Jump to content

హెబ్బల్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 13°02′48″N 77°35′13″E / 13.04667°N 77.58694°E / 13.04667; 77.58694
వికీపీడియా నుండి
హెబ్బల్ సరస్సు
ప్రదేశంహెబ్బాల్, బెంగళూరు, కర్ణాటక
అక్షాంశ,రేఖాంశాలు13°02′48″N 77°35′13″E / 13.04667°N 77.58694°E / 13.04667; 77.58694
రకంనిల్వనీరు
సరస్సులోకి ప్రవాహంవర్షపునీరు, డ్రైనేజి
వెలుపలికి ప్రవాహంNala
పరీవాహక విస్తీర్ణం37.5 km² (14.47883 mi²)
ప్రవహించే దేశాలుభారతదేశం
నిర్మాణం1537
ఉపరితల వైశాల్యం57 హె. (140.9 ఎకరం)
15,200,000 మీ3 (540,000,000 ఘ.అ.)

బెంగళూరులో జాతీయ రహదారి - 7 మార్గంలో, బళ్లారి ఔటర్ రింగ్ రోడ్ (ORR) కూడలిలో హెబ్బాల్ సరస్సు ఉంది. 1537 లో కెంపె గౌడ సృష్టించిన మూడు సరస్సులలో ఇది ఒకటి. బెంగుళూరు ప్రాంతంలో చాలా సరస్సులు సహజ లోయల కారణంగా ఏర్పడ్డాయి. 2000 సంవత్సరంలో జరిపిన అధ్యయనంలో సరస్సు విస్తరణ 75 హెక్టార్లు, 143 హెక్టార్లుగా ఉందని కనుగొనబడింది.[1][2]

విస్తీర్ణం

[మార్చు]

సరస్సు పరీవాహక ప్రాంతం 3750 హెక్టార్లు గా గుర్తించబడింది. 1974 లో సరస్సు విస్తీర్ణం 77.95 హెక్టార్లు గా ఉంటే 1998 లో 57.75 హెక్టార్లు గా మారింది. సరస్సు నిల్వ సామర్థ్యం 2000 లో 2.38 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా అంచనా వేయబడింది.[3]

భౌగోళికం

[మార్చు]

ఈ సరస్సు పరీవాహక ప్రాంతంలో యశ్వంత్‌పూర్, మతికెరె, రాజమహల్ విలాస్ ఎక్స్‌టెన్షన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ లు ఉన్నాయి.[4]

వాతావరణం

[మార్చు]

ఈ ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో 3.04 మిలియన్ క్యూబిక్ మీటర్లు, నైరుతి రుతుపవనాల సమయంలో 10.12 మిలియన్ క్యూబిక్ మీటర్లు, పొడి కాలంలో 3.28 మిలియన్ క్యూబిక్ మీటర్లు, 15.2 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా వర్షపాతం అంచనా వేయబడింది.[5]

క్షీణత,పక్షులు

[మార్చు]

మురుగునీటి ప్రవాహం కారణంగా సరస్సు కాలుష్యంతో క్షీణించి పోతుంది. స్పాట్-బిల్ పెలికాన్, యురేషియన్ స్పూన్‌బిల్, షావెలర్, పింటైల్, గర్గనీ, లిటిల్ గ్రెబ్, కూట్, ఇండియన్ స్పాట్-బిల్ డక్ వంటి పెద్ద వాటర్‌బర్డ్స్‌తో సహా అనేక రకాల నీటి పక్షులు ఈ ప్రాంతంలో ఆవాసాలను ఏర్పరచుకుంటాయి.[6][7]

మూలాలు

[మార్చు]
  1. K.C. Smitha Urban Governance and Bangalore Water Supply & Sewerage Board (BWSSB) PDF Archived 19 జూలై 2006 at the Wayback Machine
  2. Rinku Verma, S. P. Singh and K. Ganesha Raj (2003) Assessment of changes in water-hyacinth coverage of water bodies in northern part of Bangalore city using temporal remote sensing data. Current Science 84(6):795-804 PDF
  3. Ramachandra TV (2001) Restoration and management strategies of wetlands in developing countries. Electronic Green Journal 15 Fulltext Archived 15 డిసెంబరు 2008 at the Wayback Machine
  4. Krishna, M.B., Chakrapani, B.K. and Srinivasa, T.S. 1996. Water Birds and Wetlands of Bangalore, Karnataka State Forest Department, Bangalore.
  5. Public Interest Litigation from ESG Archived 25 జూలై 2008 at the Wayback Machine
  6. Of the dangers posed by privatisation of lakes The Hindu 23 June 2008
  7. Project Plan