29వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన
Jump to navigation
Jump to search
29వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన 18 డిసెంబర్ 2015 నుంచి 27 డిసెంబర్ 2015 వరకు నిర్వహించారు.[1]
నిర్వహణ
[మార్చు]29వ జాతీయ పుస్తక ప్రదర్శన 18 డిసెంబర్ 2015 నుంచి 27 డిసెంబర్ 2015 వరకు మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.00 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, పేరు పెట్టారు. వేదికకు ప్రజాకవి సుద్దాల హనుమంతు వేదికగా నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బుక్‌ఫెయిర్ నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా కేటాయించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Telugu Books (2015). "29th Hyderabad Book Fair". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
- ↑ Telangana (6 June 2016). "పుస్తక ప్రియుల జాతర". Retrieved 27 December 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)