2022 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నిక
| |||||||
|
నేపథ్యం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో మరణించడంతో ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.[1] భారత ఎన్నికల సంఘం 2022 మే 25న ఆత్మకూరు ఉప ఎన్నిక తోపాటు మరో ఆరు శాసనసభ నియోజకవర్గాలకు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. [2][3]
షెడ్యూలు
[మార్చు]2022 మే 30న ఉప ఎన్నిక షెడ్యూల్ తో పాటు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది.[4]
ఎన్నికల ఈవెంట్ | షెడ్యూల్ | రోజు. |
---|---|---|
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ | 30 మే 2022 | సోమవారం |
నామినేషన్ల దాఖలు చివరి తేదీ | 6 జూన్ 2022 | సోమవారం |
నామినేషన్ల పరిశీలన తేదీ | 7 జూన్ 2022 | మంగళవారం |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 9 జూన్ 2022 | గురువారం |
పోలింగ్ తేదీ | 23 జూన్ 2022 | గురువారం |
లెక్కింపు తేదీ | 26 జూన్ 2022 | ఆదివారం |
ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే తేదీ | 28 జూన్ 2022 | మంగళవారం |
అభ్యర్థులు
[మార్చు]ఉప ఎన్నికలలో మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.[5][6] ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా భరత్ కుమార్ ను నిలబెట్టింది.[7] రిటర్నింగ్ ఆఫీసర్ 13 నామినేషన్లు తిరస్కరించారు. తరువాత మొత్తం 15 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.[8]
ఫలితాలు
[మార్చు]2022 జూన్ 22న ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు చేపట్టింది అదే రోజు ఫలితాలను విడుదల చేసింది.. 82, 888 ఓట్ల మెజార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Andhra minister Mekapati Goutham Reddy dies at 50 after cardiac arrest". The News Minute (in ఇంగ్లీష్). 2022-02-21. Retrieved 2022-05-26.
- ↑ "Andhra News: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల". EENADU. Retrieved 2022-05-26.
- ↑ "Schedule for Bye-election in Parliamentary/Assembly Constituencies of various States". 25 May 2022.
- ↑ MUKESH KUMAR, MEENA (30 May 2022). "The Andhra Pradesh Gazette" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. Retrieved 31 May 2022.
- ↑ sumanth.k. "Andhra News: మేకపాటి కుటుంబం కీలక నిర్ణయం.. గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్ రెడ్డి". Asianet News Network Pvt Ltd. Retrieved 2022-05-26.
- ↑ Bandari, Pavan Kumar (2022-04-29). "Mekapati Goutham Reddy's brother Vikram Reddy meets YS Jagan, likely to contest from Atmakur by-election". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-26.
- ↑ Murali, S. (2022-06-07). "Andhra Pradesh: 15 candidates in fray for Atmakur bypoll". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-06-08.
- ↑ "Returning Officer rejects 13 nominations for Atmakur bypoll". The New Indian Express. Retrieved 2022-06-08.
- ↑ "Andhra bypoll: Construction magnate Mekapati Vikram Reddy retains Atmakur for YSRCP". The Indian Express (in ఇంగ్లీష్). 2022-06-26. Retrieved 2022-06-26.
- ↑ "Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం". EENADU. Retrieved 2022-06-26.