Jump to content

అమితాభ బుద్ధుడు

వికీపీడియా నుండి
(అమితాభుడు నుండి దారిమార్పు చెందింది)

అమితాభ బుద్ధుడు లేదా అమితాభుడు మహాయాన బౌద్ధములో ఐదుగురు ధ్యాని బుద్ధులలో ఒక్కడు. ఇతను తన పూర్వజన్మ మంచి కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు సుఖవతి అని ఒక బుద్ధ క్షేత్రముని సృష్టించాడు. ఇతన్ని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని సుఖవతి బౌద్ధము అని అంటారు. అమితాభ అంటే అమితమైన ప్రకాశము అని అర్థము. ఇతన్ని అమితాయుస్ అని కూడా అంటారు.

నమ్మకములు

[మార్చు]
టిబెట్ అమితాభ బుద్ధుడు

సుఖవతి సూత్రము అనే బౌద్ధ సూత్రములో అమితాభుని గురించి వివరాలు ఉన్నాయి. అమితాభుడు పూర్వజన్మలో ధర్మకారుడు అనే పేరుతో బౌద్ధభిక్షువుగా జన్మించాడు. తర్వాత తను బుద్ధత్వమును పొందడానికి అప్పుటి బుద్ధుడైన లోకేశ్వరరాజ బుద్ధుని ముందు 48 ప్రతిజ్ఞలు చేసాడు. ఈ ప్రతిజ్ఞలు చేసాడు గనక అతి త్వరగా ధర్మకారుడు బుద్ధత్వాన్ని పొంది అమితాభ బుద్ధుడు అయ్యాడు. తన పూర్వ జన్మ సత్కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు ఒక బుద్ధ క్షేత్రమును నిర్మించుకున్నాడు. ఇదే సుఖవతి. సుఖవతిలో పునర్జన్మము చేసే అన్ని జీవులు అమితాభ బుద్ధుడే నేరుగా ధర్మాన్ని ఉపదేశిస్తారు. సుఖవతి బుద్ధుడు సృష్టించిన బుద్ధ క్షేత్రము కాబట్టి భూలోకములాంటి ఏ విధమైనా క్లేషాలు అక్కడ లేదు కా, అమితాబుడి, నేరుగా అమితాభుడే ధర్మోపదేశముని వారికి చేస్తారు కాబట్టి అక్కడ జన్మించినవారందరూ బుద్ధులుగా, బోధిసత్త్వులుగా అవుతారు లేదా కనీసము నిర్వాణమును పొందుతారు.

అమితాభుడు తీసిన 48 ప్రతిజ్ఞలలో 18 ప్రతిజ్ఞ ప్రకారము, అమితాభ బుద్ధుని పేరును నమ్మకముతో జపించేవారందరికీ సుఖవతిలో పునర్జన్మము పొందుతుంది. 19 ప్రతిజ్ఞ ప్రకారము మరణ స్థితిలో నమ్మకముతో 10 సారులైనా అమితాభుని పిలిస్తే వారు సుఖవతిలో జన్మిస్తారు. అమితాభ బుద్ధుని సుఖతిలో పునర్జనము చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా అమితాభుని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని సుఖవతి బౌద్ధము అని అంటారు. ఈ మార్గం చాలా తేలికగా ఉంది కాబట్టి చైనా, జపాన్లో మహాయాన బౌద్ధములో ముఖ్యమైన విభాగముగా సుఖవతి బౌద్ధము ఉంది.

సూత్రాలు

[మార్చు]

అమితాభ బుద్ధుని ప్రధానముగా వివరించే బౌద్ధ సూత్రాలు కింద ఇవ్వబడింది.

  • సుఖవతివ్యూహ సూత్రము లేదా సుఖవతివ్యూహ సూత్రము(విస్తార మాతృకా)
  • అమితాభ సూత్రమ లేదా సుఖవతివ్యూహ సూత్రము(సంక్షిప్త మాతృకా)
  • అమితాయుర్ధ్యాన సూత్రము

అమితాభుని రూపలక్షణాలు

[మార్చు]
మధ్యలో అమితాభుడు ఎడమవైపు:మహాస్థామప్రాప్తుడు కుడివైపు:అవలోకితేశ్వరుడు

అమితాభ బుద్ధుని దిశ పడమర. ఇతని స్కంధము సంజ్ఞా, రంగు ఎరుపు, చిహ్నము పద్మము. అమితాభుడు సాధారణంగా పద్మాసనములో ధ్యాన ముద్రతో ఉంటాడు. ఇతని ఎడమవైపు అవలోకితేశ్వరుడు, కుడివైపు వహాస్థామ ప్రాప్తుడు ఉంటారు. కాని వజ్రయాన బౌద్ధము లో మహాస్థామ ప్రాప్తుడికి బదులుగా వజ్రపానిని చూడవచ్చు.

మంత్రములు

[మార్చు]

అమితాభుని మూల మంత్రము

ఓం అమితాభ హ్రీః

హ్రీః అమితాభుని బీజాక్షరము

జపాన్ దేశపు షింగోన్ బౌద్ధము లో కింది మంత్రముని ప్రయోగిస్తారు

ఓం అమృత తేజ హర హూం

పైని మంత్రమలుతో అతిముఖ్యంగా అమితాభుని పేరుని సుఖవతి పునర్జన్మం పొందడం కోసం జపిస్తారు.

నమో అమితాభ బుద్ధాయ

దీన్ని బుద్ధ నామానుస్మృతి అని అంటారు. ఈ జపముని జపాన్ లో నెంబుట్సు అని అంటారు. వారు దీని నము అమిడా బుట్సు అని ఉచ్చరిస్తారు. చీనములో దీని నియాన్ఫో అని అంటారు. చీన భాశలో దీని నమో అమిటొ ఫొ అని ఉచ్చరిస్తారు.

ధారణీ

[మార్చు]

అమితాభ బుద్ధుని ధారణీ సుఖవతివ్యూహ ధారణ. ఆ ధారణి :

నమూ రత్న త్రయాయ నమః ఆర్యమితాభాయ
తథాగత అర్హతే సంయక్సంబుద్ధాయ
తద్యథా
ఓం అమృత అమృతొద్భవే అమృత సంభవే అమృత గర్భే
అమృత విక్రంత గామినే అమృత గగన కీర్తి కరే
అమృత దుందుభి స్వరే సర్వార్థ సాధనే
సర్వ కర్మ క్లేశ క్షయం కరే స్వాహ

పై మంత్రం యొక్క సంక్షిప్త రూపమును కూడా ఉపయోగిస్తారు. ఈ సంక్షిప్త రూపమును సుఖవతివ్యూహ పునఃజన్మ మంత్రము అని అంటారు. సుఖవతివ్యూహ ధారణీ (సంక్షిపతము)

నమో అమితాభాయ తథాగతాయ
తద్యథా
ఓం అమృతోద్భవే అమృత సిద్ధంభవే
అమృత విక్రంతే అమృత విక్రంత గామిని
గగన కీర్తి కరే స్వాహా

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.