అబ్దుల్ ఆజీం దఢాఖ
అబ్దుల్ ఆజీం దఢాఖ | |
---|---|
జననం | 1869 అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ |
మరణం | 1965 |
మతం | ముస్లీం |
తండ్రి | మహమ్మద్ అబ్దుల్ రహమాన్ |
తల్లి | దఢాఖ |
అబ్దుల్ ఆజీం దఢాఖ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు. తెలుగులో దాదాపు 238కి పైగా కీర్తనలు, హిందీలో 114 కీర్తనలను రచించాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అబ్దుల్ ఆజీం దఢాఖ 1869లో మహమ్మద్ అబ్దుల్ రహమాన్, దఢాఖ దంపతులకు జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ గ్రామంలో జన్మించాడు.[1] బాల్యం నుండే సంగీతం, సాహిత్యంలో ఆసక్తిని అబ్దుల్ ఆజీం దఢాఖ గానంలో, హార్మోనియం, తబలా వాయించడంలో తన ప్రతిభను కనబరచాడు. హిందు ధర్మంపట్ల ఆకర్షితుడైన ఈయన శ్రీ కుమారస్వామి వద్ద ఉపదేశం పొందాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం సర్దార్‌నగర్ గ్రామంలో ఉంటూ బాల బాలికలకు విద్యను నేర్పాడు.
రచనాప్రస్థానం
[మార్చు]సంగమేశ్వర స్వామిని పూజిస్తూ తన కీర్తనల రచనను ప్రారంభించాడు. ముందుగా త్రివేణి సంగమ మంగళ తరంగిణి అనే అజీం భజనమాల రాశాడు. అందులోని ప్రథమభాగంలో 114 కీర్తనలు, 3 మంగళ హారతులు రాయగా, ద్వితీయ భాగములో 26 హిందీ కీర్తనలు రాశాడు. ఈయన షర్రాఫ్ అమృతదాసుతో కలిసి శ్రీహరి హర భజనామృత గాన తరంగిణి అనే అజీం అఖండమాలలో 124 కీర్తనలు, 4 మంగళ హారతులు రాసి, శిష్యులకు నేర్పించాడు.[2]
మరణం
[మార్చు]ఈయన 1965లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 12 November 2019.
- ↑ అబ్దుల్ ఆజీం దఢాఖ, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 29