Jump to content

2016 మథుర లో ఘర్షణ

వికీపీడియా నుండి
జిల్లా (లు) మథుర జిల్లా
వెబ్‌సైటు: mathura.nic.in/

మథురలో ఘర్షణ భారతదేశంలోని మథుర నగరంలో భూకబ్జా చేసిన రాంవృక్ష్‌యాదవ్ అనుచరులకు, కోర్టు ఆదేశంతో ఆ ప్రదేశాన్ని ఖాళీచేయించ తలపెట్టిన పోలీసులకు మధ్య 2016 జూన్ 2 న జరిగిన ఘర్షణ. ఈ ఘర్షణ మథురలోని జవహర్‌ పార్కులో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరు పోలీసులు, 22 మంది భూకబ్జాదారులు మరణించారు.

నేపథ్యం

[మార్చు]
2016 మథుర ఘర్షణ
Date2 June 2016
Timeసాయంత్రం 5 గంటలకు
Venueజవహర్ బాగ్
Locationమథుర, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
Typeసాయుధ తిరుగుబాటు, అల్లర్లు
Deaths24 ( ఇద్దరు పోలీసులతో సహా)

స్థానికంగా వున్న జవహార్ పార్కుని కబ్జా చేసిన కొంతమంది వ్యక్తులు స్వాధీన్ భారత్ సుభాష్ సేన పేరిట ఓ సంస్థగా ఏర్పడ్డారు. అంతకు రెండున్నరేళ్లు ముందు నుండి పార్కుని కబ్జా చేసి అందులోనే నివాసం వుంటున్న సదరు కుటుంబాలు, ఆ పార్కు స్థలాన్ని శాశ్వతంగా తమకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటీషన్‌ని కొట్టివేసిన కోర్టు పార్కు స్థలాన్ని ఖాళీ చేయించి ఆక్రమణల నుంచి పార్కు స్థలాన్ని కాపాడాల్సిందిగా సంబంధింత యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల అనంతరం 2016 జూన్ 2 సాయంత్రం 4 గంటలకు భారీ సంఖ్యలో పార్కు వద్దకు చేరుకున్న పోలీసులు పార్కుని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆక్రమణదారులకు విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసుల రంగ ప్రవేశంతో ఆగ్రహం చెందిన ఆక్రమణదారులు కొంతమంది వారిపైకి కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా హింసకు దిగుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడంతోపాటు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలోనే అల్లరి పెద్దదయింది. ఆందోళనకారులు జరిపిన కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన మధుర జిల్లా అర్బన్ ఎస్పీ ముకుల్ ద్వివేదీ, ఫరా పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ లు మృతిచెందారు.[1]

సమాంతర ప్రభుత్వ నిర్వహణ

[మార్చు]

ఈ భూకబ్జాదారులకు నాయకత్వం వహిస్తున్న రామ్‌వృక్ష్‌యాదవ్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన జై గురుదేవ్ అనుచరుడు. ఆయన 2014 నుండి మథుర నగరంలోని జవహర్ పార్కును కబ్జా చేసాడు. ఆయన ఘజియాబాదుకు సమీపంలోని రాయ్‌పుర్ గ్రామానికి చెందినవాడు. ఆయన ఆ ప్రదేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయన స్వాధీనంలో ఉన్న పార్కులో స్వంత ప్రభుత్వ నిర్వహణ, రెవెన్యూ వసూళ్ళు చేస్తూ సైనిక దళాలను కూడా నిర్వహిస్తున్నాడు.[2]

ఘర్షణ

[మార్చు]

280 ఎకరాల జవహర్ బాగ్ పార్కు ఆక్రమణదారులను అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు వెళ్లిన పోలీసులతో సుమారు 3 వేల మంది స్థానికులు మారణాయుధాలతో దాడి చేయడం, ఆ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఎస్పీతో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుదేహాల గుర్తింపును వెంటనే చేపట్టిన పోలీసులు 11 మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపించారు. ఈ పరీక్షల్లో దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రామ్ వ్రిక్ష యాదవ్‌ ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని యూపీ డీజీపీ జావెద్ అహ్మద్ ధ్రువీకరించారు. ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి పేరుతో బాబా జైగురుదేవ్ అనుచరులుగా ప్రచారం చేసుకున్న సాయుధులు ఈ దాడులకు పాల్పడినట్టు ప్రకటించుకున్నారు. దీనికి రామ్ వ్రిక్ష్ యాదవ్ సారథ్యం వహించారు.[3]

సూత్రధారి

[మార్చు]

దీని వెనుక ఉన్నది అంతకు నాలుగేళ్ల ముందు కాల ధర్మం చెందిన జై గురుదేవ్ బాబా శిష్యులేనని తెలిసింది. గురువు గారు నూట పదహారు ఏళ్ళ వయసులో నాలుగు వేల కోట్ల ఆస్తి వదిలి వెళ్ళారు. స్వామీజీకి చెందిన పార్టీ జవహర్ బాగ్ అడ్డాగా చేసుకొని, పలు రకాల వ్యాపారాలు నిర్వహించ సాగింది. జరుగుతున్న అల్లర్లకి సూత్రధారి అజాత్ భారత్ పార్టీ నాయకుడు రామ్ వృక్ష యాదవ్ గా గుర్తించారు. ఈ వయో వృద్ధుని ఆధ్వర్యంలో గుట్టలు గుట్టలుగా ఆయుధాలు తూటాలు దొరికాయి.[4] ఆయన ఈ సంఘటనలో సజీవ దహనమయ్యాడు.

పోలీసు అధికారుల మృతి

[మార్చు]

ఉత్తరప్రదేశ్ లోని మధుర లో పోలీసులకు, పార్క్ ఆక్రమించుకున్నవారికి మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తమైంది. ఈ ఘటనలో 24మంది చనిపోయారు. మృతుల్లో మధుర ఎస్పీ ముఖుల్‌ ద్వివే, పోలీస్‌ అధికారి సంతోష్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.[5]

తదనంతర పరిణామాలు

[మార్చు]

ఈ ఉదంతంలో పోలీసులు 47 తుపాకులను, 6 రైఫిళ్ళను, 179 హాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 2 2016 న 368 మందిని అరెస్టు చేసారు. వారిలో 120 మందిని అల్లర్లు సృష్టిస్తున్నందున అరెస్టు చేసారు. 196 మందిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్టు చేసారు. వారిలో 116 మంది మహిళలు.[6] ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన పోలీసులకు ఒక్కొక్కరికి 20 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. ఆక్రమణదారుల కాల్పుల్లో జిల్లా ఎస్పీ సహా 14 మంది మృతి[permanent dead link]
  2. "मथुरा : रामवृक्ष यादव ने जमा किए थे UP पुलिस के हथियार, मकसद था पुलिस को जिम्मेदार ठहराना". Archived from the original on 4 జూన్ 2016. Retrieved 4 June 2016.
  3. "మధుర అల్లర్ల ప్రధాన నిందితుడు మృతి 04-06-2016". Archived from the original on 2016-06-07. Retrieved 2016-06-05.
  4. సూత్రధారి విష వృక్ష యాదవ్..[permanent dead link]
  5. "మధుర రక్తసిక్తం..ఎస్పీ సహా 24మంది మృతి 08:48 PM on 03rd June, 2016". Archived from the original on 2016-06-05. Retrieved 2016-06-05.
  6. "Mathura clashes: 24 killed, 368 arrested in violence". DNA. 3 June 2016.
  7. Shailaja Neelakantan (3 June 2016). "Mathura violence death toll now 24, opposition blames Akhilesh govt". The Times of India.

ఇతర లింకులు

[మార్చు]