Jump to content

బేరియం ఫ్లోరైడ్

వికీపీడియా నుండి
(BaF2 నుండి దారిమార్పు చెందింది)
బేరియం ఫ్లోరైడ్
Barium fluoride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7787-32-8]
పబ్ కెమ్ 62670
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CQ9100000
SMILES [Ba+2].[F-].[F-]
ధర్మములు
BaF2
మోలార్ ద్రవ్యరాశి 175.34 g/mol
స్వరూపం white cubic crystals
సాంద్రత 4.893 g/cm3
ద్రవీభవన స్థానం 1,368 °C (2,494 °F; 1,641 K)
బాష్పీభవన స్థానం 2,260 °C (4,100 °F; 2,530 K)
0.16 g/100 mL (20 °C)
ద్రావణీయత soluble in methanol, ethanol
వక్రీభవన గుణకం (nD) 1.455
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Fluorite (cubic), cF12
Fm3m, No. 225
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/22
S-పదబంధాలు (S2), S28
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
250 mg/kg, oral (rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Beryllium fluoride
Magnesium fluoride
Calcium fluoride
Strontium fluoride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం ఫ్లోరైడ్ ఒకరసాయన సమ్మేళన పదార్థము. ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం. ఈ సమ్మెలన పదార్థం బేరియం, ఫ్లోరిన్ మూలకాల సంయోగం వలన ఏర్పడినది.ఇది ఒక లవణం . ప్రకృతిలో లభించు బేరియం ఫ్లోరైడ్ యొక్క ఖనిజం ఫ్రాంక్‌డిక్సోనైట్ (frankdicksonite).

భౌతిక లక్షణాలు

[మార్చు]

బేరియం ఫ్లోరైడ్ పారదర్శకంగా కనిపించు ఘన పదార్థం. బేరియం ఫ్లోరైడ్ యొక్క అణుభారం 175.34 గ్రాములు/మోల్.ఈరసాయన సమ్మేళన పదార్థము యొక్క సాంద్రత 4.893 గ్రాములు/సెం.మీ3,25°Cవద్ద[1].బేరియం ఫ్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం 1368 °C (2,494 °F;1,641 K)., దీని బాష్పీభవన స్థానం 2,260 °C. (4,100 °F; 2,530K).నీటిలో ద్రావణియత చాలా తక్కువ.20 °C వద్ద 100 మి.లీ.నీటిలో 0.16 గ్రాములు మాత్రమే కరుగును.బేరియం ఫ్లోరైడ్, మిథనాల్, ఇథనాల్‌లలో కరుగును. ఈ రసాయన సంయోగ పదార్థము యొక్క వక్రీభవనసూచిక 1.455.రసాయన సంకేత /ఫార్ములా BaF2.

ఉపయోగాలు

[మార్చు]

బేరియం ఫ్లోరైడ్ 150-200 nm నుండి 11–11.5 µm, తరంగ దైర్ఘ్యము కలిగిన అతినీలలోహిత, పరాణు కిరణాలకు పారదర్శకం.అందువలన ఈ సంయోగ పదార్థాన్ని దృశ్య సంబంధితపరికారాల రూపకల్పనలో కటకం వంటివి తయారు చెయ్యుటలో ఉపయోగిస్తారు.ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి (infrared spectroscopy) యొక్క గవాక్షము లో, [2] ప్రత్యేకంగా ఇంధన నూనె ల విశ్లేషణచెయ్యు సందర్భంలో ఉపయోగిస్తారు.

బేరియం ఫ్లోరైడ్ ను ఎక్సు కిరణాలను, గామా కిరణాలను లేదా అటువంటి శక్తివంతమైన కణాలను (particles) గుర్తించుటకు సింటిలేటరు (scintillator) గా ఉపయోగిస్తారు. అల్పా, బీటా కణాలకు కుడా బేరియం ఫ్లోరైడ్ ప్రతిస్పందిస్తుంది. ఎక్కువ శక్తివంతమైన (10–150 MeV) న్యుట్రానులను గుర్తించుటకు కూడా బేరియం ఫ్లోరైడ్‌ను ఉపయోగిస్తారు.ఇది మిగతా scintillators కు భిన్నంగా, అతినీలలోహిత కాంతిలో మెరువదు (glow).

500 °C వరకు వేడి చేసినప్పుడు నీటి వలన ఇదిక్షీణతకు (corrode) గురైతుంది.అయితే పొడి వాతావరణ పరిసరాలలో 800°Cవరకు ఎటు వంటి నష్టంకలుగకుండ ఉపయోగించవచ్చును. నీరుతో బేరియం ఫ్లోరైడ్ యొక్క నిరోధకతగుణం, కాల్షియం ఫ్లోరైడ్ కన్న తక్కువ.

బేరియం ఫ్లోరైడ్‌ను ఎనామిల్, గ్లేజింగు ఫ్రిట్స్ ఉత్పత్తిలో ప్రేయో పెసిఫైయింగ్ (preopacifying ) కారకంగా ఉపయోగిస్తారు.వెల్డింగ్ పూరకాలలో (flux), వెల్డింగ్ ఎలక్త్రోడుల తయారీలో ఉపయోగిస్తారు.లోహతయారిలో కుడా ఉపయోగిస్తారు.అల్యూమినియం లోహాన్ని శుద్ధి చెయ్యుటకు మోల్టన్ బాత్ గా ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Barium fluoride". sigmaaldrich.com. Retrieved 2015-07-29.
  2. "Barium Fluoride". crystran.co.uk. Retrieved 2015-07-29.