Jump to content

సెయింట్ మేరీ కేథడ్రాల్

వికీపీడియా నుండి

సెయింట్ మేరీ కేథడ్రాల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో,వైఎస్‌ఆర్ జిల్లా, కడప నగరంలో గల పెద్ద చర్చి. ఇది నగరంలోని మరియాపురంలో కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి మీద వుంది.

ప్రత్యేకతలు

[మార్చు]
  • 1992 ఫిబ్రవరి 19 వ తేదీన ఆ చర్చిని ప్రారంభించారు.
  • ఈ చర్చి ఆధునిక నిర్మాణం. రాష్ట్రంలో ఇటువంటిది మరెక్కడా లేదు. ఆ రోజుల్లో నిర్మాణానికి అయిన ఖర్చు కోటి రూపాయలు.
  • చర్చి పైభాగంలో రంగురంగుల గుమ్మటం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ గుమ్మటం రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
  • తెల్లని పాలరాతితోను, ఆకుపచ్చ రాతితోను ఈ మందిరాన్ని నిర్మించారు.
  • సువిశాల మైదానంలో అందమైన ఈ మందిరం చూచేవారికి కనువిందు చేస్తుంది.
  • ప్రతిరోజూ ప్రార్థనలతో ఈ క్రైస్తవ మందిరం ప్రశాంతి కేంద్రంగా ఉంటుంది. ఆరోగ్యమాత వేడుకలు, క్రిస్మస్ వేడుకలు ఆనంద పారవశ్యాలతో సాగుతాయి.
  • హిందూ, క్రైస్తవ వాస్తుశిల్ప నిపుణులచే ఈ మందిరం నిర్మించబడింది.

మూలాలు, వనరులు

[మార్చు]

వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు