Jump to content

హిందూజన సంస్కారిణి

వికీపీడియా నుండి
హిందూజన సంస్కారిణి
1912 అక్టోబరు సంచిక
సంపాదకులుమన్నవ సింహాచలం పంతులు
తరచుదనంమాస పత్రిక
స్థాపక కర్తమన్నవ బుచ్చయ్య పంతులు
మొదటి సంచిక1885 ఆగస్టు
దేశంభారతదేశం
కేంద్రస్థానంమద్రాసు
భాషతెలుగు

హిందూజన సంస్కారిణి 1885 లో మద్రాసు నుండి మొదలైన తెలుగు మాస పత్రిక. మన్నవ బుచ్చయ్య పంతులు ఈ పత్రికను స్థాపించి సంపాదకత్వం నెరపాడు.[1] 1912 లో అతని కుమారుడు మన్నవ సింహాచలం పంతులు సంపాదకత్వం స్వీకరించాడు. ఈ పత్రికలో పుస్తక పరిచయాలను విశేషంగా ప్రచురించేవారు. పున్తక నమీక్షలకు సంబంధించి ఒక పద్ధతిని ఏర్పరిచిన పత్రిక ఇదే.[2]

చరిత్ర

[మార్చు]

హిందూజన సంస్కారిణి 1885 ఆగస్టులో మద్రాసులో మాస పత్రికగా మొదలైంది. బ్రిటిషు ప్రభుత్వ అధికారులు నెలనెలా పంపే గోప్య నివేదికలో వివిధ పత్రికల సర్క్యులేషను సంఖ్యలతో పాటు, పరిపాలనకు సంబంధించి ఆయా పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన సామాజిక వార్తలు, విశేషాలను కూడా ఇంగ్లీషు లోకి అనువదించి పంపేవారు. 1885 ఆగస్టు నివేదికలో ఈ పత్రిక కొత్తగా వచ్చిందని రాసారు. 1885 సెప్టెంబరు నివేదికలో దీని సర్క్యులేషను 100 అని నివేదించారు.[3] 1890 డిసెంబరులో పంపిన నివేదికలో హిందూజన సంస్కారిణి పత్రిక సర్క్యులేషను 544 అని రాసారు.[4] 1887 నవంబరు నాటి నివేదికలో ఈ పత్రిక సర్క్యులేషను 100 అని రాసారు.[5] 188 నవంబరులో ఇది 950 కి చేరింది. ఆ మూడేళ్ళలో పత్రిక బాగా వృద్ధి చెందిందని తెలుస్తోంది. 1893 జూన్ నాటికి పత్రిక సర్క్యులేషను 600 కు చేరింది.[6]

మూలాలు

[మార్చు]
  1. వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమీ. pp. 22, 23.
  2. కె., రామదాస్ (2012). "తొలి తెలుగు వార్తాపత్రిక వర్తమాన తరంగిణి". తెలుగు దిన పత్రికలు సాసొత్య సేన. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 3.
  3. ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్.
  4. ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
  5. ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
  6. ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.