Jump to content

1896 వేసవి ఒలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
1896 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు

ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అంతమయ్యాక చాలా కాలం తరువాత ఫ్రాన్స్కు చెందిన పియరీ డి కోబర్టీన్ కృషి వల్ల 1896లో ఒలింపిక్ క్రీడలు గ్రీసులోని ఏథెన్స్లో నిర్వహించారు. ఇదే ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ప్రారంభం. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు గుర్తుగా గ్రీసు నగరంలోనే తొలి ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం జరిగింది. 1896, ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ క్రీడలు ఘనంగా నిర్వహించారు. ఈ ఒలింపిక్ క్రీడలలో కేవలం 14 దేశాలు, 241 క్రీడాకారులు మాత్రమే పాల్గొన్ననూ ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నాంది పలికిన క్రీడలుగా వీటికి ప్రాధాన్యత ఉంది. 9 క్రీడలు, 43 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు.[1]

అత్యధిక పతకాలు సాధించిన దేశాలు

[మార్చు]

9 క్రీడలు, 43 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా అత్యధికంగా 11 స్వర్ణాలతో ప్రథమ స్థానం పొందినది. నిర్వాహక దేశమైన గ్రీసు 10 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది. వాస్తవానికి అప్పుడు ప్రథమ స్థానం పొందిన వారికి అజత పతకం, ఆలివ్ కొమ్మ, రెండో స్థానం పొందిన వారికి కాంస్యపతకం, ఆలివ్ కొమ్మ ప్రధానం చేసేవారు. ప్రస్తుత క్రీడలలో పోల్చినప్పుడు పొరపాటు రాకుండా ప్రథమ స్థానానికి స్వర్ణపతకం గానే వ్యవహరించడం జరుగుతున్నది.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 అమెరికా 11 7 2 20
2 గ్రీసు 10 17 19 46
3 జర్మనీ 6 5 2 13
4 ఫ్రాన్స్ 5 4 2 11
5 బ్రిటన్ 2 3 2 7
6 హంగేరి 2 1 3 6
7 ఆస్ట్రియా 2 1 2 5
8 ఆస్ట్రేలియా 2 0 0 2
9 డెన్మార్క్ 1 2 3 6
10 స్విట్జర్లాండ్ 1 2 0 3

నిర్వహించిన క్రీడలు

[మార్చు]

పాల్గొన్న దేశాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Athens 1896–Games of the I Olympiad". International Olympic Committee. Retrieved 2008-05-05.