Jump to content

కడప

అక్షాంశ రేఖాంశాలు: 14°28′N 78°49′E / 14.47°N 78.82°E / 14.47; 78.82
వికీపీడియా నుండి
(Kadapa నుండి దారిమార్పు చెందింది)
కడప
నగరం
ద్విశతాబ్ది ఉత్సవాల స్మారకం (పైలాన్)
ద్విశతాబ్ది ఉత్సవాల స్మారకం (పైలాన్)
కడప is located in ఆంధ్రప్రదేశ్
కడప
కడప
కడప is located in India
కడప
కడప
Coordinates: 14°28′N 78°49′E / 14.47°N 78.82°E / 14.47; 78.82
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్‌ఆర్ జిల్లా
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • Bodyకడప నగరపాలక సంస్థ, ది అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎయుడిఎ)
Elevation
138 మీ (453 అ.)
జనాభా
 (2022)
 • Total4,66,000
Demonymకడప బిడ్డ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
516001,002,003,004
ప్రాంతీయ ఫోన్ కోడ్+91–8562
Vehicle registrationAP-39 now, (AP-04)before

కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నగరం. వైఎస్ఆర్ జిల్లా కేంద్రం. కడప మండలానికి ప్రధాన కేంద్రం. ఈ నగరం పెన్నా నదికి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]
కడప పట్టణ రైల్వే స్టేషను
కడప పట్టణ రైల్వే స్టేషను

దేవుని కడప స్థలపురాణం ప్రకారం ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించాడు. అందు వలన ఈ పట్టణానికి కృపాపురం, కృపనగరం అని పేరు వచ్చింది. కృపనగరంలోని కృప అన్న పదం ఉచ్చారణ క-రి-ప గా, చివరికి కడపగా మారింది. క్రీ.పూ. 2వ శతాబ్దం - సా.శ. 2వ శతాబ్దం మధ్య కాలంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు.[1] విదేశీ లిపిలో కరిప అనే పేరు కరిపెగా నమోదైందని భావించవచ్చు.

దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. ఐతే కడప పట్టణానికి పేరు దీనివల్ల రాలేదు.

ప్రాచీన యుగంలో గానీ, మధ్యయుగంలో కనీసం అన్నమయ్య కాలం వరకు గానీ కడప పట్టణాన్ని గడప అని వ్యవహరించేవారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. ఆ తిరుమలేశుని పరమభక్తుడైన అన్నమయ్య కూడా దేవుని కడప గురించి పాడిన కీర్తనల్లో కడప రాయడు అని పేర్కొన్నాడే తప్ప ఎక్కడా గడప అన్న పదమే వాడలేదు.[2] అంటే అన్నమయ్య కాలం వరకు కూడా కడప పేరుకు, గడపకు సంబంధమే లేదు. కడప-గడపలను ఒకదాని బదులు ఇంకొకటి వాడడానికి కారణం కడప నవాబుల కాలంలో వాడుకలోకి వచ్చిన పార్శీ భాషే కావచ్చని రాహి ఫిదాయి పేర్కొన్నాడు-.[3] తెలుగులో థ-ధ ల మధ్య ఉన్నట్లే పర్షియన్ భాషలో క-గ ల మధ్య ఒక చుక్కే తేడా. ఇప్పుడు ఎక్కువ మంది తెలుగువారు థ బదులు ధ అని రాయడం, పలకడం చేస్తున్నట్లే ఆ కాలంలో కడపను గడప అని రాయడం, పలకడం మొదలై ఉండొచ్చు.

బ్రిటీషు పాలనా కాలంలో భారతదేశంలో 'కడ'తో మొదలయ్యే ఊర్ల పేర్లకు స్పెల్లింగు Cudda- అని వాడారు. కడప స్పెల్లింగు Cuddapah, తమిళనాడులోని కడలూరు స్పెల్లింగు Cuddalore అలా వచ్చినవే. కడప స్పెల్లింగును 2005 ఆగస్టు 19 లో ప్రాంతీయులకి సౌకర్యంగా ఉండేవిధంగా "Kadapa" అని మార్చారు.

చరిత్ర

[మార్చు]

11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యము లోని భాగం.14వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఇది విజయనగర సామ్రాజ్యములో భాగమైంది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉంది. 1422 లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమైంది. కడప నగరం పురాతనమైంది. అయిననూ కుతుబ్ షాహీపాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనం అవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలింది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయాన నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైంది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కడప స్థితిగతులను తన కాశీయాత్ర చరిత్రలో రికార్డు చేశాడు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశాడు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో నది, ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.[4] 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందింది.

భౌగోళికం

[మార్చు]

కడప పట్టణం భౌగోళికంగా 14°28′N 78°49′E / 14.47°N 78.82°E / 14.47; 78.82 వద్ద ఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు ఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. పశ్చిమం దిశగా బళ్ళారి నుండి అనంతపురం గుండా పారే పెన్నా నది ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న నెల్లూరు జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగిలేరు, చెయ్యేరు, పాపాఘ్ని.

పరిపాలన

[మార్చు]
వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్

కడప నగరపాలక సంస్థ నగరపాలన నిర్వహిస్తుంది.

విద్యారంగం

[మార్చు]
రాజీవ్ గాంధీ వైద్య కళాశాల
  • యోగి వేమన విశ్వవిద్యాలయం
  • ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (రిమ్స్ వైద్య కళాశాల, పుట్లంపల్లి)
  • రిమ్స్ దంత వైద్య కళాశాల, పుట్లంపల్లి
  • వైఎస్సార్ భవన నిర్మాణ, లలిత కళా విశ్వవిద్యాలయం
  • ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయం ప్రతిపత్తి కళాశాల)
  • SKR & SKR (శ్రీ కడప కోటిరెడ్డి & శ్రీమతి కడప రామసుబ్బమ్మ) ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి కళాశాల)
  • వైఎస్సార్ క్రీడా పాఠశాల
  • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
  • కడప శంకరాపురంలో ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాల (ఈ పాఠశాల 1949 లో యం వెంకటరత్నం స్థాపించాడు)
  • కందుల శ్రీనివాస రెడ్డి స్మారక ఇంజినీరింగ కళాశాల

నగరంలోని ప్రాంతాలు

[మార్చు]
  • మృత్యుంజయకుంట
  • నబీకోట
  • నకాష్
  • ప్రకాశ్ నగర్
  • ఓంశాంతి నగర్
  • కో ఆపరేటివ్ కాలనీ
  • ఎన్ జీ ఓస్ కాలనీ
  • పోలీస్ క్వార్టర్స్
  • రాజారెడ్డి వీధి
  • మరియాపురం
  • సీయోనుపురం
  • రైల్వే స్టేషను రోడ్డు
  • ఎర్రముక్కపల్లి
  • కాగితాల పెంట
  • మాచంపేట
  • చంద్ర మౌలినగర్


రవాణా

[మార్చు]
  • కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 వ జాతీయ రహదారి,
  • చెన్నై ముంబై లను కలిపే 716 వ జాతీయ రహదారి
  • కడప బెంగళూరులను కలిపే 340 వ జాతీయ రహదారి
  • కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, కంభం
  • మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే, కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడపలో ఉన్నాయి.
  • కడప రైల్వే స్టేషన్ ముంబై - చెన్నై రైలు మార్గంలో వుంటుంది. రాష్ట్రంలో రైల్వే సౌకర్యం కల్పించబడిన మొట్ట మొదటి జిల్లా కేంద్రం కడప. ఇది ఎర్రగుంట్ల - నంద్యాల రైల్వే లైను, ఓబులవారిపల్లె - కృష్ణపట్నం రైల్వే లైనుల కూడలి కూడా. కడప బెంగళూర్ రైల్వే లైన్ పెండ్లిమర్రి వరకు పూర్తి అయింది.
  • కడప విమానాశ్రయం

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. MAJUMDAR SASTRI, SURENDRANATH (1927). ANCIENT INDIA as described by PTOLEMY (PDF). Calcutta: CHUCKERVERTTY, CHATTERJEE & Co. Retrieved 26 October 2021.
  2. పాలెం, వేణుగోపాల్ (2006). కడప రాయని అన్నమయ్య కప్పురపు కీర్తనలు (PDF). కడప: లక్ష్మీకుమార ప్రచురణలు. Retrieved 29 October 2021.
  3. భారత కమ్యూనిస్టు పార్టీ, విశాలాంధ్ర దినపత్రిక (1992). కడప జిల్లా సమాచార దర్శిని. కడప: భారత కమ్యూనిస్టు పార్టీ.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కడప&oldid=4375156" నుండి వెలికితీశారు