హీనా సిద్ధూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీనా సిద్ధూ
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
పౌరసత్వం భారతీయురాలు
జననం (1989-08-29) 1989 ఆగస్టు 29 (వయసు 34)
లుధియానా, పంజాబ్
నివాసంముంబై, భారతదేశం[1]
విద్యబ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ
వృత్తిషూటింగ్ క్రీడాకారిణి
ఎత్తు163 cమీ. (5 అ. 4 అం.) (As of April 2013)
బరువు50.5 కి.గ్రా. (111 పౌ.) (As of April 2013)
భార్య(లు)
రోనక్ పండిట్
(m. 2013)
క్రీడ
ర్యాంకుNo.1 (7 April 2014)

హీనా సిద్ధూ, పంజాబు రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ షూటింగ్ క్రీడాకారిణి. 2013 లో జర్మనీ లోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ఈ పోటీలలో హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో భారత్ నుంచి 2002 లో అంజలి భగవత్, 2008 లో గగన్ నారంగ్ రైఫిల్ విభాగంలో ఈ ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి 10 మంది షూటర్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో హీనా విశేషంగా రాణించింది.స్వర్ణ పతకాన్ని నెగ్గే క్రమంలో ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్‌జున్ (చైనా)... ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా)... రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఒలెనా కొస్టెవిచ్ (ఉక్రెయిన్) లను ఓడించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో జన్మించింది. ఈవిడ సొంగ నగరం పటియాల. ఈమె దంత వైద్య శాస్త్రమును అభ్యసించింది. చిత్రలేఖనము, రంగుల అల్లిక ఈవిడ ఆసక్తులు.

మూలాలు

[మార్చు]
  1. Nandakumar Marar (2014-02-05). "ISSF cover girl Heena Sidhu says performance matters". The Hindu. Retrieved 2014-04-12.

వెలుపలి లంకెలు

[మార్చు]