2016 ఆసియా కప్
2016 మైక్రోమ్యాక్స్ ఆసియా కప్ టి20 | |
---|---|
తేదీలు | ఫిబ్రవరి 24 – మార్చి 6 |
నిర్వాహకులు | ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | ట్వంటీ20 |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | Bangladesh |
ఛాంపియన్లు | భారతదేశం (6th title) |
పాల్గొన్నవారు | 5 |
ఆడిన మ్యాచ్‌లు | 11 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | సబ్బీర్ రహమాన్ |
అత్యధిక పరుగులు | సబ్బీర్ రహమాన్ (176) |
అత్యధిక వికెట్లు | అల్ అమీన్ హుస్సేన్ (11) |
← 2014 2018 → |
2016 ఆసియా కప్ (మైక్రోమ్యాక్స్ ఆసియా కప్ T20 అంట్రు) ట్వంటీ 20 అంతర్జాతీయ (T20I) క్రికెట్ టోర్నమెంటు. ఇది 2016 ఫిబ్రవరి 24 నుండి మార్చి 6 వరకు బంగ్లాదేశ్‌లో జరిగింది. ఇది 13వ ఆసియా కప్ పోటీ. బంగ్లాదేశ్‌లో ఐదవది, T20I ఫార్మాట్‌లో ఆడిన మొదటిది. బంగ్లాదేశ్ 2012, 2014 ల తర్వాత వరుసగా మూడోసారి ఈ టోర్నమెంటుకు ఆతిథ్య మిచ్చింది. 2012 తర్వాత టోర్నమెంట్‌కు మైక్రోమ్యాక్స్ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. [1]
బంగ్లాదేశ్ (ఆతిథ్య), శ్రీలంక (2014 ఛాంపియన్‌లు)తో పాటు, భారతదేశం, పాకిస్తాన్, ICC అసోసియేట్ సభ్యుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. యుఎఐ జట్టు 2016 ఫిబ్రవరి 19 నుండి 22 వరకు ఆడిన క్వాలిఫైయర్ నుండి అర్హత సాధించారు [2] [3]
ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ ఆరో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. టోర్నీ అంతటా అజేయంగా నిలిచింది. [4] [5]
జట్లు
[మార్చు]- బంగ్లాదేశ్
- భారతదేశం
- పాకిస్తాన్
- శ్రీలంక
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (క్వాలిఫయరు)
జట్లు
[మార్చు]బంగ్లాదేశ్[6] (11) | భారతదేశం[7] (1) | పాకిస్తాన్[8] (8) | శ్రీలంక[9] (4) | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్[10] (20) |
---|---|---|---|---|
|
|
|
|
|
గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేక పోవడంతో మహమ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. [11] కండరాల నొప్పితో బాధపడుతున్న MS ధోనీకి బ్యాకప్‌గా పార్థివ్ పటేల్‌ను చేర్చారు. [12] 2016 పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాబర్ ఆజమ్, రుమ్మన్ రయీస్‌లకు గాయాలైన తర్వాత మహ్మద్ సమీ, షర్జీల్ ఖాన్‌లు పాకిస్తాన్ జట్టులోకి వచ్చారు. [13] [14] శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ గాయపడటంతో అతని స్థానంలో తమీమ్ ఇక్బాల్‌ని టోర్నమెంట్‌లో చేర్చారు. [15]
లసిత్ మలింగ శ్రీలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే అతను మొదటి మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. రెండవ, మూడవ మ్యాచ్‌లలో ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్‌గా వ్యవహరించగా, చివరి మ్యాచ్‌లో దినేష్ చండిమాల్ కెప్టెన్‌గా నిలిచాడు.
నేపథ్య
[మార్చు]2015 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆసియా క్రికెట్ కౌన్సిల్ పరిమాణాన్ని తగ్గించిన తర్వాత, రాబోయే ఆసియా కప్ ఈవెంట్‌లు రొటేషన్ ప్రాతిపదికన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) ఫార్మాట్‌లో జరుగుతాయని ప్రకటించారు.[16] దీనర్థం 2016, 2020 ఈవెంట్‌లు 2016, 2020 ప్రపంచ ట్వంటీ20ల కంటే ముందు T20I ఫార్మాట్‌లో జరుగుతాయి. 2018, 2022 ఈవెంట్‌లు 2019, 2023 ప్రపంచ కప్‌లకు ముందు వన్‌డే ఫార్మాట్‌లో జరుగుతాయి. [17]
వేదిక
[మార్చు]టోర్నమెంట్‌లోని మొత్తం పదకొండు మ్యాచ్‌లు ఢాకాలోని మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగాయి.
మీర్పూర్, ఢాకా |
---|
షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం |
నిర్దేశాంకాలు: 23°48′24.9″N 90°21′48.9″E / 23.806917°N 90.363583°E |
సామర్థ్యం: 25,416 |
గ్రూప్ దశ
[మార్చు]స్థానాలు
[మార్చు]స్థానం | జట్టు | ఆ | గె | ఎఓ | టై | ఫతే | పాయిం | NRR |
---|---|---|---|---|---|---|---|---|
1 | భారతదేశం | 4 | 4 | 0 | 0 | 0 | 16 | 2.020 |
2 | బంగ్లాదేశ్ | 4 | 3 | 1 | 0 | 0 | 12 | 0.458 |
3 | పాకిస్తాన్ | 4 | 2 | 2 | 0 | 0 | 8 | -0.296 |
4 | శ్రీలంక | 4 | 1 | 3 | 0 | 0 | 4 | -0.293 |
5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 4 | 0 | 4 | 0 | 0 | 0 | −1.813 |
v
|
||
- భారత్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
- వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు.
- ↑ "Micromax is title sponsors of Asia Cup 2012 | New Zealand in India 2016 News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Mar 5, 2012. Retrieved 2022-11-18.
- ↑ "Asia Cup T20 Qualifier scheduled for February". Cricinfo. Retrieved 26 December 2015.
- ↑ "Bangladesh to host third straight Asia Cup". ESPNCricinfo. Retrieved 28 October 2015.
- ↑ "Purewin Bangladesh Review | Online Casino and Betting | Login". sportsbettingbangladesh.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-11-18.
- ↑ "Dhawan, Kohli bring India sixth Asia Cup title". ESPNcricinfo. Retrieved 6 March 2016.
- ↑ "Tamim to miss Asia Cup, Kayes called up as replacement". ESPNcricinfo. Retrieved 14 February 2016.
- ↑ "Mohammed Shami back for World T20". ESPNcricinfo. Retrieved 5 February 2016.
- ↑ "Pakistan pick Manzoor, Raees for WT20". ESPNcricinfo. Retrieved 10 February 2016.
- ↑ "Malinga, Mathews back for World T20". ESPNcricinfo. Retrieved 18 February 2016.
- ↑ "United Arab Emirates Squad, Asia Cup 2016". ESPNcricinfo. Retrieved 14 February 2016.
- ↑ "Shami ruled out of Asia Cup". ESPNcricinfo. 19 February 2016. Retrieved 19 February 2016.
- ↑ "Parthiv to join squad as back-up for Dhoni". ESPNcricinfo. 22 February 2016. Retrieved 22 February 2016.
- ↑ "Sharjeel, Sami included in Pakistan's Asia Cup T20 squad". ARY News. 22 February 2016. Retrieved 22 February 2016.
- ↑ "Sami, Sharjeel in as Pakistan make changes to World T20 squad". ESPN Cricinfo. 23 February 2016. Retrieved 23 February 2016.
- ↑ "Side strain ends Mustafizur's Asia Cup". ESPN Cricinfo. 29 February 2016. Retrieved 29 February 2016.
- ↑ "Asia Cup to continue under ICC". ESPN Cricinfo. Retrieved 17 April 2015.
- ↑ "Asia Cup to switch T20 format every alternate edition". cricbuzz. Retrieved 16 April 2015.
- ↑ "2016 Asia Cup Points Table". ESPN Cricinfo. 24 February 2016. Retrieved 24 February 2016.
ఫైనల్
[మార్చు]గణాంకాలు
[మార్చు]అత్యధిక పరుగులు
[మార్చు]ఆటగాడు | ఇన్నింగ్స్ | పరుగులు | నాటౌ | సగ | SR | అత్య | 100 | 50 | 4లు | 6లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
సబ్బీర్ రెహమాన్ | 5 | 176 | 1 | 44.00 | 123.94 | 80 | 0 | 1 | 15 | 5 |
విరాట్ కోహ్లీ | 4 | 153 | 2 | 76.50 | 110.86 | 56 * | 0 | 1 | 20 | 0 |
దినేష్ చండిమాల్ | 4 | 149 | 0 | 37.25 | 109.55 | 58 | 0 | 2 | 19 | 2 |
రోహిత్ శర్మ | 5 | 138 | 0 | 27.60 | 132.69 | 83 | 0 | 1 | 17 | 4 |
తిలకరత్నే దిల్షాన్ | 4 | 132 | 1 | 44.00 | 121.10 | 75 * | 0 | 1 | 18 | 4 |
నవీకరించబడింది: 12 సెప్టెంబర్ 2022 [1] |
అత్యధిక వికెట్లు
[మార్చు]ఆటగాడు | ఇన్నింగ్స్ | వికెట్లు | ఓవర్లు | పరుగులు | ఎకాన్ . | ఏవ్ | BBI |
---|---|---|---|---|---|---|---|
అల్-అమీన్ హుస్సేన్ | 5 | 11 | 16.5 | 134 | 7.96 | 12.80 | 3/25 |
మహ్మద్ అమీర్ | 4 | 7 | 16.0 | 81 | 5.06 | 11.57 | 3/18 |
నువాన్ కులశేఖర | 4 | 7 | 15.0 | 95 | 6.33 | 13.57 | 3/10 |
హార్దిక్ పాండ్యా | 5 | 7 | 17.30 | 103 | 5.88 | 14.71 | 3/8 |
జస్ప్రీత్ బుమ్రా | 5 | 6 | 18.0 | 94 | 5.22 | 15.66 | 2/27 |
నవీకరించబడింది: 12 సెప్టెంబర్ 2022 [2] |
మూలాలు
[మార్చు]- ↑ "Men's T20 Asia Cup, 2015/16 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-09-12.
- ↑ "Men's T20 Asia Cup, 2015/16 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-09-12.