భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
కార్పోరేట్ వ్యవహారాల ఉత్తమ నిర్వహణకుగాను రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు 2008 సంవత్సరపు బంగారు నెమలి అవార్డు లభించింది.
దక్షిణ ఆఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ అన్ని రకాల క్రికెట్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2004లోనే రిటైర్ అయ్యాడు.
స్టట్‌గార్డ్‌లో జరుగుతున్న జర్మనీ ఓపెన్ టెన్నిస్ మహిళ సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ రెండో రౌండ్ లోనే చైనాకు చెందిన స్టార్ లీ నా చేతిలో పరాజయం పొందింది.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ప్రమీలవల్లిపై జీవితకాల నిషేధం విధించబడింది. కెరీర్లో రెండో సారి డోపింగ్‌కు పాల్బడినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.
అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం అయిన తానాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 20మంది కార్యవర్గ సభ్యులను బహిష్కరిస్తూ తానా అద్యక్షుడు కాకర్ల ప్రభాకర చౌదరి తీర్మానం చేశాడు.
చోడవరం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా సమర్పంచాడు.
జర్మనీలో జరిగిన బిట్‌బర్గర్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో చేతన్ ఆనంద్ టైటిల్ సాధించాడు. చేతన్ ఆనంద్ భార్య గుత్తా జ్వాల మిక్స్డ్ డబుల్స్‌లో విజయం సాధించింది.