Jump to content

హిందుస్తాన్ ఫోటో ఫిలింస్

వికీపీడియా నుండి

హిందుస్తాన్ ఫోటో ఫిలింస్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఆంగ్లం: Hindustan Photo Films) భారతదేశం లోని ఊటీ కేంద్రంగా ఫోటోగ్రఫిక్, సినీ, ఎక్స్-రే, గ్రాఫిక్ ఆర్ట్ ఫిలిం, ఫోటోగ్రాఫిక్ కాగితం, రసాయనాలను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థచే తయారు చేయబడే ఫిలిం ఇందు అనే బ్రాండుతో వ్యవహరించబడేవి. సంస్కృతంలో ఇందు అనగా వెండి అని అర్థం. ఫిలిం లో వాడబడే సిల్వర్ హాలైడ్ అనే రసాయనాన్ని ఉద్దేశించి ఈ ఫిలిం కు ఆ పేరు పెట్టబడింది.

చరిత్ర

[మార్చు]

హిందూస్తాన్ ఫోటో ఫిల్మ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌పిఎఫ్) ప్రభుత్వ పరిశ్రమల రంగములో( పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ) స్వాతంత్య్రం తదుపరి భారీ పరిశ్రమల విభాగం కింద 1960 లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రణాళికలో భాగంగా తమిళనాడు లోని నీలిగిరి జిల్లాలోని ఉదగమండలం, చెన్నయ్ కి దగ్గరలో అంబత్తూరు లో స్థాపించారు.[1] ఉదగమండలం లో ఉన్న ప్రధాన కర్మాగారంలో పాలిస్టర్ ఎక్స్‌రే ఫిల్మ్ ప్లాంట్, మాగ్నెటిక్ టేప్ ప్లాంట్, చెన్నైలోని అంబత్తూర్ వద్ద, దిగుమతి చేసుకున్న జంబో ఫిల్మ్ రోల్స్ రిటైల్ ప్యాక్‌లలోకి కత్తిరించే దానిని నెలకొల్పినారు.[2] 700 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్న ఏకైక సంస్థ,మొత్తం సౌత్ ఈస్ట్ ఆసియాలో ఫోటో సెన్సిటైజ్డ్ వస్తువుల యొక్క ఏకైక ఇంటిగ్రేటెడ్ తయారీదారు. మెడికల్ ఎక్స్‌రే, గ్రాఫిక్ ఆర్ట్స్, అంతర్జాతీయ ప్రమాణాల బ్లాక్ అండ్ వైట్ ఉత్పత్తుల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఏకైక సంస్థ . ప్రభుత్వ రంగలో స్థాపించించన ఈ పరిశ్రమ లక్ష్యం సినిమా పరిశ్రమకు ముడి సినీ ఫిల్మ్‌లు, వైద్య , రక్షణ ప్రయోజనాల కోసం ఎక్స్‌రే ఫిల్మ్‌లు, ఫోటోగ్రాఫర్‌ల కోసం ప్రత్యేక ఫోటోగ్రాఫిక్ సామగ్రిని సరఫరా చేయడానికి ఈ సంస్థ ప్రధానంగా స్థాపించబడింది, వీటిని గతంలో మన దేశం దిగుమతి చేసుకునేవారు.బ్రిటన్ లోని నేషనల్ అక్రిడిటేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ బాడీస్‌తో అనుబంధంగా ఉన్న క్వాలిటీ అస్యూరెన్స్ సిస్టమ్స్ చేత ఉత్తమ నాణ్యమైన వ్యవస్థలను కలిగి ఉండటం, కొత్త పాలిస్టర్ ఎక్స్‌రే ఫిల్మ్ ప్లాంట్ కోసం సంస్థ ISO 9002 ధృవీకరణను పొందినది. హిందూస్తాన్ ఫోటో ఫిల్మ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏప్రిల్ 1977 లో పాలిస్టర్ బేస్ మెడికల్ ఎక్స్-రే, ఇండస్ట్రియల్ ఎక్స్-రే , గ్రాఫిక్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ప్లాంట్‌ను ప్రారంభించింది. రెసిన్ కోటెడ్ బ్రోమైడ్ పేపర్, గ్రాఫిక్ ఆర్ట్స్ లేజర్ ఫిల్మ్ కోసం యాంటిహలో, కలర్ పేపర్,కలర్ ఫిల్మ్ కోసం లిక్విడ్ కెమిస్ట్రీ కోసం కంపెనీ కొత్త నమూనాను అభివృద్ధి చేసింది.[3]

మూసివేత

[మార్చు]

BIFR చట్టం 1985 ప్రకారం హిందూస్తాన్ ఫోటో ఫిల్మ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌పిఎఫ్) మూసివేయడానికి BIFR సిఫార్సు చేసింది(30.01.2003) , BIFR ఉత్తర్వు అమలుకు వ్యతిరేకంగా కంపెనీ మూసివేతపై కొన్ని కార్మిక సంఘాల వారు మద్రాస్ హైకోర్టు లో రిట్ పిటిషన్ వేసినారు, దానితో వారికి హైకోర్టు నుంచి నిలుపుదల ఉత్తర్వు ( స్టే ఆర్డర్ ) ఇచ్చింది. తదుపరి 08.09.2017 నాటి హైకోర్టు వారి ఉత్తర్వులలో " BIFR ఉత్తర్వు అమలుకు ఆమోదించబడి, రిట్ పిటిషన్లు " పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా, రిట్ పిటిషన లో ఉన్న స్వచ్ఛంద పదవీ విరమణ కు సంబంధించి కార్మికులకు వేతనాలు చెల్లించడాన్ని సవాలు చేయడం వంటివి , హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం" అధికారిక లిక్విడేటర్ హిందూస్తాన్ ఫోటో ఫిల్మ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ వారి ఆస్తుల బాధ్యతలు స్వీకరించి, రికార్డుల పుస్తకాలు పరిశీలించి , వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు పరిశీలించ వలసినదని" అని హైకోర్టు వారు తమతీర్పులో పేర్కొన్నారు.[4][5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. February 5, Arun Ram; February 5, 2001 ISSUE DATE:; November 16, 2001UPDATED:; Ist, 2012 11:44. "'Hindustan Photo Films does not have the technology for colour film'". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-02-05. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Hindustan Photo Films Manufacturing Company Ltd. Company Profile, Address, Telephone Numbers and More". Goodreturn (in ఇంగ్లీష్). Retrieved 2021-02-05.
  3. "Hindustan Photo Films Manufacturing Company Ltd". Business Standard India. Retrieved 2021-02-05.
  4. "HINDUSTAN PHOTO FILMS MFG. CO.LTD" (PDF). dhi.nic.in/writereaddata. 6 February 2021. Archived from the original (PDF) on 27 ఆగస్టు 2021. Retrieved 6 February 2021.
  5. "Closure recommended for ailing Hindustan Photo Films". governancenow.com/news/. 6 February 2021. Archived from the original on 13 జూన్ 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]