Jump to content

అద్భుతం

వికీపీడియా నుండి
అద్భుతం
దర్శకత్వంమల్లిక్ రామ్
స్క్రీన్ ప్లేలక్ష్మీ భూపాల
నిర్మాతశేఖర్ మొగుల్ల
సృజన్ యరబోలు
మండవ సాయి కుమార్ [1]
తారాగణంతేజ సజ్జా
శివాని రాజశేఖర్‌
కూర్పుగ్యారీ బిహెచ్
నిర్మాణ
సంస్థలు
మహతేజ క్రియేషన్స్, ఎస్.ఒరిజినల్స్, ఎం.ఎస్.కె ఫిల్మ్స్ [2]
విడుదల తేదీ
19 నవంబర్‌ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

అద్భుతం 2021లో విడుదలైన సినిమా. మహతేజ క్రియేషన్స్, ఎస్.ఒరిజినల్స్ బ్యానర్ల పై శేఖర్ మొగుల్ల, సృజన్ యరబోలు, మండవ సాయి కుమార్ [3] నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌, దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ని నవంబర్‌ 9న విడుదల చేసి, సినిమాను నవంబర్‌ 19న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

సూర్య(తేజ సజ్జ) ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఒకరోజు వాతావరణం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సెల్‌ఫోన్ కాల్స్ జంప్ వంటివి జరుగుతున్నాయని కథనాలు వస్తూ ఉంటాయి. జీవితం తను అనుకున్నట్లు సాగకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తన ఫోన్‌కు తానే మెసేజ్‌ పంపించుకుంటాడు.కానీ ఆ మెసేజ్‌ వెన్నెల (శివానీ)అనే అమ్మాయి ఫోన్‌కు వెళుతుంది. కొన్నాళ్లు పరిచయం పెరిగాక సూర్య 2019లోనూ, వెన్నెల 2014లోనూ ఉన్నారని ఇద్దరికీ తెలుస్తుంది. అస్సలు ఇదంతా ఎలా సాధ్యం ? సూర్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? వెన్నెల కి సూర్య కి అప్పట్లో ఏమైనా కనెక్షన్ ఉందా? చివరికి ఎం జరిగింది ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • పేరేంటి ఊరేంటి, రచన: కృష్ణకాంత్, గానం. యోగి శేఖర్ , సమీరా భరద్వాజ్
  • అరెరే ఏంటి.ఈ దూరం , రచన: సత్య యామిని, గానం. స్వీకర్ ఆగస్తయ్య

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: మహతేజ క్రియేషన్స్, ఎస్.ఒరిజినల్స్
  • నిర్మాతలు: శేఖర్ మొగుల్ల, సృజన్ యరబోలు,మండవ సాయి కుమార్ [7]
  • కథ: ప్రశాంత్ వర్మ
  • దర్శకత్వం: మల్లిక్ రామ్ [8]
  • స్క్రీన్ ప్లే, మాటలు: లక్ష్మీ భూపాల
  • సంగీతం: రాధన్
  • సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింతా
  • ఎడిటింగ్: గ్యారీ బిహెచ్

మూలాలు

[మార్చు]
  1. "రివ్యూ: అద్భుతం | NTV" (in ఇంగ్లీష్). Archived from the original on 6 మార్చి 2022. Retrieved 6 మార్చి 2022.
  2. "Adbhutham Producer | IMDb" (in ఇంగ్లీష్). {{cite web}}: |archive-date= requires |archive-url= (help)
  3. "రివ్యూ: అద్భుతం | NTV" (in ఇంగ్లీష్). Archived from the original on 6 మార్చి 2022. Retrieved 6 మార్చి 2022.
  4. Eenadu (19 November 2021). "రివ్యూ: అద్భుతం". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  5. Namasthe Telangana (10 November 2021). "తేజ సజ్జా అద్భుతం ఓటీటీలోనే రిలీజ్‌… వ‌చ్చేది ఎప్పుడంటే." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  6. "రివ్యూ: అద్భుతం | NTV" (in ఇంగ్లీష్). {{cite web}}: |archive-date= requires |archive-url= (help)
  7. "రివ్యూ: అద్భుతం | NTV" (in ఇంగ్లీష్). Archived from the original on 6 మార్చి 2022. Retrieved 6 మార్చి 2022.
  8. Eenadu (16 November 2021). "అద్భుతం.. ఓ ఫాంటసీ ప్రేమకథ - director mallik ram abou adbhutham movie". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అద్భుతం&oldid=4053023" నుండి వెలికితీశారు