Jump to content

హిమా కోహ్లీ

వికీపీడియా నుండి
జస్టిస్
హిమా కోహ్లీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Assumed office
7 జనవరి 2021
Nominated byశరద్ అరవింద్ బొబ్డే
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
In office
29 మే 2006 – 6 జనవరి 2021
Nominated byయోగేశ్ కుమార్ సభర్వాల్
Appointed byఏ.పి.జె. అబ్దుల్ కలామ్
వ్యక్తిగత వివరాలు
జననం (1959-09-02) 1959 సెప్టెంబరు 2 (వయసు 65)
న్యూఢిల్లీ
జాతీయతభారతీయుడు
కళాశాలఢిల్లీ విశ్వవిద్యాలయం

హిమా కోహ్లీ (జ. 2 సెప్టెంబరు 1959) భారతీయ న్యాయమూర్తి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తోంది. ఈ పదవిలోకి వచ్చిన మొదటి మహిళా న్యాయమూర్తి ఈమె. ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది.[1][2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

కోహ్లీ 1959, సెప్టెంబరు 2న న్యూఢిల్లీలో జన్మించింది. న్యూఢిల్లీలోని మందిర్ మార్గ్ లోని సెయింట్ థామస్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి హిస్టరీలో బిఎ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, విశ్వవిద్యాలయం క్యాంపస్ లా సెంటర్ నుండి న్యాయ పట్టా సంపాదించింది.[3]

వృత్తి జీవితం

[మార్చు]

కోహ్లీ 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో చేరింది.[3] ఢిల్లీలో న్యాయశాస్త్రం అభ్యసించి 1999-2004 మధ్యకాలంలో న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు న్యాయవాదిగా పనిచేసింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌తో సహా అనేక ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయ సలహాదారుగా నియమించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీతో న్యాయ సహాయ సేవలను కూడా అందించింది.

2006, మే 29న కోహ్లీని ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమించి, 2007 ఆగస్టు 29న శాశ్వత నియామకం చేయబడింది.[3] ఢిల్లీ హైకోర్టులో తన పదవీకాలంలో, ఇప్పటికే అనేక బెయిల్ మంజూరు చేసిన ఖైదీలను నిర్బంధించడంపై విచారణకు పిలుపునివ్వడం,[4] నేరానికి పాల్పడిన బాలల గుర్తింపును రక్షించడం,[5] దృశ్యమాన వికలాంగులను ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునేలా సౌకర్యాలు కల్పించడం[6] మొదలైన పనులు చేసింది.

2020లో కరోనాపై ఢిల్లీ ప్రభుత్వం ప్రతిస్పందనను పర్యవేక్షించే కమిటీకి కోహ్లీ నాయకత్వం వహించింది.[7] కరోనాకు సంబంధించి ప్రైవేట్ ప్రయోగశాలలు పరీక్షలు నిర్వహించడానికి అనుమతులివ్వడం ఆలస్యం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ని కోహ్లీ మందలించింది.[8]

2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడి, 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టు విడిపోయిన తరువాత, ప్రధాన న్యాయమూర్తి పదవిని పొందిన మొదటి మహిళగా నిలిచింది.[9][1]

2017 నుండి కోల్‌కతాలోని పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ జనరల్ కౌన్సిల్‌లో పనిచేసింది. 2020 జూన్ 30 నుండి న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీకి కౌన్సిల్‌లో పనిచేసింది. 2020 మే 20 నుండి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్‌పర్సన్ అయింది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Justice Hima Kohli takes charge as 1st woman CJ of Telangana high court". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-06-16. Retrieved 2021-06-16.
  2. "Justice Hima Kohli recommended as first woman CJ of Telangana High Court". The News Minute (in ఇంగ్లీష్). 2020-12-16. Retrieved 2021-06-16.
  3. 3.0 3.1 3.2 3.3 "CJ And Sitting Judges". delhihighcourt.nic.in. Retrieved 2020-02-27.
  4. "HC pulls up Tihar for detaining man in jail for 10 days despite bail order". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-22. Retrieved 2021-06-16.
  5. "Juvenile's identity not to be disclosed at any time, says Delhi High Court". The Indian Express (in ఇంగ్లీష్). 2017-12-31. Retrieved 2021-06-16.
  6. "HC directs DU to provide scribes to visually impaired students online exams". The Indian Express (in ఇంగ్లీష్). 2020-08-05. Retrieved 2021-06-16.
  7. Mutha, Sagar Kumar (16 December 2020). "Telangana set to get its first woman Chief Justice | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Delhi HC pulls up ICMR over wait for approvals". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-17. Retrieved 2021-06-16.
  9. "Justice Hima Kohli takes oath as first woman CJ of Telangana HC". The New Indian Express. Retrieved 2021-06-16.