అరటికాయ వేపుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరటికాయ వేపుడు.

అరటికాయ వేపుడు ఒక మంచి కూర.

కావలసిన పదార్థాలు

[మార్చు]
అరటి కాయలు\పాకాల సంతలో తీసిన చిత్రము

తయారుచేయు విధానం

[మార్చు]
  • ఒక్కొక్క అరటికాయకు చెక్కుతీయాలి
  • చెక్కుతీసిన వెంటనే చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీళ్ళల్లో వేయాలి. లేకపోతే ముక్కలు పాడయిపోతాయి.
  • ఈ విధంగా అన్ని వేపుడు చేద్దామనుకుంటున్న అరటికాయలన్నిటికి చెక్కుతీసి ముక్కలుగా తరిగి నీళ్ళల్లో వేయాలి
  • పొయ్యి మీద బాణలి ఉంచి, అందులో తగినంత నూనె వేయాలి.
  • నూనె కాగిన తరువాత (నూనె కాగకుండా ముక్కలు వేయకూడదు), ముక్కల్ని నీళ్ళల్లోంచి తీసి బాణలిలో వేయాలి
  • బాణలిలో వేసిన తరువాత అప్పుడప్పుడు అట్లకాడతో తిప్పుతూ ఉండాలి, లేకపొతే ముక్కలన్నీ అతుక్కుని పోతాయి.
  • ఈవిధంగా ముక్కల్ని కలుపుతూ వేయించాలి.
  • ముక్కలన్నీ వేగినాక, బాణలి పొయ్యిమీదనుంచి దంపాలి.
  • బాణలిలోని నూనెను జాగ్రత్తగా ముక్కలు పడకుండా వేరుగా వంపేయాలి
  • ముక్కలు వేడిగా ఉన్నప్పుడే, తగినంత ఉప్పు కారం కలిపిన మిశ్రమం ముక్కలమీద వేసి బాగా కదిలించి కలపాలి
  • ముక్కలు పొడిపొడిగా ఉండటానికి శనగపొడిని కొద్దిగా చల్లి బాగా కలపాలి
  • అలా ఉప్పూ కారం కలిపిన ముక్కల్ని బాణలి లోంచి మరొక పళ్ళేంలోకో లేదా గిన్నెలోకో మార్చి ఒడ్డించటానికి సిద్ధం చేయాలి. [1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]