Jump to content

పత్తికొండ

అక్షాంశ రేఖాంశాలు: 15°23′46.97″N 77°30′2.84″E / 15.3963806°N 77.5007889°E / 15.3963806; 77.5007889
వికీపీడియా నుండి
(Pattikonda నుండి దారిమార్పు చెందింది)
పత్తికొండ
పటం
పత్తికొండ is located in ఆంధ్రప్రదేశ్
పత్తికొండ
పత్తికొండ
అక్షాంశ రేఖాంశాలు: 15°23′46.97″N 77°30′2.84″E / 15.3963806°N 77.5007889°E / 15.3963806; 77.5007889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు
మండలంపత్తికొండ
విస్తీర్ణం45.81 కి.మీ2 (17.69 చ. మై)
జనాభా
 (2011)[1]
29,342
 • జనసాంద్రత640/కి.మీ2 (1,700/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు14,428
 • స్త్రీలు14,914
 • లింగ నిష్పత్తి1,034
 • నివాసాలు6,138
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్518380
2011 జనగణన కోడ్594418

పత్తికొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లా, పత్తికొండ మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. పత్తికొండ, గుత్తి - ఆదోని మార్గంలో ఆస్పరి రైల్వే స్టేషను నుండి 12 మైళ్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి 50 మైళ్ళ దూరంలో ఉంది. పట్టణానికి పశ్చిమాన హంద్రీ నది ప్రవహిస్తుంది. ఇది సమీప పట్టణమైన ఆదోని నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6138 ఇళ్లతో, 29342 జనాభాతో 4581 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 14428, ఆడవారి సంఖ్య 14914. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3387 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1360. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594418.[2]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,342. ఇందులో పురుషుల సంఖ్య 12,577, మహిళల సంఖ్య 11,765, గ్రామంలో నివాస గృహాలు 4,631 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 14, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రభుత్వ ఆర్ట్స్/ సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప అనియత విద్యా కేంద్రం ఆదోని లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కర్నూలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పత్తికొండలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు నలుగురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరు బావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని నేరుగా జల వనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పత్తికొండలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. స్వయం సహాయక బృందం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పత్తికొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 914 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 84 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 3583 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 3550 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 33 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పత్తికొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 33 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పత్తికొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వేరుశనగ, టమాటా, పత్తి

చరిత్ర

[మార్చు]

పత్తికొండ 14వ శతాబ్దంలో హరిహర రాయలు కాలంలో నిర్మించబడింది. స్థానిక కైఫియత్తు ప్రకారం ఒక గొర్రెలకాపరి అడవిని నరికి ఇక్కడ ప్రత్తి పండించడం ప్రారంభించాడు. ఈ ప్రదేశంలో పంట బాగా పండటంతో, ఇతరులు ఇక్కడ చేరి, ఒక గ్రామం ఏర్పడింది. కాలక్రమంలో ఇక్కడ నాలుగు కుగ్రామాలు ఏర్పడ్డాయి. విజయనగర యువరాజైన కోనేరురాజు వంశజుడైన వెంకట రాజా ఈ గ్రామాన్ని జాగీరుగా పొంది, గ్రామాన్ని సమీపంలోని కొండమీదికి తరలించాడు. అందుకని గ్రామానికి పత్తికొండ అన్న పేరు వచ్చింది. వెంకట రాజా కుటుంబం క్షీణించిన తర్వాత దేవనకొండ పాలేగారైన బొజ్జప్పనాయుడు (మద్దికెర పాలేగార్ల పూర్వజుడు) పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే వెంటనే అతని వద్దనుండి మహమ్మదీయులు వశం చేసుకుని, ఆదోని మండలంలో కలుపుకున్నారు. షేర్ అలీబాబా సాహెబ్ అనే మహమ్మదీయుడు గ్రామాన్ని జాగీరుగా పొంది, ఇరవై సంవత్సరాలు అనుభవించాడు. ఆయన కొండ మీద కోటలో నివసిస్తూ, మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నాడు. 1756లో బసాలత్ జంగ్ ఆదోని జాగీరును పొంది, పత్తికొండను ఉత్తమాన్ కు జాగీరుగా ఇచ్చాడు. అయితే ఉత్తమాన్ త్వరలోనే జాగీరును కోల్పోయాడు. బసాలత్ జంగ్, చనుగొండ్ల తాసీల్దారుగా నియమించిన మీర్ బక్ష్ సబ్జర్ జంగ్, మార్గాన్ పత్తికొండ ద్వారా వెళుతున్నపుడు ఉత్తమన్ ఆయనకు సరైన గౌరమివ్వలేదు. అవమానంగా భావించిన సబ్జర్ జంగ్, ఆదోని తిరిగివచ్చి రెండు వేల అశ్విక, పదాతి దళాలతో, బసాలత్ జంగ్ వద్ద పనిచేస్తున్న ఫ్రెంచి అధికారి, ఎం.లాల్లీ సైనిక ఆధ్వర్యాన పత్తికొండపై దాడిచేసి ముట్టడించాడు. 1800లులో పట్టణం దత్తమండలాలలో భాగంగా బ్రిటీషువారి పరమైంది. మద్రాసు రాష్ట్ర గవర్నరు సర్ థామస్ మన్రో 1827లో జూన్ 6న కలరా వ్యాధి సోకి ఇక్కడే మరణించాడు.[3] పత్తికొండ 1858 వరకు బళ్ళారి జిల్లాలో భాగంగా ఉంది.అప్పట్లో ఈ ప్రాంతాన్ని పంచపాల్యం తాలూకాగా వ్యవహరించేవాళ్లు. ఈ ప్రాంతాన్ని ఐదుగురు పాలేగాళ్ళు పాలించడం వల్ల ఆ పేరు వచ్చింది.[4] ఈ పాలేగాళ్ల రాజధానులు, చెన్నంపల్లి, ప్యాపిలి, కప్పట్రాళ్ల, మద్దికెర, దేవనకొండలలో ఉండేవి. ఈ ఊళ్లన్నింటిలో పాలేగార్లు నిర్మించిన కోటదుర్గాలు ఉండేవి. కానీ అవి జీర్ణావస్థకు చేరాయి.[5] ఉత్తర సర్కారులు కాక యితర జిల్లాలలో రయితువారీ పద్ధతిని ప్రవేశపెట్టిరి. దీనికి ముఖ్యకారకులు సర్ తామస్ మన్రోగారు ఆ కాలపు ఇంగ్లీషువారిలో అత డుత్తమోత్తము డనిపించుకొన్నాడు. అతడు మద్రాసు సూబాలో 24 ఏండ్లుండినాడు. తుది సంవత్సరాలలో రాయలసీమకై చాలా పాటుపడినారు. అతడు కలరా తగిలి కర్నూలు జిల్లాలోని పత్తికొండలో 1827 లో చనిపోయెను. అతన్ని రాయలసీమ ప్రజలు చాలా ప్రేమించిరి. పలువురు మన్రో అయ్య అని తమ పిల్లలకు పేరు పెట్టుకొనిరి. మన్రో సూచించిన పద్ధతియే యిప్పటి పట్టాదారు పద్ధతి.

మౌలిక వసతులు

[మార్చు]

రోడ్దు వసతి

[మార్చు]

రవాణా: పత్తికొండ నుండి కేవలం పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే. ఎందుకంటే పల్లెలలో ఆటోలు తిరుగుతాయి కాబట్టి మేము తిప్పము అని డిపో వారు తేల్చి చెప్పారు. కేవలం 35 కి.మీ. ప్రాంతంనకు కూడా సరైన బసు సౌకర్యాలు లేవు. విజయవాడ, హైదరాబాద్, కర్నూల్, బెంగుళూరు, మైసూర్, ఆదోని, మాత్రమే బస్సులు తిరుగుతాయి కాని దగ్గర గుంతకల్, గుత్తి, కి ఆర్డినరి బస్సులు తిప్పడానికి బస్సులు లేవు. 5/- రూ.లు పెట్టవలసిన బస్ చార్జి 10/- పెట్టి ప్రయాణం చేయవలసిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఆదోని నుండి సాయంత్రం 6 తరువాత రావాలంటే మనకు బస్ సీటు కాళీ వున్నా నిలబడి 35 కి.మీ. నిలబదవలసినదే. ఇప్పటికయినా ఈ వెనుక బడిన ప్రాంతం అభివృద్ధి లోకి తీసుకొని రాగలరా ఈ నాయకులు మరి వేచి చూడాలి.

విద్యుద్దీపాలు

[మార్చు]

విద్యుత్ అనేది కేవలం పట్టణాలకే. ఎందుకంటే తీగలు తెగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఇక విద్యుత్ ఎప్పుడు ఇస్తే మేము నీరు నింపుకుంటాం. కరెంట్ లేనపుడు మేము ఏమి చేయలేము, ఇక విద్యుత్ బిల్లులు సకాలంలో చేల్లుబాటు కావాలి. ఏ దానికి ఎంత అని కూడా సరైన సమాచారం అందులో వుండదు. ఆడిషన్ చార్జి పేరుతొ ప్రభుత్వం మిమ్మల్ని తొక్కుతున్నది మేము ఏమి చేయలేము మరి. అందుకే ఎంత వచ్చిన మనం నోరు మూసుకొని కట్టాలి.

తపాలా సౌకర్యం

[మార్చు]

కాస్త మెరుగు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ ఇంటర్నెట్ సౌకర్యాలు మాత్రమే మూన్నాళ్ళ ముచ్చట.

ప్రముఖులు

[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • వెంకటేశ్వర స్వామీ దేవాలయం.
  • కొత్త, పాత శివాలయం.
  • అమ్మవారి శాల.
  • శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహం:- ఈ విగ్రహం పత్తికొండ పట్టణ శివారులలో, గుత్తి రహదారి ప్రక్కనే ఉంది. [1]
  • సాయిబాబా దేవాలయం.

ప్రధాన పంటలు

[మార్చు]

పత్తికొండ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఆముదం, వేరుశనగ, శనగ పంట ప్రధాన పంటలు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పత్తి, కొర్ర, జొన్న, తదితర పంటలను మాత్రమే వేస్తున్నారు. అయితే ఇక్కడి గ్రామాలకు సరి అయిన నీటి వసతి లేదు. కేవలం వర్షాధార పంటలు పండుతున్నాయి. 2011-2015 మధ్య కాలములో రైతుల పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. పంట పండించాలసిన రైతు ఈ రోజు కూలిగా మారుతున్నాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు కేవలం వారి లేదా గ్రామ పెద్దలకు మాత్రమే (డబ్బు) సరిపోతుంది. ఇక రైతును పట్టించుకొనే నాధుడు ఒక్క నాయకుడు కూడా లేదు. నీటి కాలవలు వున్న అవి కేవలం దిష్టి బొమ్మలు మాత్రమే.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. A manual of the Kurnool district in the presidency of Madras By Narahari Gopalakristnamah Chetty
  4. Gazetteer of South India, Volume 1 By W. Francis
  5. Lists of the antiquarian remains in the presidency of Madras, Volume 2

వెలుపలి లింకులు

[మార్చు]