Jump to content

సూదిని జైపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
(Sudini Jaipal Reddy నుండి దారిమార్పు చెందింది)
జైపాల్ రెడ్డి
సూదిని జైపాల్ రెడ్డి

సూదిని జైపాల్ రెడ్డి


భూ శాస్త్ర విజ్ఞాన శాఖామంత్రి
పదవీ కాలం
29 అక్టోబరు 2012 – 18 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు వాయలార్ రవి
తరువాత జితేంద్ర సింగ్

శాస్త్ర, సాంకేతిక శాఖామంత్రి
పదవీ కాలం
29 అక్టోబరు 2012 – 18 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు అశ్వని కుమార్
తరువాత జితేంద్రసింగ్

భారత పార్లమెంటు సభ్యుడు
పదవీ కాలం
జూన్ 2009 – మే 2014
ముందు నియోజకవర్గం ప్రారంభం
తరువాత కొండా విశ్వేశ్వర రెడ్డి
నియోజకవర్గం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1942-01-16)1942 జనవరి 16
మాడ్గుల్, హైదరాబాదు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం తెలంగాణ, భారతదేశం)
మరణం 2019 జూలై 28(2019-07-28) (వయసు 77)
హైదరాబాదు, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం 2 కుమారులు, 1 కూమర్తె
నివాసం మాడ్గుల్, తెలంగాణ
వృత్తి రైతు
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

సూదిని జైపాల్ రెడ్డి (1942 జనవరి 16 - 2019 జూలై 28) రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. ఇతను పెట్రోలియం, సహజవాయువు మంత్రిగా పదవిని నిర్వహించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

జైపాల్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లోని మాడుగులలో 1942, జనవరి 16న జన్మించాడు. 18 నెలల వయసులో పోలియో వ్యాధి కారణంగా వైకల్యానికి గురయ్యాడు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇతను కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969, 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను మొదటిసారిగా 1984లో భారత పార్లమెంటుకు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1999, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. 1990, 1996 లలో రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 1991-1992 లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన చర్చలు అత్యంత కీలకమైనవి. ఇతను1998లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నుకోబడ్డాడు.[2]

మరణం

[మార్చు]

జైపాల్ రెడ్డి హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స పొందుతూ 2019, జూలై 28 తెల్లవారుజామున గం. 1.28 ని.లకు మరణించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. బిబిసీ తెలుగు, తెలంగాణ (28 July 2019). "జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త". Archived from the original on 29 జూలై 2019. Retrieved 29 July 2019.
  2. సాక్షి, తెలంగాణ (29 July 2019). "ఓయూ నుంచి హస్తినకు." Sakshi. Archived from the original on 29 జూలై 2019. Retrieved 29 July 2019.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (29 July 2019). "విలువల వైతాళికుడు జైపాల్‌ రెడ్డి అస్తమయం". www.andhrajyothy.com. Archived from the original on 29 జూలై 2019. Retrieved 29 July 2019.

బయటి లింకులు

[మార్చు]

మూస:చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం