2005 బేగంపేట ఆత్మాహుతి బాంబుదాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2005 బేగంపేట ఆత్మాహుతి బాంబుదాడి, అనేది 2005లో హైదరాబాదులో జరిగిన బాంబుదాడి. బేగంపేట ప్రాంతంలోని హైదరాబాద్ సిటీ పోలీస్ కి చెందిన కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ బాంబుదాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.[1][2]

దాడి వివరాలు

[మార్చు]

2005, అక్టోబరు 12న, దాదాపు రాత్రి గం. 7.30 ని.లకు టాస్క్ ఫోర్స్ కార్యాలయం వెలుపల ఒక వ్యక్తి పేలుడు పదార్ధాలను పేల్చడంతో ఆ వ్యక్తితోపాటు 45 ఏళ్ళ హోంగార్డు ఎ. సత్యనారాయణను మరణించారు. ఆత్మాహుతి బాంబర్ బంగ్లాదేశ్ దేశానికి చెందిన డాలిన్ అలియాస్ మొహతాసిమ్ బిల్లాల్. ఇతడు నిషేధిత ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ అయిన హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (హుజీ) సంస్థకు చెందిన సభ్యుడు.[3]

దాడి జరిగిన విధానం

[మార్చు]

అడిషనల్ డిసిపి వెంకట్ రెడ్డిని కలిసేందుకు వచ్చానని చెప్సడంతో, టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద సెంట్రీగా ఉన్న వెంకట్రావు యువకుడిని డిసిపి రూం వైపు పంపించాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సత్యనారాయణ ఆ యువకుడిని అడ్డుకొని, ఈరోజు సెలవుదినం కావున అందరూ బందోబస్తులో ఉంటారని చెప్పి, యువకుడి బ్యాగులో ఏముందని నిలదీశాడు. దాంతో కంగారుపడిన యువకుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడంతో భారీ విస్ఫోటనం జరిగి, టాస్క్ ఫోర్స్ కార్యాలయం సగం దగ్ధమైంది. బ్యాగుతో వచ్చిన యువకుడి శరీర భాగాలు చెల్లాచెదురుకాగా, హోంగార్డు సత్యనారాయణ కూడా మృతి చెందాడు. సెంట్రీ డ్యూటీలో ఉన్న వెంకట్రావు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

ఇతర వివరాలు

[మార్చు]

బాంబు దాడిలో కీలక నిందితులైన గులాం యజ్దానీ 2006 మార్చి 8న,[4] షాహెద్ బిలాల్ 2007 ఆగస్టు 30న[5] మరణించారు. 2004లో గుజరాత్ పోలీసుల చేతిలో ముజాహిద్ సలీం (సిమీ సంస్థకు చెందిన మౌలానా అబ్దుల్ అలీమ్ ఇస్లామీ కుమారుడు)[6] మరణించిన దానికి ప్రతీకారంగా ఈ బాంబుదాడి జరిగిందని తేలింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Blast in police task force office; 2 killed - Rediff.com India News". In.rediff.com. 12 October 2005. Retrieved 19 February 2018.
  2. Jafri, Syed Amin (13 October 2005). "Hyderabad blast could be suicide bomb". Rediff.com. Retrieved 4 November 2018.
  3. "Hyderabad suicide bombing case: 12 years later, 10 acquitted in Hyderabad suicide bombing case". Timesofindia.indiatimes.com. Retrieved 19 February 2018.
  4. "LeT ultra involved in Varanasi blasts killed in encounter". Dnaindia.com. 8 March 2006. Retrieved 19 February 2018.
  5. "Terrorist Shahid Bilal dead: IB". Rediff.com. Retrieved 19 February 2018.
  6. "Madannapet, Saidabad: The twin trouble spots | Hyderabad News". The Times of India. 10 April 2012. Retrieved 19 February 2018.
  7. "Hyderabad: Huji suicide blast case drags on for 11 years". Deccanchronicle. Retrieved 19 February 2018.