అరటికాయ వేపుడు
స్వరూపం
(అరటి వేపుడు నుండి దారిమార్పు చెందింది)
అరటికాయ వేపుడు ఒక మంచి కూర.
కావలసిన పదార్థాలు
[మార్చు]- 3-4 అరటికాయలు
- 10-15 మిల్లీ.లీటర్ల వంట నూనె
- 4 చెంచాల కారం
- 3 చెంచాల శెనగ పిండి
- తగినంత ఉప్పు
తయారుచేయు విధానం
[మార్చు]- ఒక్కొక్క అరటికాయకు చెక్కుతీయాలి
- చెక్కుతీసిన వెంటనే చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీళ్ళల్లో వేయాలి. లేకపోతే ముక్కలు పాడయిపోతాయి.
- ఈ విధంగా అన్ని వేపుడు చేద్దామనుకుంటున్న అరటికాయలన్నిటికి చెక్కుతీసి ముక్కలుగా తరిగి నీళ్ళల్లో వేయాలి
- పొయ్యి మీద బాణలి ఉంచి, అందులో తగినంత నూనె వేయాలి.
- నూనె కాగిన తరువాత (నూనె కాగకుండా ముక్కలు వేయకూడదు), ముక్కల్ని నీళ్ళల్లోంచి తీసి బాణలిలో వేయాలి
- బాణలిలో వేసిన తరువాత అప్పుడప్పుడు అట్లకాడతో తిప్పుతూ ఉండాలి, లేకపొతే ముక్కలన్నీ అతుక్కుని పోతాయి.
- ఈవిధంగా ముక్కల్ని కలుపుతూ వేయించాలి.
- ముక్కలన్నీ వేగినాక, బాణలి పొయ్యిమీదనుంచి దంపాలి.
- బాణలిలోని నూనెను జాగ్రత్తగా ముక్కలు పడకుండా వేరుగా వంపేయాలి
- ముక్కలు వేడిగా ఉన్నప్పుడే, తగినంత ఉప్పు కారం కలిపిన మిశ్రమం ముక్కలమీద వేసి బాగా కదిలించి కలపాలి
- ముక్కలు పొడిపొడిగా ఉండటానికి శనగపొడిని కొద్దిగా చల్లి బాగా కలపాలి
- అలా ఉప్పూ కారం కలిపిన ముక్కల్ని బాణలి లోంచి మరొక పళ్ళేంలోకో లేదా గిన్నెలోకో మార్చి ఒడ్డించటానికి సిద్ధం చేయాలి. [1]