అనురా రణసింఘే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనురా రణసింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1956-10-13)1956 అక్టోబరు 13
కలుతర, శ్రీలంక
మరణించిన తేదీ1998 నవంబరు 9(1998-11-09) (వయసు 42)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 13)1982 మార్చి 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1982 సెప్టెంబరు 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 8)1975 జూన్ 7 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1982 సెప్టెంబరు 15 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 9
చేసిన పరుగులు 88 153
బ్యాటింగు సగటు 22.00 21.85
100లు/50లు 0/1 0/1
అత్యధిక స్కోరు 77 51
వేసిన బంతులు 19 324
వికెట్లు 1 2
బౌలింగు సగటు 69.00 140.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/23 1/21
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: ESPNcricinfo, 2016 సెప్టెంబరు 22

అనురా నందన రణసింగ్ (1956, అక్టోబరు 13 - 1998, నవంబరు 9) శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు. అంతర్జాతీయ స్థాయిలో 11 సార్లు శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు.

జననం, విద్య

[మార్చు]

అనురా నందన రణసింగ్ 1956, అక్టోబరు 13న శ్రీలంకలోని కలుతరలో జన్మించాడు. 1974-75 క్రికెట్ సీజన్‌లో కొలంబోలోని నలంద కళాశాల తరపున క్రికెట్ ఆడినప్పుడు ఉత్తమ స్కూల్‌బాయ్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

1975లో 18 ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్‌లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ కప్‌లో ఆడిన మొదటి పాఠశాల విద్యార్థిగా రణసింగ్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరపున 1975 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో జరిగిన మూడు మ్యాచ్‌లలో ఆడాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో మొత్తం 19 పరుగులు చేశాడు, పది ఓవర్లు వేసి 65 పరుగులు ఇచ్చాడు.[1]

భుజం గాయం కారణంగా అతను 1979 ప్రపంచ కప్‌కు ఎంపికవలేదు. ఇంగ్లాండ్ శ్రీలంకతో ఆడిన ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లో అతను 12 మందిలో పేరు పొందాడు, అయితే ఆట ప్రారంభమైన ఉదయం లలిత్ కలుపెరుమకు అనుకూలంగా వదిలివేయబడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేలలో ఆడాడు. మొదటి వన్డేలో వేగంగా 51 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లాండ్ స్కోరును ఛేదించడానికి శ్రీలంక రన్ రేట్‌ను పెంచాల్సిన అవసరం ఉన్నందున జియోఫ్ కుక్ క్యాచ్‌కి చిక్కాడు. శ్రీలంక విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. రెండవదానిలో డకౌట్ అయ్యాడు, శ్రీలంక మూడు పరుగుల తేడాతో గెలిచింది. ఇందులో తొమ్మిది ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

నిషేధం

[మార్చు]

1982-83లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం ద్వారా రణసింగ్, అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుండి 25 ఏళ్ళ నిషేధాన్ని పొందాడు. 1990లో నిషేధం ఎత్తివేయబడిన తరువాత మళ్ళీ క్రికెట్ లోకి వచ్చాడు. కానీ తర్వాత రిటైర్ అయ్యాడు.

మరణం

[మార్చు]

రణసింగ్ తన 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో 1998, నవంబరు 9న కొలంబోలో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Anura Ranasinghe dies in his sleep". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  2. Alter, J. (5 September 2009). "The one that got away". Cricinfo.com. Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

[మార్చు]