హేమ్ చంద్ర గోస్వామి
హేమ్ చంద్ర గోస్వామి | |
---|---|
![]() న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ సెర్మనీ-Iలో 2023 మార్చి 22న శ్రీ హేమ్ చంద్ర గోస్వామికి పద్మశ్రీ అవార్డును అందజేస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. | |
జననం | మజులి జిల్లా, అస్సాం , భారతదేశం | మార్చి 1, 1958
జాతీయత | ![]() |
అవార్డులు | పద్మశ్రీ (2023) |
హేమ్ చంద్ర గోస్వామి ( జననం మార్చి 1, 1958) అస్సాంలోని మజులి జిల్లాకు చెందిన భారతీయ ముసుగు (మాస్క్) తయారీ కళాకారుడు.[1] ఆయన కళారంగంలో చేసిన కృషికిగాను 2023లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.[2][3]
హేమ్ చంద్ర గోస్వామి దిబ్రూఘర్ విశ్వవిద్యాలయం, తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం, వివేకానంద కేంద్రం, ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ, విశ్వభారతి & శాంతినికేతన్ వంటి దేశంలోని వివిధ సంస్థలలో స్ప్లిట్ వెదురు ముసుగుల వారసత్వంపై ఉపన్యాసాలు ఇచ్చాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]హేమ్ చంద్ర గోస్వామి 1958 మార్చి 1న అస్సాం రాష్ట్రంలోని మజులి జిల్లాలో జన్మించాడు. ఆయన స్థానిక హైస్కూల్ నుండి HSLC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, గౌహతిలోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ నుండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు.
ప్రదర్శనలు
[మార్చు]హేమ్ చంద్ర గోస్వామి చేసిన మాస్కులను దిబ్రూఘర్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రం, వివేకానంద కేంద్రం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ, ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ్ సంగ్రహాలయ, భోపాల్, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ & ఇజ్రాయెల్ మాస్క్‌లు అమర్చబడి ప్రదర్శించబడుతున్నాయి. 2016 జనవరి నుండి ఆగస్టు వరకు బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన కృష్ణా ఇన్ ది గార్డెన్ ఆఫ్ అస్సాం ఎగ్జిబిషన్‌లో ఈ ముసుగులు ప్రదర్శించబడ్డాయి.
అవార్డులు, సన్మానాలు
[మార్చు]- 2023 : పద్మశ్రీ పురస్కారం[4]
- 2022 : అచీవర్ అవార్డ్ ఇన్ ఎక్సలెన్స్ ఆన్ ఆర్ట్ బై ప్రతిదిన్ టైమ్, అస్సాం.
- 2019 : సంగీత నాటక అకాడమీ అవార్డు
- 2018 : లుయిట్‌పోరియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- 2014 : దామోదర దేవ జాతీయ అవార్డు
- 2012 : లామెజో డా ఆనంద్ అవార్డు[5]
మూలాలు
[మార్చు]- ↑ "Meet Hem Chandra Goswami, a master mask-maker from Majuli" (in Indian English). The Hindu. 22 August 2019. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Revival of Assam's traditional masks gets Hem Chandra Goswami Padma award" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 26 January 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Full list of 2023 Padma awards" (in Indian English). The Hindu. 25 January 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Padma Awards 2023" (PDF). Press Information Bureau, Government of India. 5 April 2023. p. 32. Retrieved 15 October 2023.
- ↑ "Assam: President Droupadi Murmu confers Padma Shri to Hem Chandra Goswami". NorthEast Now. 23 March 2023. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.