Jump to content

2023 నగోర్నో-కరాబాఖ్ ఘర్షణలు

వికీపీడియా నుండి
2023 నాగోర్నో-కారాబాఖ్ ఘర్షణలు
నాగోర్నో-కారాబాఖ్ వివాదంలో భాగము

2020లో నాగోర్నో-కారాబాఖ్‌లో సైనిక పరిస్థితి

     రెండవ నాగోర్నో-కారాబాఖ్ యుద్ధంలో అజర్‌బైజాన్ స్వాధీనం చేసుకున్న ప్రదేశాలు      2020 నాగోర్నో-కారాబాఖ్ యుద్ధవిరమణ ఒప్పందంలో భాగంగా అజర్‌బైజాన్‌కి అప్పగించిన ప్రదేశాలు      వివాదం ప్రారంభంలో నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతంలో ఆర్ట్‌సాఖ్ అధీనంలో ఉన్న ప్రదేశాలు

     రష్యన్ శాంతిదళాలు కాపలాలోని లకెన్ కారిడార్, దాడివాంక్ మఠం
తేదీ19–20 సెప్టెంబరు 2023 (2023-09-19 – 2023-09-20)
ప్రదేశంనాగోర్నో-కారాబాఖ్
ఫలితంఅజర్‌బైజానీ విజయం
  • ఆర్ట్‌సాఖ్ డిఫెన్స్ ఆర్మీ విచ్ఛిన్నం[1]
  • 2023 సెప్టెంబరు 21 నాటికి ఆర్ట్‌సాఖ్, అజర్‌బైజాన్ మధ్య పునర్ ఏకీకరణపై చర్చలు[2]
రాజ్యసంబంధమైన
మార్పులు
అజర్‌బైజాన్ ప్రకారం: 90 పోరాట స్థానాలు అజర్‌బైజాన్ స్వాధీనం చేసుకుంది.[3]
ప్రత్యర్థులు
 Azerbaijanమూస:Country data Artsakh
సేనాపతులు, నాయకులు
పాల్గొన్న దళాలు
మూస:Country data Republic of Artsakh
ప్రాణ నష్టం, నష్టాలు
తెలియదుPer Artsakh:[4]
  • 190+ సైనికుల మరణం
  • 360+ సైనికులకు గాయాలు
అజర్‌బైజాన్ ప్రకారం:[5][6]
1 అజార్‌బైజానీ పౌరుని మృతి
1 అజార్‌బైజానీ పౌరునికి గాయాలు Per Artsakh:[4]
10 మంది అర్మేనియన్ పౌరుల మృతి
40 మంది అర్మేనియన్ సైనికులకు గాయాలు

2023 సెప్టెంబరు 19 నుంచి 20 మధ్య, అజర్‌బైజాన్ తన నుంచి విడిపోయినట్టు ప్రకటించుకున్న రాష్ట్రమైన ఆర్ట్‌సాఖ్‌పై సైనిక దాడిని ప్రారంభించింది. అజర్‌బైజాన్‌లో భాగంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఆర్మేనియన్లు నివసించే వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరాబాఖ్‌లో ఈ దాడి జరిగింది.[7][8] రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్‌సాఖ్‌పై అజర్‌బైజాన్ దిగ్బంధం విధించి, తద్వారా ఏర్పడిన తీవ్ర సంక్షోభం మధ్య ఈ దాడులు చేసింది. దీని ఫలితంగా ప్రభావిత ప్రాంతంలో ఆహారం, ఔషధాలు, ఇతర వస్తువుల వంటి ప్రాణావసర వస్తువుల కొరత ఏర్పడింది.[9]

సెప్టెంబర్ 20న అంటే దాడి ప్రారంభించిన ఒక రోజు తర్వాత నాగోర్నో-కరాబాఖ్‌లోని రష్యా శాంతి దళం మధ్యవర్తిత్వంతో నాగోర్నో-కరాబాఖ్‌లో ఘర్షణలు పూర్తిగా నిలిపివేసే ఒప్పందం కుదిరినట్లు నాగోర్నో-కరాబాఖ్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.[10] సెప్టెంబరు 21న అజర్‌బైజాన్ యెవ్లాఖ్‌ నగరంలో ఆర్ట్‌సాఖ్ అర్మేనియన్ కమ్యూనిటీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాతి నెల తదుపరి సమావేశం నిర్వహించనున్నట్టు నిర్ణయించారు.[11][12]

నేపథ్యం

[మార్చు]

నాగోర్నో-కరాబాఖ్ వివాదం అనేది ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై పట్టు గురించి జాతి, ప్రాదేశిక అంశాల చుట్టూ తిరిగే సంఘర్షణ. ఇందులో ఎక్కువగా ఆర్మేనియన్ జాతీయులు (దేశస్థులు కాదు) నివసిస్తున్నారు. నగోర్నో-కరాబాఖ్ ప్రాంతం తమదేనని అజర్‌బైజాన్ నుంచి విడిపోయిన రిపబ్లిక్ ఆఫ్ ఆర్ట్‌సాఖ్చే వాదిస్తోంది. అంతేగాక పాక్షికంగా దాని వాస్తవ నియంత్రణలో ఉంది. అయితే అంతర్జాతీయంగా మాత్రం ఈ ప్రాంతం అజర్‌బైజాన్‌లో భాగమని గుర్తింపు ఉంది. వాస్తవంగా అజర్‌బైజాన్ నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలో మూడింట ఒక వంతు ప్రాంతాన్ని, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ఏడు జిల్లాలను నియంత్రిస్తుంది.

సోవియట్ యూనియన్ విడిపోక ముందు ఈ దేశాలన్నీ అందులో భాగంగా ఉండేవి. అప్పట్లో కరాబాఖ్ ప్రాంతం సోవియట్ యూనియన్‌లోని రిపబ్లిక్ అయిన సోవియట్ అజర్‌బైజాన్‌లో భాగంగా ఉండేది. 1988లో అర్మేనియన్లు ఈ ప్రాంతాన్ని సోవియట్ అజర్‌బైజాన్ నుండి సోవియట్ ఆర్మేనియా రిపబ్లిక్‌కి బదిలీ చేయాలని డిమాండ్ చేయడం, మొదటి నాగోర్నో-కరాబఖ్ యుద్ధానికి దారితీసింది. 1988లో ప్రారంభమైన ఈ యుద్ధం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై అజర్‌బైజాన్, అర్మేనియాలు స్వతంత్ర దేశాలయ్యాకా కూడా కొనసాగింది. అజర్‌బైజాన్‌కు టర్కీ సాయం అందించగా, కారాబాఖ్ అర్మేనియన్లకు అర్మేనియా మద్దతునిచ్చింది. ఈ యుద్ధం 1994లో అర్మేనియన్ విజయంతో ముగిసింది. తద్వారా ఆర్ట్‌సాఖ్ రిపబ్లిక్ ఏర్పడింది, ఈ ప్రాంతం అర్మేనియా అధీనంలోకి వచ్చింది. 2020 చివరలో, పెద్ద-స్థాయిలో రెండవ నాగోర్నో-కరాబఖ్ యుద్ధం ప్రారంభమై వేలాది మంది ప్రాణనష్టాన్ని కలిగించింది. చివరకు ప్రధానంగా అజర్‌బైజాన్ విజయానికి దారితీసింది. నవంబర్ 10న త్రైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా యుద్ధ విరమణ ఏర్పడింది, దీని ఫలితంగా అర్మేనియా, ఆర్ట్‌సాఖ్ నాగోర్నో-కరాబాఖ్ పరిసర ప్రాంతాలను అలాగే నాగోర్నో-కరాబాఖ్‌లో మూడింట ఒక వంతును కోల్పోయాయి.[13] 2020 యుద్ధం తర్వాత నాగోర్నో-కరాబాఖ్, అర్మేనియన్-అజర్‌బైజానీ సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనలు అడపాదడపా ప్రాణనష్టంతో కొనసాగుతున్నాయి.

2020 యుద్ధం నుండి, అజర్‌బైజాన్ తన స్వదేశీ అర్మేనియన్ నివాసితులకు ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. బదులుగా అజర్‌బైజాన్‌లో వారు "సమైక్యం" కావాలని పట్టుబట్టింది.[14][15] అంతర్జాతీయ మధ్యవర్తులు, మానవ హక్కుల సంస్థలు స్థానిక అర్మేనియన్ జనాభాకు స్వయం నిర్ణయాధికారాన్ని నొక్కిచెప్పాయి. [16] [17] అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియేవ్ వంశపారపంర్య, నియంతృత్వ పాలనలో [18][19] ఆర్ట్సాఖ్ అర్మేనియన్లు సురక్షితంగా జీవించగలరని విశ్వసించలేదు. [20][21]

  1. "Armenian separatists in Karabakh surrender and agree to ceasefire with Azerbaijan". Reuters. 20 September 2023. Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023. Under the agreement, confirmed by both sides and effective from 1 pm (0900 GMT) on Wednesday, separatist forces will disband and disarm and talks on the future of the region and the ethnic Armenians who live there will start on Thursday.
  2. "Karabakh Separatists To Hold Integration Talks With Azerbaijan Thursday". Barron's. 20 September 2023. Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
  3. Mehman, Asif (20 September 2023). "More than 90 combat positions of Armenian armed forces units come under control of Azerbaijani Army". Trend News Agency. Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
  4. 4.0 4.1 "Արցախում առնվազն 200 զոհ կա, ավելի քան 400 վիրավոր. ՄԻՊ". azatutyun.am. 20 September 2023. Archived from the original on 21 September 2023. Retrieved 20 September 2023.
  5. "Ermənistan silahlı qüvvələrinin Şuşaya atəşi nəticəsində Şuşa Şəhəri Dövlət Qoruğunun mühənidisi həlak olub" (in అజర్బైజాని). Trend News Agency. 19 September 2023. Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
  6. "Shelling-injured digger driver in Azerbaijan's Aghdam by separatists, details incident". Trend News Agency (in ఇంగ్లీష్). 20 September 2023. Archived from the original on 20 September 2023. Retrieved 21 September 2023.
  7. "Azerbaijani forces strike Armenian-controlled Karabakh, raising risk of new Caucasus war". Reuters. 19 September 2023. Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
  8. Ilyushina, Mary (19 September 2023). "Fighting flares between Azerbaijan and Armenia in Nagorno-Karabakh". The Washington Post. Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023. Azerbaijan and Armenia have repeatedly clashed over Nagorno-Karabakh, which is internationally recognized as part of Azerbaijan but largely populated by ethnic Armenians and largely governed by the unrecognized Republic of Artsakh.
  9. Roth, Andrew (19 September 2023). "Azerbaijan launches 'anti-terrorist' campaign in disputed Nagorno-Karabakh region". The Guardian. Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
  10. "Russian-mediated ceasefire announced in Nagorno-Karabakh". Armenpress.
  11. "Ethnic Armenians accept Russia ceasefire plan after Azerbaijan offensive in Nagorno-Karabakh". CNN (in ఇంగ్లీష్). 20 September 2023. Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
  12. "BREAKING: Stepanakert to disband army in ceasefire deal". CIVILNET. 20 September 2023. Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
  13. "Armenia and Azerbaijan: A blockade that never ended and a peace deal hanging by a thread". Global Voices (in ఇంగ్లీష్). 2023-07-19. Archived from the original on 27 July 2023. Retrieved 2023-07-24.
  14. Isayev, Heydar (April 20, 2022). "Azerbaijan quiet as Karabakh negotiations progress". eurasianet.org (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2023. Retrieved 2023-01-02.
  15. Vock, Ido (2023-06-08). "Fear and loathing in Armenia". New Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 8 June 2023. Retrieved 2023-06-09. President Aliyev told Nagorno-Karabakh Armenians to 'obey the laws of Azerbaijan [and] be a loyal and normal citizen of Azerbaijan'. He threatened that if the territory's separatist institutions were not dissolved, Azerbaijan would dissolve them by force and rejected the prospect of international protections for ethnic Armenians.
  16. "A Peace to End All Peace? Statement on the International Actors Sponsoring So-Called Peace Negotiations Between Armenia and Azerbaijan". The Lemkin Institute for Genocide Prevention. 2023-05-30. Archived from the original on 31 May 2023. Retrieved 19 September 2023.
  17. "Kennan Cable No. 81: What's at Stake in Nagorno-Karabakh: U.S. Interests and the Risk of Ethnic Cleansing". wilsoncenter.org (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-04. Retrieved 2023-04-04. For nearly 30 years, they built a self-proclaimed independent republic with democratic elections, a free press, and a range of public institutions. Officially, it remained within the territorial boundaries of Azerbaijan, unrecognized by any foreign country, though international mediators made reference to the right of self-determination for local Armenians as part of ongoing peace talks.
  18. "Azerbaijan: Country Profile". Freedom House (in ఇంగ్లీష్). 2023-09-11. Archived from the original on 23 January 2012. Retrieved 2023-09-20.
  19. "Human rights in Azerbaijan". Amnesty International (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2023. Retrieved 2023-09-20.
  20. Hauer, Neil (2023-07-31). "Karabakh blockade reaches critical point as food supplies run low". www.intellinews.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 August 2023. Retrieved 2023-08-01. With Azerbaijan now starving the 120,000 people it claims are its citizens, many observers now agree that the idea that Karabakh Armenians can live safely in Ilham Aliyev's Azerbaijan is hardly credible.
  21. Boy, Ann-Dorit (18 January 2023). "Blockade in the Southern Caucasus: "There Is Every Reason to Expect More Violence This Year"". Der Spiegel (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2023. Retrieved 19 January 2023.