Jump to content

2025 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్‌లో 2025 ఎన్నికలలో రాష్ట్రంలోని శాసనమండలి, పంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలకు జరగవలసిన ఎన్నికల వివరాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి.

ఫిబ్రవరి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉభయగోదావరి జిల్లాలు & కృష్ణా, గుంటూరు స్థానాలకు, ఉపాధ్యాయ నియోజకవర్గం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గ స్థానానికి ఫిబ్రవరి 3న ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.[1] ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది.[2][3]

ఈవెంట్ తేదీ
నోటిఫికేషన్ తేదీ 2025 ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 2025 ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన తేదీ 2025 ఫిబ్రవరి 11
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 2025 ఫిబ్రవరి 13
ఎన్నికల తేదీ 2025 ఫిబ్రవరి 27
ఓట్ల లెక్కింపు తేదీ 2025 మార్చి 3
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ 2025 మార్చి 8

ఎన్నికైన అభ్యర్థులు

[మార్చు]
పేరు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు గమనికలు
గాదె శ్రీనివాసులు నాయుడు పీఆర్‌టీయూ 2025 మార్చి 30 2031 మార్చి 29 రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
పేరాబత్తుల రాజశేఖరం టీడీపీ 2025 మార్చి 30 2031 మార్చి 29 తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ 2025 మార్చి 30 2031 మార్చి 29 రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక

మార్చి

[మార్చు]

రాష్ట్రంలోని 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఫిబ్రవరి 24న ప్రకటించింది.[4] ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.[5][6]

ఈవెంట్ తేదీ
నోటిఫికేషన్ తేదీ 2025 మార్చి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 2025 మార్చి 10
నామినేషన్ల పరిశీలన తేదీ 2025 మార్చి 11
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 2025 మార్చి 13
ఎన్నికల తేదీ 2025 మార్చి 20
ఓట్ల లెక్కింపు తేదీ 2025 మార్చి 20
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ 2025 మార్చి 24

ఈ ఎన్నికలలో 5 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఐదుగురు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనిత రాణి ప్రకటించింది.[7]

ఎన్నికైన అభ్యర్థులు

[మార్చు]
పేరు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు గమనికలు
బెందుల తిరుమల నాయుడు టీడీపీ 2025 మార్చి 30 2031 మార్చి 29 రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
బీద రవిచంద్ర యాదవ్ టీడీపీ 2025 మార్చి 30 2031 మార్చి 29 రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
కావలి గ్రీష్మ టీడీపీ 2025 మార్చి 30 2031 మార్చి 29 తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
కొణిదెల నాగేంద్రబాబు జేఎన్‌పీ 2025 మార్చి 30 2031 మార్చి 29 తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
సోము వీర్రాజు బీజేపీ 2025 మార్చి 30 2031 మార్చి 29 రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక

మూలాలు

[మార్చు]
  1. "ఓటెత్తిన పట్టభద్రులు". Eenadu. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
  2. "తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల". Eenadu. 29 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  3. "ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 27న". Eenadu. 31 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 25 February 2025.
  4. "తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌". Eenadu. 24 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  5. "మండలి.. మరో నగారా". Eenadu. 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  6. "5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!". 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
  7. "ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.