Jump to content

అన్షుమన్ గైక్వాడ్

వికీపీడియా నుండి
అన్షుమన్ గైక్వాడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అన్షుమన్ దత్తాజీరావ్ గైక్వాడ్
పుట్టిన తేదీ1952 సెప్టెంబరు 23
బొంబాయి, బొంబాయి రాష్ట్రం
మరణించిన తేదీ2024 జూలై 31(2024-07-31) (వయసు 71).
ముంబై, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్‌బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులుదత్తా గైక్వాడ్ (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 135)1974 డిసెంబరు 27 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1984 డిసెంబరు 31 - ఇంగ్లాండు తో
తొలి వన్‌డే (క్యాప్ 15)1975 జూన్ 7 - ఇంగ్లాండు తో
చివరి వన్‌డే1987 డిసెంబరు 23 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI
మ్యాచ్‌లు 40 15
చేసిన పరుగులు 1,985 269
బ్యాటింగు సగటు 30.07 20.69
100లు/50లు 2/10 0/1
అత్యధిక స్కోరు 201 78*
వేసిన బంతులు 334 48
వికెట్లు 2 1
బౌలింగు సగటు 93.50 39.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/4 1/39
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 6/–
మూలం: ESPNcricinfo, 2006 డిసెంబరు 31

అన్షుమన్ దత్తాజీరావు గైక్వాడ్ (1952 సెప్టెంబరు 23 - 2024 జులై 31) మాజీ భారత క్రికెటర్, రెండు సార్లు భారత జాతీయ క్రికెట్ కోచ్. అతను 40 టెస్ట్ మ్యాచ్‌లు, 15 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచిలూ ఆడాడు. అతని తండ్రి దత్తా గైక్వాడ్ కూడా భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. [1]

గైక్వాడ్ పేస్ బౌలర్లను ఎదుర్కొనేటపుడు అతను ప్రదర్శించే డిఫెన్సివ్ మైండ్‌సెట్‌కు ప్రసిద్ధి చెందాడు. వెస్టిండీస్ పేస్ బౌలర్లు ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లక్షణానికి గాను అతనికి ది గ్రేట్ వాల్ అని పేరు పెట్టారు. అతను 1974 డిసెంబరు 27 న కోల్‌కతాలో వెస్టిండీస్‌పై తన తొలి టెస్టు ఆడాడు. 1984 చివరి రోజున కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అతని చివరి ఆట. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, గైక్వాడ్ 40 టెస్టుల్లో 30.07 సగటుతో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 1,985 పరుగులు చేశాడు. అతను 1982-83లో జలంధర్‌లో పాకిస్తాన్‌పై తన అత్యధిక టెస్ట్ స్కోరు 201 పరుగులు చేశాడు. అతను 671 నిమిషాల పాటు ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని సహనశీల శైలికి, ఏకాగ్రతకూ ఉదాహరణ. [2]

అన్షుమన్ గైక్వాడ్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత GSFC సంస్థలో పనిచేశాడు. 2000లో ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ప్రస్తుతం వడోదరలో నివసిస్తున్నాడు.

జూన్‌ 2018లో అతను సి.కె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది, మాజీ ఆటగాళ్ళకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అందించే అత్యున్నత గౌరవం.[3][4]

మరణం

[మార్చు]

చాలాకాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన 71 ఏళ్ల వయసులో 2024 జులై 31న తుదిశ్వాస విడిచాడు. ఆయన లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొంది తిరిగి ఇటీవలే స్వస్థలం ముంబై చేరుకున్నాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Cricketer honoured with stamp". The Times of India (in ఇంగ్లీష్). October 28, 2020. Retrieved 2021-01-13.
  2. "Anshuman Gaekwad: 12 lesser-known facts about the two-time Indian coach". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-23. Retrieved 2021-01-13.
  3. "Kohli, Harmanpreet, Mandhana win top BCCI awards". ESPN Cricinfo. Retrieved 7 June 2018.
  4. "BCCI honours Indian legends Anshuman Gaekwad and Pankaj Roy". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-13.
  5. "భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కన్నుమూత | Former India cricketer Anshuman Gaekwad passes away | Sakshi". web.archive.org. 2024-08-01. Archived from the original on 2024-08-01. Retrieved 2024-08-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Eenadu (1 August 2024). "టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ కన్నుమూత". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.