Jump to content

పెనుగంచిప్రోలు

అక్షాంశ రేఖాంశాలు: 16°54′10.728″N 80°14′57.192″E / 16.90298000°N 80.24922000°E / 16.90298000; 80.24922000
వికీపీడియా నుండి
(Penuganchiprolu నుండి దారిమార్పు చెందింది)
పెనుగంచిప్రోలు
పటం
పెనుగంచిప్రోలు is located in ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు
అక్షాంశ రేఖాంశాలు: 16°54′10.728″N 80°14′57.192″E / 16.90298000°N 80.24922000°E / 16.90298000; 80.24922000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్
మండలంపెనుగంచిప్రోలు
విస్తీర్ణం38.8 కి.మీ2 (15.0 చ. మై)
జనాభా
 (2011)
14,374
 • జనసాంద్రత370/కి.మీ2 (960/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు7,098
 • స్త్రీలు7,276
 • లింగ నిష్పత్తి1,025
 • నివాసాలు3,894
ప్రాంతపు కోడ్+91 ( 08678 Edit this on Wikidata )
పిన్‌కోడ్521190.
2011 జనగణన కోడ్588859

పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా, ఇదే పేరుతో ఉన్నపెనుగంచిప్రోలు మండలానికి ప్రధానకేంద్రం. పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ పెనుగంచిప్రోలు మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీ 16 వార్డులతో పంచాయితీ హోదా కలిగి ఉంది. పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో 4 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3894 ఇళ్లతో, 14374 జనాభాతో 3880 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7098, ఆడవారి సంఖ్య 7276. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3659 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 326. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 588859.ఈ గ్రామం 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[2][3]

గ్రామ చరిత్ర

[మార్చు]

పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా పిలువబడింది. పెనుగంచిప్రోలు అను పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది.తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయాలు ఉండేవని అంటారు. అయితే కాలక్రమలో ఈ ఊరి ప్రక్కనే ప్రవహించుచున్న మున్నేరు వరదల వల్ల ఆ ఊరు, ఆ దేవాలయాలు భూగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఇప్పటికనీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్ధంభాలు నీటిలో కనిపిస్తాయి. కొన్ని బయటకు కనిపిస్తాయి. కాని వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరిలోనున్న ఆదినారాయణస్వామి, గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే.పెనుగ్రంచిపోలు సంస్థానానికి సంబంధిచిన అనేక తవ్వకాలలో అనేక శాసనాలు లభ్యమయ్యాయి.పెనుగంచిప్రోలు గ్రామమే పాలంచెన్నూర్ అని షుమారు 1520 వ సంవత్సరంలో హిందూరాజులకు గోల్కొండ నవాబైన కులీ కుతుబ్ షా సైన్యానికి మున్నేటి ఒడ్డున పెద్ద యుద్ధం జరిగిందని ఆయుద్ధంలో హిందూ సైన్యం ఓటమి చెందిందని మనకు చరిత్ర బట్టి తెలియజేస్తుంది. బహుశా ఆ యుద్ధం తరువాత గ్రామ దేవాలయాలు శిల్ప సంపద కొల్లగొట్టబడి ఉంటుంది. అందువల్లనే ఈ గ్రామంలో మున్నేటి వొడ్డున ఎక్కడ పునాదులు త్రవ్వినా ఏదోవొక ఆనాటి ప్రాభవ శిల్పసంపద ఆనవాళ్లు బయల్పడుచున్నవి.

సమీప గ్రామాలు

[మార్చు]

ముండ్లపాడు 3 కి.మీ, లింగగూడెం 3 కి.మీ, కొల్లికుల్ల 4 కి.మీ, ముచ్చింతాల 5 కి.మీ, నందిగామ 16  కి.మీ, తోటచర్ల 10  కి.మీ , జగ్గయ్యపేట 18 కి మీ,, మక్కపేట 6 కిమీ

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెనుగంచిప్రోలులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 62 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాధమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాధమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. రెండు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లు కలవు . సమీప బాలబడి జగ్గయ్యపేటలో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల జగ్గయ్యపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగ్గయ్యపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి. ఉన్నత పాఠశాల విద్యార్థులకు చక్కని ట్యుటోరియల్ పాయింట్స్ రెండు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కొరకు రెండు ట్యుటోరియల్ పాయింట్స్ కలవు.

మౌలిక వసతులు

[మార్చు]
  • ప్రాథమిక వైద్యశాల
  • అంగనవాడీ కేంద్రం
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • సప్తగిరి గ్రామీణ బ్యాంకు

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెనుగంచిప్రోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

అందమైన మునేరు నది, చెరువు, నాగార్జున సాగర్ కాలువలు ఈ ఊరి వ్యవసాయానికి జీవానాధారాలు. సాగునీటి కొరత బాగా ఉంది. సెప్టెంబర్ వరకు సాగర్ నిండకపోవడం వలన పంటల దిగుబడి సరిగా రావడం లేదు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ప్రవేశపెట్టబడినది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.ఇప్పుడు పరిస్థితి మారినది. చెత్త నుండి సంపద కేంద్రం ఏర్పాటు జరిగింది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలై 28లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చింతల శ్రీలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా సీతారామయ్య ఎన్నికైనాడు.2021 ఫిబ్రవరి లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శ్రీమతి.వేల్పుల.పద్మ కుమారి గారు సర్పంచ్ గా ఎన్నికైనారు గతంలో 2001వ సంవత్సరంలో పద్మ కుమారి గారు పెనుగంచిప్రోలు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గా జడ్పీటీసీ గా ఎన్నిక అయ్యారు. 2009వ సంవత్సరo లో ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళా సమాఖ్య (ఐ కె పి)అధ్యక్షురాలి గా ఎన్నిక అయ్యారు... పెనుగంచిప్రోలు చెరువు కట్ట పై రోడ్డు నిర్మాణం చేసి కట్టను పటిష్టం చేశారు... అలుగు వాగు వద్ద మంచి చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. తూర్పు బజారు లో సచివాలయం నిర్మించి రాష్ట్రము లోనే తొలి సోలార్ సచివాలయం గా తీర్చి దిద్దారు.. జల జీవన్ మెషిన్ ప్రాజెక్టు ద్వారా 4కోట్ల రూపాయల తో మంచి నీటి ప్రాజెక్టు పనులకు కు శ్రీకారం చుట్టారు.. కోటి రూపాయల వ్యయం తో గండి వాగుపై రైతాoగం కోసం బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. గ్రామం లో పెద్ద ఎత్తున మొక్కలు రోడ్ల పక్కన పెంచడం లో కృషి చేశారు.

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం

[మార్చు]

ఈ గ్రామంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం గ్రామ దేవత తిరునాళ్లు బాగా జరుగుతాయి.[4] గ్రామంలో 101 దేవాలయలు ఉన్నాయి. తిరుపతమ్మ దేవాలయం రాష్ట్రంలో 11 వ స్థానం గడించి, 9 వ నంబరు జాతీయ రహదారి నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయ ఆవరణలోనే అంకమ్మ అమ్మవారు వెలశారు. ఈ ఆలయానికి పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, సుబ్బాయిగూడెం గ్రామాల పరిధిలో 35 ఎకరాల వ్యవసాయ భూములు మాన్యం భూములుగా ఉన్నాయి.

ఇతర దేవాలయాలు

[మార్చు]
  • ప్రసిద్ధి చెందిన శ్రీ ధర్మపురి యోగానంద నృసింహస్వామివారి దేవాలయం.
  • అతి పురాతనమైన రుక్మిణి, గోదా సమేత గోపాలస్వామివారి దేవాలయం.
  • పడమటి బజారున పురాతన ఆదినారాయణ స్వామివారి దేవాలయం.
  • శ్రీ శంభులింగేశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ రామాలయం:- ఈ ఆలయం స్థానిక జమ్మిచెట్టు కూడలి (సెంటర్) లో ఉంది. ఈ ఆలయానికి అనుబంధంగా, 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, ఒక కళ్యాణ మండపం ప్రారంభించారు.
  • శ్రీ వరలక్ష్మీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయ ఆవరణలో, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
  • శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయం:- స్థానిక శాలిగడ్డపై ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2017,ఆగస్టు-8వతేదీ మంగళవారంనాడు ప్రారంభమైనది.

సమీప దేవాలయాలు

[మార్చు]

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఆంధ్రా బ్యాంక్
  • సప్తగిరి గ్రామీణ బ్యాంక్
  • ఎపి రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు
  • యాక్సిస్ బ్యాంక్-
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎం
  • ఆంధ్రా బ్యాంక్ఎ టిఎం
  • ఎపి రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఎటిఎం

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెనుగంచిప్రోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 446 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 871 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 33 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 96 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 76 హెక్టార్లు
  • బంజరు భూమి: 81 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2273 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1544 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 886 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెనుగంచిప్రోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 127 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 659 హెక్టార్లు
  • చెరువులు: 89 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 11 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెనుగంచిప్రోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, మిరప, కందులు, పెసలు, జొన్న పంటలు పండిస్తారు. ఈ గ్రామం మామిడి తోటలకు ప్రసిద్ధి.

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం, పప్పులు

చేతివృత్తులవారి ఉత్పత్తులు

[మార్చు]

కుండలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామం పాడి పంటలకు, వ్యవసాయానికి పేరు గాంచింది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • భండారు అచ్చమాంబ
  • దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్యప్రముఖ స్వతంత్ర సమర యోధుడు.రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గా పనిచేయడం జరిగింది.
  • కొమర్రాజు వెంకట లక్ష్మణరావు,
  • మంచికంటి రాంకిషన్ రావు ,(ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు. మాజీ శాసన సభ్యులు ఖమ్మం నియోజక వర్గం )
  • యేరువ వెంకట నరసయ్య, (మునసబు)
  • సూరంపల్లి నరసయ్య, (మాజీ సర్పంచ్)
  • స్వామి మల్లిఖార్జున రావు, ధర్మదాత
  • స్వామి గోపాలరావు, వదాన్యులు
  • నీరుకొండ గోపాలరావు, (మాజీ సర్పంచ్ )
  • కంచేటి గోపయ్య మాజీ సర్పంచ్ పెనుగంచిప్రోలు.
  • వడ్లమూడి నాగమల్లేశ్వరరావు (చిన నాగయ్య) ఉన్నత విద్యా రంగ సలహాదారు
  • నలమోలు లక్ష్మయ్య, (గ్రామ కరణం )
  • యేరువ గోపయ్య, (గ్రామ మునసబు )
  • నలమోలు కోటేశ్వరరావు, (యువ శాస్త్రవేత్త అవార్డు గ్రహీత. అమెరికా )
  • కర్ల నాగశేషు, యు.ఎస్.ఎ
  • కర్ల లింగయ్య బుర్రకథ కళాకారులు.
  • తంబరేణి నరసింహరావు
  • ముక్కా సత్యనారాయణ, ప్రముఖ రచయిత
  • లగడపాటి వెంకటేశ్వరరావు, దేవస్థానం మాజీ ఛైర్మన్, థియేటర్ అధినేత
  • వేల్పుల జాన్ కోటయ్య , స్వాతంత్ర సమర యోధులు సీనియర్ ఉపాధ్యాయులు.
  • కీ. శే. నలమోలు గోపాలరావు(ఫిజిక్స్ ప్రొఫిసర్, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్, రాక్ఫార్డ్ యూనివర్సిటీ, ఇల్లినోస్ చికాగో, యుఎస్ఎ ).
  • నలమోలు వెంకట్రామ ప్రసాద్. ప్రముఖ హుద్రోగ సర్జెన్, యుఎస్ఎ
  • నలమోలు యశోలత, ప్రముఖ కాన్సర్ వ్యాధి నిపుణులు, యుఎస్ఎ
  • వేల్పుల రవికుమార్, ప్రముఖ రాజకీయ నాయకులు రాష్ట్ర నెడ్కాప్ NREDCAP కార్పొరేషన్ చైర్మన్ గా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా పనిచేసారు., వైస్సార్సీపీ సీనియర్ లీడర్ గా ఉన్నారు.
  • వాసిరెడ్డి బెనర్జీ, ఆధ్యాత్మికవేత్త, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు
  • వేగినేటి గోపాల కృష్ణమూర్తి, ప్రథమ మండల పరిషత్ అధ్యక్షులు
  • చింతల సీతారామయ్య, ప్రముఖ రాజకీయ నాయకులు
  • గజ్జి కృష్ణమూర్తి, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చీఫ్ విప్

వేల్పుల దాసు కే.వి.ఆర్. జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీనియర్ ఉపాధ్యాయులు. పెనుగంచిప్రోలు స్థానికులు. రావూరి గోపాలరావు గారు కే వి ఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు. పొడుగు రాంబాబు గారు జిల్లా పరిషత్ కే వి ఆర్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు. మామిడి రామకృష్ణ ప్రసాద్ అమ్మవారి సత్రముల స్థలదాత... దివ్వెల పిచ్చయ్య ప్రముఖ న్యాయ కోవిదులు.. సీనియర్ న్యాయవాది. పద్మనాభుని సత్య నారాయణ సీనియర్ నాయకులు. గాంధీయవాది.

వనరులు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "About Temple | Temple Info | TAPGPL". tms.ap.gov.in. Archived from the original on 2021-09-10. Retrieved 2021-09-10.

వెలుపలి లింకులు

[మార్చు]