Jump to content

హేవ్ లాక్ వంతెన

అక్షాంశ రేఖాంశాలు: 17°00′26.6″N 81°45′21″E / 17.007389°N 81.75583°E / 17.007389; 81.75583
వికీపీడియా నుండి
హేవ్ లాక్ గోదావరి వంతెన
నిర్దేశాంకాలు17°00′26.6″N 81°45′21″E / 17.007389°N 81.75583°E / 17.007389; 81.75583
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలురైల్వే లైన్
దేనిపై ఉందిగోదావరి
స్థలంతూర్పుగోదావరి జిల్లా , రాజమహేంద్రవరం భారత దేశం
అధికారిక పేరుహేవ్ లాక్ వంతెన
ఇతర పేర్లుగోదావరి వంతెన
నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
లక్షణాలు
మొత్తం పొడవు2.7 కీలో మీటర్ల
జీవిత కాలం అంచనా100 సంవత్సరాలు
చరిత్ర
నిర్మాణం ప్రారంభం11 నవంబరు 1897 (1897-11-11)
ప్రారంభం30 ఆగస్టు 1900 (1900-08-30)
మూసివేసినది1997
ప్రదేశం
పటం

హేవ్‌లాక్ వంతెన ఆంధ్ర ప్రదేశ్‌లో రాజమహేంద్రవరం వద్ద, గోదావరి నదిపై 19 వ శతాబ్దంలో బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించారు.చెన్నై నుండి కోల్‌కతా రైలు మార్గంలో ఈ వంతెన ఉంది. నూరేళ్ళకు పైగా ఉపయోగపడిన ఈ వంతెన సేవలను 1997 లో భారతీయ రైల్వే నిలిపివేసింది. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వంతెనను రైల్వేల నుంది కొని పర్యాటక కేంద్రంగా మార్చింది.

చరిత్ర

[మార్చు]

హేవ్‌లాక్ వంతెన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఉంది. బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని 47 లక్షల అంచనా వ్యయంతో 1897 నవంబర్ 11 న ప్రారంభించి, 1900 ఆగస్టు 30న పూర్తి చేసింది. 2.7 కి.మీ. పొడవు, 1.7 మీ వెడల్పు తో సర్ ఆర్థర్ హేవ్ లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ వంతెన 118 ఏళ్ల చరిత్ర కలిగినది. ఈ వంతెన పై మొట్టమొదట మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం చేసినట్లు రికార్డులో నమోదయింది.100 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలు అందించిన ఈ వంతెన పై సేవలను భారతీయ రైల్వే 1997 సంవత్సరంలో నిలిపివేసింది. చివరిసారిగా ఈ వంతెనపై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించినట్లు రికార్డ్ నమోదయింది[1]

పర్యాటకంగా అభివృద్ధి

[మార్చు]

వాడుక నిలిపివేసిన ఈ వంతెనను 2017 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు 12.5 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ నిర్మాణంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించుకుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "The Havelock Bridge Meorial Stone". 21 March 2009.
  2. "Havelock bridge to be developed into tourist spot". The Hindu. 17 December 2008.