Jump to content

అతుల్ వాసన్

వికీపీడియా నుండి
అతుల్ వాసన్
2011 లో వాసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అతుల్ సతీష్ వాసన్
పుట్టిన తేదీ23 March 1968 (1968-03-23) (age 56)
ఢిల్లీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 190)1990 ఫిబ్రవరి 2 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1990 ఆగస్టు 23 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 76)1990 మార్చి 1 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1991 జనవరి 4 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 4 9
చేసిన పరుగులు 94 33
బ్యాటింగు సగటు 23.50 8.25
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 53 16
వేసిన బంతులు 712 426
వికెట్లు 10 11
బౌలింగు సగటు 50.39 25.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/108 3/28
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

అతుల్ సతీష్ వాసన్ (జననం 1968 మార్చి 23) భారత క్రికెట్ ఆటగాడు. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మారాడు. అతను భారత జట్టులో సభ్యుడుగా నాలుగు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు. అయితే గాయాల కారణంగా అతని కెరీర్ త్వరగా ముగిసిపోయింది. ఆ తరువాత అతను క్రికెట్ వ్యాఖ్యాత అయ్యాడు.

అతుల్ వాసన్ ఢిల్లీ, వసంత్ విహార్‌లోని గురు హరిక్రిషన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. పాఠశాలలో ఉండగా క్రికెట్‌లో చూపిన ప్రతిభకు గాను గుర్తింపు పొందాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్

[మార్చు]

వాసన్ ఢిల్లీ వసంత్ విహార్ లోని గురు హరిక్రిషన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. ఈ పాఠశాల నుంచి పలువురు క్రికెటర్లు వచ్చారు. అతుల్ వాసన్ ఫస్ట్-క్లాస్ కెరీర్ 1986–87 సీజన్ నుండి 1997–98 సీజన్ వరకు కొనసాగింది. దృఢకాయుడైన అతుల్ వాసన్, మీడియం పేసర్‌గా ఆడాడు.

వాసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా రాణించనప్పటికీ, దేశీయ క్రికెట్‌లో చాలా విజయవంతమయ్యాడు. రంజీ ట్రోఫీ పోటీల్లో 23.78 సగటుతో 213 వికెట్లు తీశాడు. అతను బ్యాట్‌తో పెద్దగా విజయం సాధించనప్పటికీ, అతను 1991-92 సీజన్‌లో బెంగాల్ జట్టుతో జరిగిన క్వార్టర్-ఫైనల్‌లో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

అతుల్ వాసన్ తన కెరీర్ మొత్తంలో నాలుగు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు. 1990 ఫిబ్రవరి 2 న క్రైస్ట్‌చర్చ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో టెస్టుల్లో ప్రవేశించాడు. 1990 ఆగస్టు 23 న ఓవల్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తన చివరి టెస్టు ఆడాడు.

1990లో, అతను భారత జట్టు సభ్యునిగా రెండుసార్లు విదేశాలకు వెళ్ళాడు. న్యూజిలాండ్‌లో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో అతను మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అలాగే, ఆక్లాండ్‌లో జరిగిన సిరీస్‌లోని మూడో టెస్టులో ఒక్క ఓవర్లో 24 పరుగులు ఇచ్చాడు. అయితే, అతను ఈ టెస్టులో 4/108 వ్యక్తిగత అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను సాధించాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లలో జరిగిన టెస్టులతో సహా మొత్తం పర్యటనలో కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్‌ల కంటే అతనికే మెరుగైన బౌలింగ్ సగటు ఉంది.[1]

వాసన్ గ్లామోర్గాన్‌పై 6/89 తీసుకున్నాక, ఓవల్‌లో జరిగిన మూడవ టెస్టు కోసం ప్రారంభ XIలో చేర్చుకున్నారు. అతను చివరిసారిగా జాతీయ జట్టు సభ్యుడిగా 1990-91 సీజన్‌లో ఆసియా కప్‌లో ఆడాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును ఓడించి అతని జట్టు టైటిల్ గెలుచుకుంది. అతను ఆడిన టెస్టులన్నీ విదేశాల్లోనే ఆడాడు. 22 ఏళ్ల వయసుకే అతని టెస్టు కెరీర్ ముగిసింది.

గాయాల కారణంగా ఆటకు దూరమయ్యాడు. క్రికెట్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టాడు. టెలివిజన్‌లో క్రికెట్ సంబంధిత కార్యక్రమాలను హోస్ట్ చేయడంతో పాటు టెన్ స్పోర్ట్స్, DD నేషనల్‌లో విశ్లేషకుడిగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Atul Wassan Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.