హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | రిషి ధావన్ |
యజమాని | హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1985 |
స్వంత మైదానం | హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం |
సామర్థ్యం | 25,000 |
చరిత్ర | |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 1 |
అధికార వెబ్ సైట్ | http://www.hpcricket.org/ |
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దేశీయ క్రికెట్ జట్టు. ఇది 1985-86 సీజన్ నుండి రంజీ ట్రోఫీలో ఆడుతోంది. 2021–22 సంవత్సరంలో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుని, తమ మొట్టమొదటి దేశీయ ట్రోఫీని సాధించింది.
ప్లేయింగ్ హిస్టరీ
[మార్చు]హిమాచల్ ప్రదేశ్ 1985–86, 1987–88 సీజన్‌లలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. [1] 1990-91లో ఒక వికెట్‌తో సర్వీసెస్‌ను ఓడించి మొదటిసారి గెలిచారు.[2] 2006–07లో హిమాచల్ ప్రదేశ్, రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌ను గెలుచుకుంది, ఫైనల్‌లో ఒరిస్సాను ఓడించి [3] వారి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
2018-19 సీజన్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 37 విజయాలు, 86 ఓటములు, 79 డ్రాలతో 202 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడింది. [4]
హిమాచల్ ప్రదేశ్ జట్టు హోమ్ గేమ్స్ చాలా వరకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడతుంది.
2016–17 రంజీ ట్రోఫీలో, హిమాచల్ ప్రదేశ్ 2016 అక్టోబరు 28 న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయినప్పుడు పోటీలో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది [5]
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ అత్యుత్తమ ప్రదర్శనలు 2009-10, 2020-21లో ఉన్నాయి. ఈ రెండు సార్లూ జట్టు, క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రెండు సార్లూ తమిళనాడు చేతిలో ఓడిపోయారు. 2021–22 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో తమిళనాడును ఓడించి, తమ తొలి టైటిల్‌ను గెలుచుకున్నారు.
ప్రస్తుత జట్టు
[మార్చు]అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడిన ఆటగాళ్ల పేర్లు బొద్దుగా చూపించాం.
పేరు | పుట్టిన తేదీ | బ్యాటింగ్ శైలి | బౌలింగ్ శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాట్స్‌మెన్ | ||||
ప్రశాంత్ చోప్రా | 1992 అక్టోబరు 7 | కుడిచేతి వాటం | ||
అమిత్ కుమార్ | 1989 నవంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
నిఖిల్ గంగ్తా | 1992 సెప్టెంబరు 1 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
రాఘవ్ ధావన్ | 1987 జనవరి 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ఏకాంత్ సేన్ | 1995 జూన్ 21 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్మీడియం | |
అంకిత్ కల్సి | 1993 సెప్టెంబరు 26 | ఎడమచేతి వాటం | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | వైస్ కెప్టెన్ |
సుమీత్ వర్మ | 1990 నవంబరు 18 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |
ఆల్‌రౌండర్లు | ||||
ఆకాష్ వశిష్ట్ | 1994 డిసెంబరు 17 | ఎడమచేతి వాటం | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు |
రిషి ధావన్ | 1990 ఫిబ్రవరి 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | కెప్టెన్ </br> ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు |
దిగ్విజయ్ రంగి | 1998 ఏప్రిల్ 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |
వికెట్ కీపర్లు | ||||
ప్రవీణ్ ఠాకూర్ | 1992 డిసెంబరు 15 | ఎడమచేతి వాటం | ||
అంకుష్ బెయిన్స్ | 1995 డిసెంబరు 16 | కుడిచేతి వాటం | ||
శుభమ్ అరోరా | 1997 అక్టోబరు 26 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
మయాంక్ దాగర్ | 1996 నవంబరు 11 | కుడిచేతి వాటం | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు |
గుర్విందర్ సింగ్ | 1983 జూన్ 12 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్-బ్రేక్ | |
పేస్ బౌలర్లు | ||||
వైభవ్ అరోరా | 1997 డిసెంబరు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్మీడియం | ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్నాడు |
కన్వర్ అభినయ్ | 1991 జూన్ 16 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
వినయ్ గలేటియా | 1992 డిసెంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి వేగంగా | |
పంకజ్ జస్వాల్ | 1995 సెప్టెంబరు 20 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
ప్రస్తావనలు
[మార్చు]- ↑ Wisden 1987, pp. 1141–42, Wisden 1989, p. 1081.
- ↑ Services v Himachal Pradesh 1990–91
- ↑ Orissa v Himachal Pradesh 2006–07
- ↑ "Ranji Trophy Playing Record". CricketArchive. Retrieved 22 June 2019.
- ↑ "Lowest Team Totals for Himachal Pradesh". Cricket Archive. 28 October 2016. Retrieved 28 October 2016.