Jump to content

హోళీ,పంజాబ్

వికీపీడియా నుండి
ప్రహ్లాదపురి గుడి అవశేషాలు
భారతదేశంలో రంగుల కొట్లు- 7242

హోళి పంజాబు ప్రాంతంలో ముల్తాన్ నగరంలో ప్రహ్లాదపురి ఆలయంలో ఆరంభం అయింది. [1][2] పురాతన ప్రహ్లాదపురి ఆలయాన్ని ఆరంభంలో హిరణ్యకసిపుని కుమారుడు, ముల్తాన్ (కశ్యప - పుర) రాజైన ప్రహ్లాదుడు నిర్మించాడని విశ్వసిస్తున్నారు.[3] ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నుండి వెలుపలికి వచ్చిన మహావిష్ణు అవతారం అయిన నరసింహమూర్తి మీద భక్తికి ప్రతీకగా ఈ ఆలయం నిర్మితమైనదని అభిప్రాయపడుతున్నారు.[4][5][6][7] హోళీ వసంతకాల ఆరంభానికి చిహ్నంగా ఉంది.[8][9] పంజాబీ క్యాలెండర్ అనుసరించి ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా రెండు రోజుల పాటు హోళీ పండుగ జరుపుకుంటారు.[10]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

హోళీ అనే పదానికి మూలం హోలా. హోలా అంటే పంట ఇంటికి చేరిన తరువాత ప్రజలు భగవంతుడికి కృతఙతలు చెప్పడం. [11] హోళీ అనేమాట సంస్కృతపదం హోళీకకు ప్రత్యమ్న్యాయ పదం.సంస్కృతపదానికి అర్ధం సగం కాలినది అని అర్ధం. సంగం ఉడికిన పప్పు, గోధుమనూక (హోలా) వంటివి హోళీరోజు తింటారు.[12] పంజాబు ప్రాంతంలో వైశాఖమాసంలో గోధుమపంటవేస్తారు. హోళీతరువాత రెండు మాసాలకు గోధుమపంట ఇంటికి చేరుతుంది. రాబోయే పంటకు ముందుగా కృతజ్నత చెల్లించడానికి హోళీ పండుగ జరుపుకుంటారని భావిస్తున్నారు. హోళీ అనే పదానికి హోళిక అనే పదం మూలం అని భావిస్తున్నారు. హోళిక తనసోదరుడైన హిరణ్యకశిపుని కుమారుడిని (ప్రహ్లాదుడు) తనఒడిలో కూర్చుండబెట్టుకుని దహించడానికి ప్రయత్నించి విష్ణుమాయచేత తనే అగ్నికి ఆహుతి ఔతుంది.[11]

ప్రహ్లాద- పురి ఆలయం, హోళీ దహనం

[మార్చు]
Narasimha slays Hiranyakashipu, as Prahlada watches
Narasimha kills Hiranyakashipu, as Prahlada and his mother bow before Lord Narasimha

విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మీద అతడి తండ్రి (ముల్తాన్ రాజు) అయిన హిరణ్యకశిపుడు ఆగ్రహించి పలు కఠినపరీక్షలకు గురిచేస్తాడు.[8][13] ప్రహ్లాదుడి భక్తికిమెచ్చి విష్ణుమూర్తి అతడికి అతీద్రియశక్తులు ప్రసాదిస్తాడు. హిరణ్యకశిపుడు అహంకరించి రాజ్యంలో ప్రజలు విష్ణువుకు బదులుగా తననేపూజించాలని శాసిస్తాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రం తీవ్రమైన విష్ణుభక్తుడుగా మిగిలిపోతాడు.[8] హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి విషమివ్వడం, ఏనుగులచేత తొక్కించడం, పాములచేత కరిపించడం, జైలులో బంధించడం వంటి బాధలకు గురిచేస్తాడు. ప్రహ్లాదుడు విష్ణుమహిమతో సజీవుడుగా ఉంటాడు. తరువాత హిరణ్యకశిపుడు బలవంతంగా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు హోళీక ఒడిలో కూర్చోబెడతాడు.[2] హోళిక హిరణ్యకశిపుని సహోదరి. ఆమె వద్ద మటలకు దగ్ధం కాకుండా రక్షించే ఒక మాంత్రిక శాలువా ఉంటుంది. హిరణ్యకశిపుడు ఆమెను ప్రహ్లాదుని ఒడిలో కూర్చుండబెట్టుకుని మంటలో ప్రవేశించమని ఆదేశిస్తాడు. అలా చేస్తే ప్రహ్లాదుడు మంటలలో దగ్ధం అయినా శాలువా మహిమతో హోళిక మాత్రం సురక్షితంగా ఉంటుందని భావిస్తాడు. సోదరుని ఆదేశం అనుసరించి హోళిక ప్రహ్లాదునితో అగ్నిప్రవేశం చేస్తుంది. అయినప్పటికీ ప్రచంఢమైన గాలి వీచడం కారణంగా శాలువా ప్రహ్లాదుని చూట్టూ కప్పుకుని హోళిక అగ్నిలో దగ్ధం ఔతుంది. ప్రహ్లాదుడుమాత్రం రక్షించబడతాడు.అప్పటి నుండి ప్రహ్లాదుడు రాక్షసి హోళిక నుండి రక్షించబడినందుకు గుర్తుగా హోళీపండుగ జరుపుకుటున్నారని భావిస్తున్నారు.[8] హోళీకి ముందురాత్రి హోళికా దహనం చేస్తారు. దీనిని హోళికాదహనం అంటారు. అగ్ని హోళికను దహించగానే విష్ణుమూర్తి నరసింహరూపంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని ఉదరాన్ని తనపదునైన గోళ్ళతో చీల్చి అతడిని సంహరించాడు. ఈ సంఘటనకు గుర్తుగా హోళీ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అందుకు గుర్తుగా ముల్తాన్‌లో సూర్య దేవాలయం నిర్మించబడింది. [2] ఈ ఆలయం ఘటనాస్థలిలో నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు.

హోళాష్టక్

[మార్చు]
Holika dahan

పంజాబు (భారతదేశం)లో హోళాష్టక్ పేరుతో 9 రోజులు జరుపుకుంటారు. హోళాష్టక్ అంటే హోళా+ అష్టక్ అంటే హోళీకి ఎనిమిది రోజుల ముందు అని అర్ధం. [14] పండుగ చివరిలో రంగులూ, గులాల్ చల్లుకుంటూ పూర్తిచేస్తారు. హోళాష్టక్ హోళీ ప్రవేశాన్ని సూచిస్తుంది. తరువాత దినం నుండి హోళికా దహనం కొరకు ఏర్పాట్లు మొదలౌతాయి.[15] హోళీదహనానికి ఎనిమిది రోజుల ముందు దహనప్రాంతాన్ని పవిత్రజలంతో శుభ్రం చేస్తారు. తరువాత ఆప్రదేశంలో రెండు కొయ్యలను పాతుతారు. ఇందులో ఒకటి ప్రహ్లాదుడి కొరకు మరొకటి హోళిక కొరకు గుర్తుగా పాతిపెడతారు. దహనంచేసే వరకూ రోజూ ఎండినపిడకలు, ఎండిన కట్టెలు, ఎండుగడ్డి కొంచం కొంచంగా చేరిస్తూ చితి తయారుచేయబడుతుంది. దహనం చేసే రోజుకు పెద్ద ఎత్తున చితి తయారౌతుంటుంది. ఎనిమిదవ రోజున చితిని నిప్పటించి హోళీకా దహనం చేస్తారు. ఆరోజు కొంత వర్ణాలు చల్లుకుంటారు.[16] వారంరోజుల హోళీసంబరాలు మహారాజా రంజిత్ సింఘ్ పర్యవేక్షణలో నిర్వహించబడతాయి.[17]

హోళీ

[మార్చు]

మత్కా లేక ఘరా ధ్వంశం

[మార్చు]

తూర్పు పంజాబు పశ్చిమ పంజాబులో హోళీ వేడుకలో ఒకరోజు [2] [18] ఎత్తుగా కట్టిన ఊట్టి కొట్టే సంప్రదాయం ఆచరణలో ఉంది. ఆరుగురు మగవారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడి ఉంటారు. వారి భుజాల మీదుగా మరికొంతమంది నిలబడి పిరమిడ్‌లా చేసి చివరగా నిలిచిన వ్యక్తి ఉట్టిని కర్రతో కొడతారు. ఉట్టిలో సాధారణంగా మజ్జిగ, వెన్న ఉంచుతారు. శ్రీకృష్ణుడు వెన్న దొగలినడానికి సంకేతంగా ఈవేడుక నిర్వహించబడుతుంది.[8]

రంగులు

[మార్చు]

హోళీవేడుకలో అందరూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు.

చోవంక్ - పూర్ణ

[మార్చు]

సాధారణంగా దుస్తులమీద వర్ణచిత్రాలు చిత్రించే పంజాబు గ్రామీణ ప్రాంతాలలో దసరా, కర్వ చౌత్, దీపావళి, హోళీ సందర్భాలలో ప్రజలు మట్టిగోడలకు వర్ణాలతో చిత్రాలు చిత్రిస్తారు. ప్రజలు లక్ష్మీకటాక్షం కొరకు ఇలా గృహాలను వర్ణమయ చిత్రాలతో అలంకరిస్తుంటారు. ఈ కళను పంజాబులో చోవంక్ - పూర్ణ అంటారు. వీటికి రూపాలను గ్రామీణ స్త్రీలు అందిస్తారు. ప్రత్యేకమైన చెట్లు, పూలు, మొక్కలు, నెమళ్ళు, జామెంట్రీ ఆకారాలు, చదరపు, గుండ్రని గీతలు, గడులు చిత్రాలలో చోటుచేసుకుంటాయి. [19]

హోళీ, వసతం

[మార్చు]

శీతాకాలానికి ముగింపుగా హోళీ ప్రవేశిస్తుంది.[20] పంజాబు ప్రాంతంలో వసంతం రెండుభాగాలుగా ఉంటుంది. పంజాబీ మాసం మఘర్, పోహ్ (నవంబరు - జనవరి), వరకు హేమంతం, పంజాబు మాసాలు మాఘ్, ఫగన్ (జనవరి - మార్చి) వరకు శిశిరం ఉంటుంది. హేమంతం, శిశిర ౠతువులు కలిపి శీతాకాలంగా ఉంటుంది. హోళీకా దహనం శీతాకాలానికి ముగింపుగా, వసంతకాలానికి ఆరంభంగా ఉంటుంది.

హోళీ, సిక్కిజం

[మార్చు]

శ్రీ గురు గ్రాంత్ సాహిబ్ జీ హోళీ జరుపుకోవడం ద్వారా భగవంతుని సేవించాలని బోధించాడు. హోళీ వర్ణాలు భగవంతుని ప్రేమకు చిహ్నమని వర్ణించాడు. [21]

మూలాలు

[మార్చు]
  1. A White Trail: A Journey into the heart of Pakistan's Religious Minorities by HAROON KHALID [1]
  2. 2.0 2.1 2.2 2.3 "Sohaib Arshad The Friday Times 31 12 2010". Archived from the original on 2018-11-16. Retrieved 2016-07-23.
  3. Syad Muhammad Latif (1963). The early history of Multan. p. 3,54. Kasyapa, is believed, according to the Sanscrit texts, to have founded Kashyapa-pura (otherwise known as Multan
  4. Gazetteer of the Multan District, 1923-24 Sir Edward Maclagan, Punjab (Pakistan). 1926. pp. 276–77.
  5. Imperial rule in Punjab: the conquest and administration of Multan, 1818-1881 by J. Royal Roseberry. pp. 243, 263.
  6. All the year round , Volume 51. Charles Dickens. 1883.
  7. Temple of Prahladpuri-Multan Archived 2012-07-04 at the Wayback Machine Survey & Studies for Conservation of Historical Monuments of Multan. Department of Archeology & Museums, Ministry of Culture, Government of Pakistan
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "Haroon Khalid The Friday Times 15 04 2011". Archived from the original on 2013-12-11. Retrieved 2016-07-23.
  9. Temple of Prahladpuri Department of Archaeology & Museums Ministry of Culture, Government of Pakistan [2] Archived 2015-01-07 at the Wayback Machine
  10. Fuller, Christopher John. (2004) The Camphor Flame: Popular Hinduism and Society in India. Princeton University Press [3]
  11. 11.0 11.1 "About Hinduism by Gyan Rajhans". Archived from the original on 2017-01-11. Retrieved 2016-07-23.
  12. Bhavan's Journal, Volume 14, Issues 14-26 Bharatiya Vidya Bhavan 1968
  13. Legend of Ram–Retold By Sanujit Ghose
  14. [4] The Tribune 25 February 2012
  15. [5][permanent dead link] Himachal News Kullu Celebrates Brij Ki Holi Dr Dev Kanya Thakur 8 January 2015
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-22. Retrieved 2016-07-23.
  17. [6] The Sunday Tribune Holi on Canvas Kanwarjit Singh Kang 13 March 2011
  18. http://festivals.iloveindia.com/holi/holi-celebrtions.html
  19. Drawing Designs on Walls, Trisha Bhattacharya (Oct 13, 2013), Deccan Herald; Accessed on 7 January 2015
  20. A Different Springtime Rite Wall Street Journal
  21. Sri Guru Granth Sahib Ji

మూస:Punjab, India మూస:Punjabi festivals