2023 విజయనగరం రైలు ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయనగరం రైలు ప్రమాదం
వివరాలు
తేదీ29 అక్టోబరు 2023 (2023-10-29)
7PM
స్థానంకంటకాపల్లి-అలమండ
దేశంభారతదేశం
గణాంకాలు
రైళ్ళు3,
* విశాఖపట్టణం-పలాస రైలు(08532),
* విశాఖ-రాయగఢ రైలు(08504),
* గూడ్స్ రైలు
మరణాలు14
గాయపడినవారు54

విజయనగరం రైలు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో కంటకాపల్లి-అలమండల మధ్య 2023 అక్టోబరు 29న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది.[1] ఈ దుర్ఘటనలో రాయగడ రైలు మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి. దీంతో, రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ  ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 54 మందికి గాయాల అయ్యాయని అధికారులు ప్రకటించారు.[2] రెస్క్యూ టీంలు సహాయక చర్యలు, రైల్వే శాఖ రాకపోకల పునరుద్ధరణ పనులు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ, విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

పలు రైళ్లు రద్దు

[మార్చు]
  • కోర్బా - విశాఖపట్నం (18517) ఎక్స్‌ప్రెస్‌
  • పారాదీప్ - విశాఖపట్నం (22809) ఎక్స్‌ప్రెస్‌
  • రాయగడ - విశాఖపట్నం (08503)ప్యాసింజర్ స్పెషల్
  • పలాస - విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్
  • విశాఖపట్నం - గునుపుర్ (08522)ప్యాసింజర్ స్పెషల్
  • గునూపుర్ - విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్
  • విజయనగరం - విశాఖపట్నం (07469) మెము స్పెషల్
  • విజయవాడ - విశాఖపట్నం (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌
  • విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌
  • గుంటూరు - విశాఖపట్నం (12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌
  • కాకినాడ - విశాఖపట్నం (17267) మెము ఎక్స్‌ప్రెస్‌
  • విశాఖపట్నం - కాకినాడ (17268) మెము ఎక్స్‌ప్రెస్‌
  • రాజమండ్రి- విశాఖపట్నం (07466) మెము స్పెషల్
  • విశాఖపట్నం - రాజమండ్రీ (07467) మెము స్పెషల్
  • కోరాపుట్ - విశాఖపట్నం (08545) స్పెషల్
  • విశాఖపట్నం - కోరాపుట్ (08546) స్పెషల్
  • పలాస - విశాఖపట్నం (08531) స్పెషల్
  • చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్‌
  • రాయగడ - గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్‌

పలు రైళ్లు మళ్లింపు

[మార్చు]
  • చెన్నై-సంత్రగచి(22808) ఎక్స్‌ప్రెస్‌
  • హైదరాబాద్‌-షాలిమర్‌(18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌
  • త్రివేండ్రం-షాలిమర్‌(22641) ఎక్స్‌ప్రెస్‌
  • ఆగర్తల-బెంగళూరు(12504)ఎక్స్‌ప్రెస్‌
  • సంత్రగచీ-తిరుపతి(22855)ఎక్స్‌ప్రెస్‌
  • షాలీమర్‌-చెన్నై(12841) కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌
  • ధన్‌బాద్‌-అలెప్పీ(13351) బొకరో ఎక్స్‌ప్రెస్‌
  • హతియా-బెంగళూరు(12835)ఎక్స్‌ప్రెస్‌
  • మంగళూరు-సంత్రగాచీ(22852) ఎక్స్‌ప్రెస్‌
  • బెంగళూరు-హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్‌
  • బెంగళూరు-జశిద్ది(22305) ఎక్స్‌ప్రెస్‌
  • కన్యాకుమారి-హౌరా(22503) ఎక్స్‌ప్రెస్‌
  • చెన్నై-హౌరా(12840) ఎక్స్‌ప్రెస్‌
  • వాస్కోడిగామా-షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌

పరిహారం

[మార్చు]

ఘోర రైలు ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసాడు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించాడు.[3]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించాడు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "విజయనగరం రైలు ప్రమాదం.. అప్‌డేట్స్‌ | Andhra Train Accident: Vizianagaram Collision Rescue, Relief Operations Live Updates - Sakshi". web.archive.org. 2023-10-30. Archived from the original on 2023-10-30. Retrieved 2023-10-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Vizianagaram: ఘోర రైలు ప్రమాదం.. మృతుల వివరాలివీ.. | train accident deaths". web.archive.org. 2023-10-30. Archived from the original on 2023-10-30. Retrieved 2023-10-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "Vizianagaram-Train Accident: రైలు పట్టాలపై ఘోరం |". web.archive.org. 2023-10-30. Archived from the original on 2023-10-30. Retrieved 2023-10-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)