Jump to content

హాజా షరీఫ్

వికీపీడియా నుండి
హాజా షరీఫ్
జననం
ఖాజా షరీఫ్

(1969-01-03) 1969 జనవరి 3 (వయసు 55)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుమాస్టర్ హాజా షరీఫ్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1979-2006

మాస్టర్ హాజా షరీఫ్ (జననం 1969 జనవరి 3) భారతీయ మాజీ నటుడు. ఆయన ప్రధానంగా తమిళ సినిమాలలో నటించాడు. ఆయన ఉతిరిపూక్కల్, సువరిల్లద చిత్తిరంగల్, అంధ 7 నాట్కల్ వంటి ప్రముఖ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన 1979 చిత్రం పుతియా వార్పుగల్‌ చిత్రంతో అరంగేట్రం చేసాడు.[1]

అయితే, ప్ర స్తుతం మలేషియా, దుబాయ్, కెనడా, అమెరికా మొదలైన దేశాల్లో స్టార్ నైట్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్‌గా ఆయన వ్యవహరిస్తున్నాడు.[2]

కెరీర్

[మార్చు]

తన తొలి చిత్రం పుతియా వార్పుగల్, ఆ తరువాత ఉతిరిపూక్కల్, సువర్ఇల్లత చిత్రాంగళ్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. అయినప్పటికీ, కె. భాగ్యరాజ్ రూపొందించిన అంధ 7 నాట్కల్ చిత్రంతో ఆయన అత్యంత ప్రజాదరణ పొందాడు. ఈ చిత్రంలో భాగ్యరాజ్ పాలక్కట్టు మాధవన్ పాత్రను పోషించగా, ధోలక్ అబ్బాయిగా కనిపించిన కుర్రాడు హాజా షరీఫ్.[3] ఈ చిత్రం తెలుగులో రాధా కళ్యాణం (1981), హిందీలో వో సాత్ దిన్ (1983), కన్నడలో లవ్ మాది నోడు (1989)గా రీమేక్ చేయబడింది. తెలుగులో ముళ్లపూడి వెంకటరమణ రచించగా బాపు దర్శకత్వం వహించిన కుటుంబ కథాచిత్రం రాధా కళ్యాణం. కాగా, ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందిన ఈ చిత్రంలోనూ ఆయన నటించాడు.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా నోట్స్ సంవత్సరం సినిమా నోట్స్
1979 పుతియా వార్పుగల్ 1984 నేరం నల్ల నేరం
1979 ఉతిరిపూక్కల్ 1984 ప్రియముదన్ ప్రభు
1979 సువర్ఇల్లత చిత్రాంగళ్ 1985 కుజంధై యేసు
1980 తై పొంగల్ 1985 అలై ఒసై
1980 పూట్టాత పూట్టుక్కల్ 1985 అన్ కన్నిల్ నీర్ వజిందాల్
1980 అన్బుక్కు నాన్ అదిమై 1985 అవల్ సుమంగళితాన్
1980 మూడు పాణి 1985 మూక్కనన్ కయీరు
1980 నిజాల్గల్ 1985 అముత గానం
1981 కరైయెల్లం శెంబగపూ 1986 డిసెంబర్ పూకల్
1981 అంధ 7 నాట్కల్ 1986 లక్ష్మి వందచు
1981 నెంజిల్ ఒరు ముల్ 1986 సంసారం అధు మింసారం
1981 తేనుం వాయంబుం 1987 కావలన్ అవన్ కోవలన్
1982 పొక్కిరి రాజా 1987 వైరాగ్యం
1982 ఆటో రాజా 1988 నేతియది
1982 ఆగయ గంగై 1989 మనసుక్కేత మహారస
1982 పట్టనాథు రజక్కల్ 1991 ఇరుంబు పుక్కల్
1982 తానికట్టు రాజా 1991 నల్లతై నాదు కేకుం [5]
1982 రంగా 1992 చిన్న పసంగ నాంగ
1982 పోయి సచ్చి 1993 ఆదిత్యన్
1982 ఇరట్టిమధురం 1993 పొరంతలు అంబలయ్య పోరక్క కూడతు
1982 గోపురంగల్ శైవతిల్లై 1993 పోరంత వీడ పుగుంత వీడ
1983 తుడిక్కుమ్ కరంగల్ 1993 తంగక్కిలి
1983 తంగైకోర్ గీతం 1998 సంతోషం
1983 మలైయూర్ మంబట్టియన్ 1998 జాలీ
1983 నెంజమెల్లం నీయే 2001 సీరివారుం కాళై
1983 సంధిప్పు 2001 సిటిజెన్
1983 రాగంగల్ మారువత్తిల్లై 2006 తలైమగన్
1983 అపూర్వ సాగోతరిగల్
1984 కొంబేరి మూక్కన్
1984 పొజుత్తు విడిచచ్చు

మూలాలు

[మార్చు]
  1. Rajendran, Venkatesh (2016-06-25). "Master Haja Sheriff". Antru Kanda Mugam (in ఇంగ్లీష్). Retrieved 2020-02-03.
  2. Kumar, Ashok (2017-10-14). "நடிகர் காஜா ஷெரிப்பின் தற்போதைய நிலை". Tamil Behind Talkies (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-03.
  3. Shankar (2017-10-20). "கவுண்டமணியிடம் உதை வாங்கியும் உதவாமல் போனது யார்க்கு?". filmibeat (in తమిళము). Retrieved 2020-02-03.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-24. Retrieved 2015-02-23.
  5. Nallathai Naadu Kekum (1991) Classic Movies (Motion picture) (in Tamil). India: Jeppiar Pictures. 1991. Character's name mentioned from 00:09:50 to 00:15:20.