హస్ముఖ్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హస్ముఖ్ పటేల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు పరేష్ రావల్
నియోజకవర్గం అహ్మదాబాదు తూర్పు

వ్యక్తిగత వివరాలు

జననం (1960-11-11) 1960 నవంబరు 11 (వయసు 63)
జగుడాన్, మెహసానా, గుజరాత్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సోమాభాయ్ బబల్దాస్ పటేల్, హీరాబెన్
జీవిత భాగస్వామి సురేఖాబెన్ పటేల్
సంతానం డా. నితిన్ పటేల్ & 1
నివాసం 32 విశాల పార్క్, కేడిలా వంతెన దగ్గర, ఘోడసర్, అహ్మదాబాద్, గుజరాత్
వెబ్‌సైటు [1]

హస్ముఖ్ భాయ్ సోమాభాయ్ పటేల్ (జననం 11 నవంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు అహ్మదాబాదు తూర్పు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

హస్ముఖ్ పటేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012 నుండి 2019 వరకు రెండుసార్లు  శాసనసభ్యుడిగా ఎన్నికై 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మదాబాదు తూర్పు లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గీతాబెన్‌ పటేల్‌పై 4,34,330 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2019 నుండి జూన్ 2024 వరకు పార్లమెంట్‌లో నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా,  కన్సల్టేటివ్ కమిటీ, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ సభ్యుడిగా పని చేశాడు.

హస్ముఖ్ పటేల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మదాబాదు తూర్పు లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి హిమ్మత్‌సిన్హ్ ప్రహ్లాద్‌సింగ్ పటేల్‌పై 4,61,755 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (10 April 2024). "Report card for Ahmedabad East: BJP MP Hasmukhbhai Somabhai Patel's MPLAD funds lowdown, questions asked in Parliament" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. Hindustan Times (4 June 2024). "BJP's Hasmukhbhai Patel wins Ahmedabad East seat" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ahmedabad East". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.