హాంకాంగ్-జుహయి వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాంకాంగ్-గజుహయి-మకావో వంతెన
నిర్దేశాంకాలు22°16′55″N 113°46′30″E / 22.282°N 113.775°E / 22.282; 113.775
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలుమోటారు వహనాలు
దేనిపై ఉంది
  • పెరల్ రివర్ డెల్టా
    • లింగ్‌డింగ్ చానల్
    • జుహాయి చానల్
స్థలంపెరల్ నది డెల్టా
వెబ్‌సైటు(chinese
లక్షణాలు
డిజైనువంతెన-సొరంగం రకం
మొత్తం పొడవు55 కిలోమీటర్లు (34 మై.)[1]
వరుసల సంఖ్య6
చరిత్ర
నిర్మాణం ప్రారంభం15డెసెంబరు 2009
నిర్మాణం పూర్తి6 ఫిబ్రవరి 2018[2]
నిర్మాణ వ్యయం¥ 126.9 billion ($ మూస:To USD billion)[3]
ప్రారంభం24 October 2018, 9 A.M. UTC+8(23-10-2018 భారత కాలమానం) [4][5]
ప్రదేశం
పటం
హాంకాంగ్-జుహయి వంతెన
Map of the bridge highway and the undersea tunnel (dotted) route of the Hong Kong–Zhuhai–Macau Bridge, between Hong Kong and Macau.
Chinese name
సంప్రదాయ చైనీస్港珠澳大橋
సరళీకరించిన చైనీస్港珠澳大桥
JyutpingGong2zyu1ou3 Daai6kiu4
Hanyu PinyinGǎngzhū'ào Dàqiáo
Portuguese name
PortuguesePonte Hong Kong–Zhuhai–Macau

హాంకాంగ్-జుహయి వంతెనఅనేది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన.పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్-జుహాయి-మకావో నగరాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.ఈ వంతెన మొత్తం పొడవు 55 కి.మీ.అయితే ఇందులో 22.9 కి.మీ సముద్రం మైన ఉండంగా,6.7 కి.మీ సొరంగంలో వున్నది.దీనిని 23-10-2018(మంగళవారం)చైనాఅద్యక్షుడు జీ జింపింగ్ అధికారికంగా ఈ వంతెన ప్రారంచించాడు.24-10-2018 నుండి పరిమిత సంఖ్యలో ఈ వంతెనమీదుగా రాకపోకలు జరుపుచున్నవి.ఈ వంతెన వలన హాంకాంగ్ నుండి జువాయికి ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.[6]

వంతెన నిర్మాణం

[మార్చు]

ఈ వంతెన నిర్మాణం 15 డెసెంబరు 2009 లో ప్రారంభమైనది. వంతెన నిర్మాణానికి 1.47 లక్షలకోట్లు ఖర్చుచేసారు.[6] వంతెన నిర్మాణం 6 పిబ్రవరి 2018న పూర్తి అయ్యినది.ప్రారంభం 23-10-2018న(భారత కాలమానం) అయినది. వంతెనలో మూడు కేబుల్-కల్గిన వంతెనలు, ఒక సముద్రగర్భ సొరంగం, అలాగే రెండు కృత్రిమ ద్వీపాలు ఉన్నాయి. ఈవంతెనను 2016కలా పూర్తిచేసి వావనాలరాకపోకలు మొదలెట్టలనుకున్నారు. నిజానికి ఈ నిర్మాణం 14 నవంబర్ 2017 లో పూర్తయింది. హోప్వెల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ గోర్డాన్‌వు చైనా, హాంకాంగ్, మాకాలను కలిపే వంతెన-సొరంగం నిర్మాణాన్ని 1980 లో ప్రతిపాదించారు. 1983 లో చీసాపీకే బే వంతెన-టన్నెల్ నుండి తనకు ఈ ఆలోచన వచ్చింది అని గోర్డాన్‌వు చెప్పాడు.

వంతెన నిర్మాణ నేపధ్యం

[మార్చు]

హోప్వెల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ గోర్డాన్‌వు చైనా, హాంకాంగ్, మాకాలను కలిపే వంతెన-సొరంగం నిర్మాణాన్ని 1980 లో ప్రతిపాదించారు[7]. 1983 లో చీసాపీకే బే వంతెన-టన్నెల్ నుండితనకు ఈ ఆలోచన వచ్చింది అని గోర్డాన్‌వు చెప్పాడు.గోర్డోన్ వూ 1988లో తన ప్రతిపాదనను గుయాంగ్ దోంగ్, బీజింగ్ అధికారుల ముందుంచాడు. వూ మొదట వంతెనను హాంకాంగ్ లోని,తూఎన్మూన్ దగ్గరి బ్లాక్ పాయింట్ నుండి ప్రాంరంభించి,పేరల్‌ రివర్ మీదుగా,నేలింగ్డింగ్ ద్వీపం మీదుగా,కియాఓ ద్వీపాన్ని కలుపుతూ చైనాలోని ట్టాంగ్జియ గ్రామం వరకు నిర్మించాలని భావించాడు. అక్కడి నుండి మరో రోడ్డును మాకావు వద్ద ముగియుటకు ముందు జుహాయివరకు నిర్మించాలనుకున్నాడు.[8] ఆ సమయంలో 1989లో తినాన్మెన్ స్వేర్ మానవ ఊచకోతల నేపధ్యంలో,ఏర్పడిన సంక్షోభం కరణంగా వూ వెనక్కి తగ్గాడు.[9]

వూ ప్రతిపాదన అణుగుణ్యంగా జూహయి ప్రభుత్వం లింగ్డింగ్ యాంగ్ బ్రిడ్జ్ పేరు మీద వంతెన నిర్మాణం చేపట్టినది.1990 మధ్యలో జూహాయి లోని ప్రధాన భూగంనుండి కీయాఓ ద్వీపంవరకు మొదటి దశ వంతెన నిర్మాణం చేశారు.అప్పటికి ఈ వంతెన నిర్మాణంకై అటు చైనా ,ఇటు హాంకాంగ్ ప్రభూత్వాల నుండి అనుమతి లేదు.[10] 30 డిసెంబరు 1997 నా చైనా తన అంగీకారాన్ని తెలిపినది.[11] కానీ హాంకాంగ్ వంతెన నిర్మాణం వలన ఏర్పడే వాయు కాలుష్యం, క్రాస్ బార్డరు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, జలజీవులకు కలిగే నష్టం వంటి వాటి ఆద్యాయన ఫలితాలు వచ్చేవరకు,ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని కొద్దిగా వెనుకడుకు వేసింది.[12]

నవంబరు 2002లో అప్పటి చైనా ప్రీమియర్ జూరోన్గ్జీ వూ ప్రతిపాదనకు మద్ధతు తెలిపాడు.2003 లో చైనా ప్రభుత్వం కూడా వంతెన నిర్మాణానికి తన మద్ధతు తెలిపినది. జులై 2003 లో హాంకాంగ్ అడ్మినిస్ట్రెసన్ చీఫ్ సెక్రటరీ డోనాల్డ్ టిసాంగ్ చైనా వెళ్ళి చైనా ప్రభుత్వాన్ని కలిసాడు.ఆగస్టు 2003 న హాంకాంగ్- జూహాయి-మహాయి వంతెన నిర్మాణానికి అడ్వాంస్ వర్క్ కోఆర్డినేసన్ గ్రూప్ ను ఏర్పరచారు.

ప్రయాణ సమయంలో తగ్గుదల

[మార్చు]

వంతెన నిర్మాణానికి ముందు ప్రయాణానికి హాంకాంగ్ నుండిజుహాయికి 3 గంటలు కాగా,ఈ వంతెన వలన ఆసమయం 30 నిమిషాలకు తగ్గినది.ఈ వంతెన మీద వాహనం నడపాలంటే ముందస్తు అనుమతి అవసరం.

మూలాలు

[మార్చు]
  1. "The Hong Kong-Zhuhai-Macau bridge: 6 things to know about the engineering marvel". Archived from the original on 2018-10-24. Retrieved 2018-10-24.
  2. "港珠澳大桥主体工程完成交工验收 具备通车试运营条件". Central People's Government of the People's Republic of China. 2018-02-06. Retrieved 2018-10-24.
  3. "Xinhua Headlines: World's longest cross-sea bridge opens, integrating China's Greater Bay Area". Xinhua Net. 2018-10-23. Archived from the original on 2019-03-27. Retrieved 2018-10-24.
  4. "Cars and buses begin crossing the Pearl River Delta as Hong Kong-Zhuhai-Macau Bridge opens to traffic". Retrieved 2018-10-24.
  5. https://www.scmp.com/video/china/2169817/chinese-president-xi-jinping-declares-hong-kong-zhuhai-macau-bridge-open
  6. 6.0 6.1 "పొడవా...టి సముద్ర బ్రిడ్జి ప్రారంభం". epaper.sakshi.com. Archived from the original on 2018-10-24. Retrieved 2018-10-24.
  7. Tsang, Denise (2018-10-23). "Tycoon's 35-year dream finally realised as mega bridge opens". South China Morning Post. Retrieved 2018-10-23.
  8. Stoner, Tad (3 November 1988). "$6b bridge to China plan". South China Morning Post. p. 1.
  9. Hunt, Christopher (29 December 1989). "Entrepreneur Becomes a Weather Vane For Resuming Business in China Now". The Wall Street Journal, Eastern edition. p. 1.
  10. Cheung, Agnes (29 March 1995). "First Lingdingyang link nearly ready". South China Morning Post. p. 11.
  11. Szeto, Wanda; Ng, Kang-chung (31 December 1997). "Beijing approves Zhuhai-HK bridge". South China Morning Post. p. 1.
  12. "A bridge too far". South China Morning Post. 2 January 1998. p. 12.