Jump to content

బేరియం ఆక్సైడ్

వికీపీడియా నుండి
బేరియం ఆక్సైడ్
పేర్లు
ఇతర పేర్లు
Barium monoxide
Barium protoxide
Calcined baryta
Baria
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1304-28-5]
పబ్ కెమ్ 62392
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CQ9800000
SMILES [Ba]=O
ధర్మములు
BaO
మోలార్ ద్రవ్యరాశి 153.326 g/mol
స్వరూపం white solid
సాంద్రత 5.72 g/cm3, solid
ద్రవీభవన స్థానం 1,923 °C (3,493 °F; 2,196 K)
బాష్పీభవన స్థానం ~ 2,000 °C (3,630 °F; 2,270 K)
3.48 g/100 mL (20 °C)
90.8 g/100 mL (100 °C)
Reacts to form Ba(OH)2
ద్రావణీయత soluble in ethanol, dilute mineral acids and alkalies; insoluble in acetone and liquid ammonia
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic, cF8
Fm3m, No. 225
కోఆర్డినేషన్ జ్యామితి
Octahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−582 kJ·mol−1[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
70 J·mol−1·K−1[1]
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/22
S-పదబంధాలు (S2), S28
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Calcium oxide
Strontium oxide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం ఆక్సైడ్ ఒక రసాయనిక సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయన ఫార్ములా BaO.బేరియం, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన సంయోగ పదార్థం ఇది.

భౌతిక లక్షణా లు

[మార్చు]

బేరియం ఆక్సైడ్ తెల్లని ఘన పదార్థం.బేరియం ఆక్సైడ్ యొక్క అణుభారం 153.326 గ్రాములు/మోల్. ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత 5.72 గ్రాములు/సెం.మీ3. బేరియం ఆక్సైడ్ యొక్క ద్రవీభవన స్థానం 1,923 °C (3,493 °F; 2,196 K).దీని బాష్పీభవన స్థానం ~ 2,000 °C (3,630 °F; 2,270 K).బేరియం ఆక్సైడ్ నీటిలో కరుగుతుంది. నీటి ఉష్ణోగ్రత పెరుగు కొలది, నీటిలో బేరియం ఆక్సైడ్ ద్రావణీయత పెరుగుతుంది.100 మి.లీ నీటిలో 20 °C వద్ద 3.48 గ్రాములు,100°Cవద్ద 90.8 గ్రాములు కరుగును. బేరియం ఆక్సైడ్ఇథనాల్, సజల ఖనిజ ఆమ్లాలలో, క్షారాలలో కరుగును.అసిటోన్ లో, ద్రవ అమ్మోనియాలో మాత్రం కరుగదు.

ఉత్పత్తి విధానం

[మార్చు]

బేరియం కార్బోనేట్ ను కోక్, (coke, కార్బన్ బ్లాక్ లేదా తారుతో కలిపి వేడి చెయ్యడం ద్వారా ఉత్పత్తి చెయ్యుదురు[2].బేరియం నైట్రేట్‌ను ఉష్ణవియోగం చెందించడం ద్వారా కూడా ఉత్పత్తి చెయ్యవచ్చును. తరచుగా బేరియం లవణాలను వియోగం చెందించడం వలన ఉత్పత్తి చెయ్యుదురు:[3] 2Ba + O2 → 2BaO

BaCO3 → BaO + CO2

ఉపయోగాలు

[మార్చు]

బేరియం ఆక్సైడ్‌ను కేథోడ్ కిరణ నాళిక (cathode ray tubes) వంటి పరికరాలలో వేడి కేథోడుకు పూతగా ఉపయోగిస్తారు.ఆప్టికల్ క్రౌన్ గ్లాస్ (optical crown glass) వంటి గాజు వస్తువులలో లెడ్ (II) ఆక్సైడ్ కు ప్రత్నామ్యాయంగా ఉపయోగిస్తారు[4]. బేరియం ఆక్సైడ్ ను ఇథైలిన్, ఆల్కహాల్ లరసాయన చర్యలో ఎథొక్సాలెసన్ (ethoxylation ) ఉత్పేరకంగా ఉపయోగిస్తారు. ఈ రసాయన చర్య 150-200°Cమధ్య జరుగును.[5]

శుద్ధమైన ఆక్సిజన్ ఉత్పత్తికి బేరియం ఆక్సైడ్ నువనరుగా ఉపయోగిస్తారు.బేరియం ఆక్సైడ్ సమ్మేళనం BaO1+xగా ఆక్సీకరణ చెందటం వలన పెరాక్సైడ్ అయాన్ ఏర్పడును.ఒక మోస్తరు/తగుమాత్రం ఉషోగ్రత వద్ద బేరియం ఆక్సైడ్, పెరాక్సిడేసన్ వలన బేరియం పెరాక్సైడ్ (Bao2) గా ఏర్పడును.1175K[6] వద్ద ఈ పెరాక్సైడ్ ఆక్సిజన్ (O2, బేరియం ఆక్సైడ్ గా వియోగం చెందును.

రక్షణ ,ఆరోగ్యపరమైన విషయాలు

[మార్చు]

బేరియం ఆక్సైడ్ ఇరిటె సన్ కల్గించు పదార్థం.కళ్ళను, లేదా చర్మాన్ని తాకినప్పుడు లేదా పీల్చినపుడు నొప్పి కలగడం, ఎరుపెక్కడం జరుగును.అన్నకోశం చేరిన మరింత ప్రమాదకరం. దీని వలన వాంతులు, డోకులు, విరేచనాలు, కండరాల పక్షవాతం, హృదయానికి సంబంధించిన ఇబ్బందులు కలిగి, మరణం సంభవించే అవకాశం ఉంది. అందు వలన పొరపాటున తినిన వెంటనే వైద్య చికిత్స అందించ వలెను.

బేరియం ఆక్సైడ్ ను వాతావరణంలో విడుదల చెయ్యరాదు.అలాచేయ్యడం వలన జలసంబంధమైన, జలచరమైనమరియు సూక్ష్మసంయోగాలు, సూక్ష్మజీవులఉనికికి ప్రమాదం.[7]

ఇవికూడా చూడండి

[మార్చు]

బేరియం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.
  2. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
  3. "Compounds of barium: barium (II) oxide". Web Elements. The University of Sheffield. 2007-01-26. Retrieved 2007-02-22.
  4. "Barium Oxide (chemical compound)". Encyclopædia Britanica. Encyclopædia Britanica. 2007. Retrieved 2007-02-19.
  5. Nield, Gerald; Washecheck, Paul; Yang, Kang (1979-05-04). "United States Patent 4210764". Retrieved 2007-02-20.
  6. S.C. Middleburgh, K.P.D. Lagerlof, R.W. Grimes - Accommodation of Excess Oxygen in Group II Oxides http://onlinelibrary.wiley.com/doi/10.1111/j.1551-2916.2012.05452.x/pdf
  7. "Barium Oxide (ICSC)". IPCS. October 1999. Archived from the original on 26 ఫిబ్రవరి 2007. Retrieved 2007-02-19.

ఇతర లింకులు

[మార్చు]