపాదకుడుగా పనిచేస్తున్నాడు.[1][2] రిపబ్లిక్ మీడియా నెట్వర్క ప్రస్తుతం ఇంగ్లీషులో రిపబ్లిక్ టివి, హిందీలో రిపబ్లిక్ భారత్ అనే రెండు ఛానెళ్లను నిర్వహిస్తోంది.
రిపబ్లిక్ టీవీకి ముందు గోస్వామి, 2006 నుండి 2016 వరకు టైమ్స్ నౌ, ఇటి నౌ ఛానెళ్ళలో ముఖ్య సంపాదకుడుగా, వార్తా వ్యాఖ్యాతగా పనిచేశాడు.[3][4] అంతకుముందు, అతను ఎన్డిటివి, ది టెలిగ్రాఫ్ లలో కూడా పనిచేశాడు. టైమ్స్ నౌలో, అతను వారపు రోజులలో రాత్రి 9 గంటలకు, ది న్యూస్అవర్' అనే ప్రత్యక్ష చర్చా గోష్ఠి నిర్వహించాడు. ఈ కార్యక్రమం అతనికి విస్తృత ఖ్యాతి సంపాదించి పెట్టింది.[5][6] అతను 'అర్నబ్‌తో ఫ్రాంక్లీ స్పీకింగ్' అనే ప్రత్యేక టెలివిజన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు.[7][8] 2016 నవంబరులో టైమ్స్ నౌలో ముఖ్య సంపాదక పదవికి గోస్వామి రాజీనామా చేశాడు.[9][10] అతని వార్తా ఛానల్ రిపబ్లిక్ టీవీ 2017 మేలో మొదలైంది.[11][12]
అతను భారతీయ జనతా పార్టీకి,[13] హిందుత్వకూ అనుకూలంగా రిపోర్టింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.[14][15] ప్రభుత్వ అభిప్రాయాలను యథాతథంగా ప్రసారం చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. పాలక పక్షం (భాజపా) గణాంకాలను సవాలు చేయకుండా, రాజకీయ ప్రత్యర్థులను ప్రతికూల దృష్టితో ప్రసారం చేస్తున్నట్లు అనిపిస్తున్నది.[16][17]
ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం
[మార్చు]అర్నబ్ 1973 మార్చి 7 న అస్సాం రాజధాని గువహాటిలో [18] కల్నల్ మనోరంజన్ గోస్వామి, రచయిత సుప్రభా గెయిన్-గోస్వామి దంపతులకు[19][20] జన్మించాడు.[21][22][23] అతని తండ్రి 1960 లో భారత సైన్యంలో చేరి, 30 సంవత్సరాలు సైనిక అధికారిగా పనిచేశాడు.[23][24] పదవీ విరమణ తరువాత అతను భారతీయ జనతా పార్టీలో చేరాడు; 1998 లోక్ సభ ఎన్నికలలో గువహాటి నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి భువనేశ్వర్ కలిత చేతిలో ఓడిపోయాడు.[25] అతను వివిధ వ్యాసాలు, పుస్తకాలు రచించాడు. 2017 లో ఆసం సాహిత్య సభ అవార్డు పొందారు.[23]
అతని పితామహుడు రజనీ కాంత గోస్వామి న్యాయవాదిగా పనిచేశాడు.[20] అతని మాతామహుడు గౌరిశంకర్ భట్టాచార్య భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఎన్నికైన శాసనసభ్యుడు గా, అస్సాంలో ప్రతిపక్ష నాయకుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాడు.[26][27][28]
అర్నబ్ మామ, సిద్ధార్థ భట్టాచార్య గౌహతి తూర్పు నియోజకవర్గం నుండి భాజపా తరపున ఎన్నికైన శాసన సభ్యుడు; 2015 లో సర్బానంద సోనోవాల్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన, పార్టీ అస్సాం విభాగానికి అధిపతి.[29][30]
చదువు
[మార్చు]సైనిక అధికారి కుమారుడు అర్నబ్ వివిధ నగరాల్లో విద్యాబ్యాసం చేసాడు. అతను ఢిల్లీ సైనిక స్థావరం లోని సెయింట్ మేరీస్ స్కూల్ నుండి తన 10 వ తరగతి పరీక్షల లోను, జబల్పూర్ సైనిక స్థావరం లోని కేంద్రీయ విద్యాలయ నుండి 12 వ తరగతి పరీక్షల లోనూ ఉత్తీర్ణుడయ్యాడు.[31] అర్నబ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల నుండి సామాజిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు .[32][33] 1994 లో, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ ఆంటోనీ కళాశాల నుండి మాస్టర్స్ ఇన్ సోషల్ ఆంత్రోపాలజీ పూర్తి చేశాడు,[34] అక్కడ అతను ఫెలిక్స్ స్కాలర్ గా గుర్తింపు పొందాడు.[31]
2000 లో, గోస్వామి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ అధ్యయన విభాగంలో విజిటింగ్ ఫెలోగా పనిచేశాడు.[35]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అర్నబ్ సమ్యబ్రాతా రే గోస్వామిని వివాహం చేసుకున్నాడు.[36][37] వారికి ఒక కుమారుడు ఉన్నాడు.[38]
కెరీర్
[మార్చు]ది టెలిగ్రాఫ్, ఎన్డిటివి
అర్నబ్ తన వృత్తిని కోల్‌కతాలోని 'ది టెలిగ్రాఫ్' తో పాత్రికేయుడుగా ప్రారంభించాడు; ఒక సంవత్సరం లోపే, అతను ఢిల్లీ వెళ్లి ఎన్డిటివిలో చేరాడు.అర్నబ్ ఢిల్లీ నగరంలో తక్కువ కాలం నివసించినప్పటికీ, ఆ నగరంతో గట్టి అనుబంధాన్ని పెంచుకున్నాడు.
అర్నబ్ 1996 నుండి 2006 వరకు ఎన్డిటివిలోలో పనిచేశాడు.[39] ఎన్డిటివిలో ప్రసారమైన న్యూస్ టునైట్ రోజువారీ వార్తా ప్రసారాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.[40]న్యూస్‌నైట్ [41] కార్యక్రమానికి గాను అర్నబ్ కు ఆసియా టెలివిజన్ అవార్డ్స్ 2004 లో ఉత్తమ వార్తా వ్యాఖ్యాతగా పురస్కారం పొందాడు.
టైమ్స్ నౌ
2006 లో, అర్నబ్ ఎన్‌డిటివిని విడిచిపెట్టి కొత్తగా ప్రారంభించిన టైమ్స్ నౌవార్తా ఛానెల్లో ముఖ్య సంపాదకుడుగా చేరారు.[42]
రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే 'ది న్యూస్ అవర్ ' అని ప్రత్యేక్ష వార్తా ప్రసారం లో, పర్వేజ్ ముషారఫ్ వంటి ప్రముఖ వ్యక్తులను పరిచయం చేసాడు. అర్నబ్ నిర్వహించిన 'అర్నబ్‌తో ఫ్రాంక్లీ స్పీకింగ్ ' కార్యక్రమములో బెనజీర్ భుట్టో, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, యూ.కె మాజీ ప్రధాన మంత్రి గోర్డాన్ బ్రౌన్,టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ అధ్యక్షుడు దలైలామా వంటి ప్రముఖ వ్యక్తులను పరిచయం చేసాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంటర్వ్యూ చేసిన మొదటి టెలివిజన్ వార్తా వ్యాఖ్యాత అర్నబ్.
సంపాదకీయ విభేదాలు, పాత్రికేయ స్వేచ్ఛ లేకపోవడం న్యూస్‌రూమ్ రాజకీయాలను పేర్కొంటూ అర్నబ్ టైమ్స్ నౌ నుండి 2016 నవంబరు 1 న రాజీనామా చేశాడు.[43][44][45]
రెండు వారాల తరువాత 'ది న్యూస్ అవర్ ' చర్చా గోష్ఠి ఆఖరి భాగం నిర్వహించాడు.[46][47] యాదృచ్ఛికంగా, ఆగస్టు, సెప్టెంబరు నెలలలో ప్రసారమైన 'ది న్యూస్ అవర్' కార్యక్రమము నిష్పక్షపాతంగా లేదు అని,యూ.కె ప్రభుత్వ ఆమోదం పొందిన 'ఆఫ్కామ్' రెగ్యులేటరీ అథారిటీ తమ దర్యాప్తులో ధ్రువీకరించింది.[17]
మూలాలు
[మార్చు]- ↑ Bureau, Adgully. "Republic Media Network strengthens the top management team". www.adgully.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
- ↑ Jha, Lata (2019-05-06). "Arnab Goswami buys back Republic Media shares from Asianet". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
- ↑ Lunch with the FT: Indian TV news anchor Arnab Goswami, Financial Times, James Crabtree (1 May 2015)
- ↑ Times Network accepts Arnab Goswami's resignation, The Economic Times (8 November 2016)
- ↑ "Wrecking News | Outlook India Magazine". outlookindia. Archived from the original on 2020-09-19. Retrieved 2020-08-22.
- ↑ "The Arnab Cast Of Characters | Outlook India Magazine". outlookindia. Archived from the original on 2020-10-01. Retrieved 2020-08-22.
- ↑ Jan 28, TNN / Updated:; 2014; Ist, 01:22. "Rahul Gandhi's first interview: Full text | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-22.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Staff, W. S. J. (2014-01-27). "The Gandhi-Goswami Smackdown". WSJ (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-22.
- ↑ Mohan, Kshitiz. "Arnab Goswami's Republic TV To Launch On 6 May". BW Businessworld (in ఇంగ్లీష్). Retrieved 2020-08-22.
- ↑ http://www.openthemagazine.com/shorts/smallworld/arnab-goswami-india-s-inquisitor
- ↑ Team, BS Web (6 May 2017). "Arnab Goswami's Republic TV launched; here's how to watch it live on phone". Business Standard, India. Retrieved 6 May 2017.
- ↑ Team, BS Web (5 May 2017). "Arnab Goswami's Republic first Indian news channel to air live on Hotstar". Business Standard, India. Retrieved 6 May 2017.
- ↑ "Here's why you will watch Arnab Goswami & Navika Kumar long after election results are out".
- ↑ Verma, Ramit (29 October 2019). "Peeing Human is waging a war on 'Modia'. Here's how, and why". Newslaundry.
- ↑ "Times Now left embarrassed: Arnab Goswami rapped by NBSA, channel fined Rs 50,000 for reporting in biased manner in Jalseen Kaur eve-teasing case". Retrieved 13 July 2016.
- ↑ S, Meghnad (4 July 2019). "Rahul Gandhi's resignation allowed TV channels to do what they do best". Newslaundry. -Drabu, Onaiza (2018). "Who Is the Muslim? Discursive Representations of the Muslims and Islam in Indian Prime-Time News". Religions (in ఇంగ్లీష్). 9 (9): 283. doi:10.3390/rel9090283. -"Podcast | Questions Arnab Goswami Didn't Ask Modi". -"The sham of Republic TV's Twitter Polls". Archived from the original on 2020-09-24. Retrieved 2020-08-22. -"How Narendra Modi has almost killed the Indian media". -"One month of Republic TV – How did they fare?". Archived from the original on 2020-09-26. Retrieved 2020-08-22. -"Republic claims Rahul Gandhi and Owaisi asked people not to stand up for National Anthem. Is that true?". Archived from the original on 2020-09-26. Retrieved 2020-08-22. -"The Daily Fix: Why the FIR ordered against Arnab Goswami is a blow to free media". -"India's Not-So-Free Media". -Filkins, Dexter (2 December 2019). "Blood and Soil in Narendra Modi's India". The New Yorker (Serial) (in ఇంగ్లీష్). ISSN 0028-792X. Retrieved 3 December 2019.
- ↑ 17.0 17.1 "'Proud of all my partners': Arnab Goswami when asked about BJP influence in new venture".
- ↑ Anupam Kher [@AnupamPKher] (7 March 2019). "Happy birthday dear #ArnabGoswami. Wishing you long & healthy life & all the happiness. Your courage is infectious.:) #BothBornOnTheSameDate" (Tweet). Retrieved 31 August 2019 – via Twitter. |date= mismatches calculated date from |number= by two or more days (help)
- ↑ "Interview in News time Assam". News Time Assam.
- ↑ 20.0 20.1 "The Soil Beckons". outlookindia.com. Retrieved 4 August 2011.
- ↑ "Books Released". The Sentinel. Guwahati. 18 February 2014. Archived from the original on 24 September 2015. Retrieved 22 February 2014.
- ↑ Deka, Meeta (3 September 2013). Women's Agency and Social Change: Assam and Beyond (in ఇంగ్లీష్). SAGE Publishing India. p. 40. ISBN 978-81-321-1798-8.
- ↑ 23.0 23.1 23.2 "Manoranjan Goswami passes away". Archived from the original on 5 అక్టోబరు 2020. Retrieved 6 August 2020.
- ↑ "The Sentinel". 2 September 2015. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 6 August 2020.
- ↑ "BJP finally a force to reckon with in Assam". The Indian Express. Guwahati. 6 March 1998.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;outlook22
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "My Koka: Gaurisankar Bhattacharyya". Retrieved 22 December 2019.
- ↑ "Assam Legislative Assembly – MLA 1957–62". Retrieved 22 December 2019.
- ↑ Team, NL. "Arnab Goswami's BJP connection in Assam" (in English).
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "The Assam Tribune Online". Archived from the original on 2020-10-05. Retrieved 2022-05-19.
- ↑ 31.0 31.1 Bureau, BW Online. "Arnab Goswami Quits TimesNow Turns Entrepreneur".
- ↑ "Arnab Goswami Quits TimesNow".
- ↑ "HINDU COLLEGE University Of Delhi".
- ↑ "Speakers of 2015". Archived from the original on 2017-02-06. Retrieved 2020-08-23. Dead link
- ↑ "Arnab Goswami: Story of a Famous TV Anchor". CareerPlot. Archived from the original on 2017-02-06. Retrieved 2020-08-23.
- ↑ "Arnab's Republic of Investors: Who is funding Goswami and what that means". The News Minute. 13 January 2017. Retrieved 3 September 2019.
- ↑ "Swamy wants 'Republic' to know". The Telegraph (in ఇంగ్లీష్). 26 January 2017. Retrieved 3 September 2019.
- ↑ "The Lighter Side Of Arnab Goswami". Man's World. 13 April 2017. Retrieved 3 September 2019.
- ↑ hermesauto (2 November 2016). "Arnab Goswami, loud news anchor of India's prime-time English debate show, quits" (in ఇంగ్లీష్).
- ↑ "New Delhi Television Limited" (PDF).
- ↑ "Diversity in programming is crucial to NDTV". Archived from the original on 2012-09-15. Retrieved 2020-08-23.
- ↑ "Detailed Coverage: Transcriopt". On the Media.orgaccessdate=4 August 2011. Archived from the original on 6 ఏప్రిల్ 2012. Retrieved 23 ఆగస్టు 2020.
- ↑ Srikrishna, Vasupradha (1 September 2019). "Neoliberal Media Making the Public Interest and Public Choice Theory Obsolete: Need for a New Theory". Media Watch. 10 (3). doi:10.15655/mw/2019/v10i3/49692. ISSN 2249-8818.
- ↑ Team, BS Web (27 March 2017). "Arnab Goswami gets candid: Was not even allowed to enter Times Now studio". Business Standard India. Retrieved 1 November 2019.
- ↑ "Arnab Goswami quits Times Now". The Hindu (in Indian English). 1 November 2016. Retrieved 1 November 2016.
- ↑ "Arnab Goswami's new venture". Business Standard. Retrieved 8 January 2017.
- ↑ "Arnab Goswami announces new venture; Times Now gets a new chief editor". Firstpost. Retrieved 8 January 2017.