అద్దేపల్లి రామారావు
స్వరూపం
అద్దేపల్లి రామారావు | |
---|---|
వృత్తి | సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1948-1956 |
గుర్తించదగిన సేవలు | అదృష్టదీపుడు బంగారు పాప చింతామణి |
అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి చిత్రాలకు. అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి రామారావు సంగీతం అందించిన నా యిల్లు (1953) చిత్రంతో బృందగాయకునిగా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1]
చిత్రసమాహారం
[మార్చు]సంగీతదర్శకునిగా
[మార్చు]- సువర్ణమాల (1948)
- అదృష్టదీపుడు (1950)
- నా యిల్లు (1953)
- బంగారు పాప (1954)
- చింతామణి (1956)
ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా
[మార్చు]- గుణసుందరి కథ (1949)
- పేరంటాలు (1951)
- మల్లీశ్వరి (1951)
- పెద్ద మనుషులు (1954)